జర్నలిస్టు పిట్లల శ్రీశైలం విడుదల డిమాండు చేయండి!!
తన వృత్తిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకుడ్ని ఒకర్ని ఇంటర్వూ చేద్దామని వెళ్ళిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలం(33)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకాశం జిల్లా కందుకూరు లో అరెస్టు చేశారు. శ్రీశైలం మావోయిస్టులకు కొరియర్ గా పనిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు.
మంగళవారమే (04-12-2007) తనను పోలీసులు అరెస్టు చేశారనీ శ్రీశైలం మీడియా ముందు చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే శ్రీశైలం తనపై వచ్చిన ఆరోపణలన్ని కట్టుకథలని ఖండిస్తున్నారు. అయినా పోలీసులు రకరకాల కేసులు పెట్టి వేదిస్తున్నారు. విలేకర్లతో, మీడియాతో శ్రీశైలంను ఎంతోసేపు మాట్లాడనివ్వడం లేదు.
దీనంతటికీ కారణం జర్నలిస్ట్ శ్రీశైలం ఒక ప్రత్యామ్నాయ మీడియం ఏర్పాటు చేయడం, ఈ కృషిలో భాగంగా “మూసీ టీవీ” పేరుతో తెలంగాణ జిల్లాలో జరుగుతున్న రాజకీయ, సామాజిక, సాహిత్య కార్యక్రమాలను రికార్డు చేసి జనం ముందు తీసుకొని రావడం. దీనివల్ల తెలంగాణలో జరిగే అనేక అన్యాయాలను, వార్తాంశాలను బయటపెడుతూ, తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయడంలో శ్రీశైలం నిరంతరం కృషిచేస్తున్నారు. అంతే కాదు తెలంగాణ జర్నలిస్టుల కార్యక్రమాలను, పల్లె పాటలను కూడా మూసీ టీవీ ద్వారా అందిస్తున్నారు. ఒక జర్నలిస్టుగా అనేక అభిప్రాయాలను ఇంటర్నెట్ పత్రిక “మూసీ టీవీ” ద్వారా అందిస్తున్నారు. పాత్రికేయ వృత్తిలో భాగంగా రకరకాల వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. మావోయిస్టుల సమాచారాన్ని ప్రజలకు చేరనివ్వకుండా ప్రభుత్వం వివిధ ఆటంకాలను కల్పించాటానికి రకరకాల కథనాలను చెప్తుంటారు. దీనిలో భాగమే జర్నలిస్ట్ శ్రీశైలం పై కొరియర్ అనే ముద్ర వేసి ఆయన్ని అరెస్టు చేయడం. దీన్ని ఇప్పటికే ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారు. జర్నలిస్టులు ర్యాలీలు చేస్తున్నారు.
పోలీసులు శ్రీశైలం పై పెట్టిన కేసులను ఎత్తివేసి వెంటనే ఆయన్ని విడుదల చేయాలనీ, భారత రాజ్యాంగం ఇచ్చిన పత్రికా స్వేచ్ఛ కాపాడవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు చేస్తున్న ప్రచారం వల్ల శ్రీశైలం కు ప్రాణ హాని తలపెట్టే అవకాశం కూడా ఉంది. ఈ చర్యను అందరు ముక్తకంఠంతో ఖండించవలసింది గా విజ్ఞప్తి చేస్తున్నాం.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment