Tuesday, April 22, 2008

అక్షరం ‘అ’

అక్షరం ‘అ’
అంకులు = అక్షరాలు, అంకెలు
అంగట్ల అమ్ముకచ్చుడు = ఒక వ్యక్తిని, అతని ప్రవర్తనను పూర్తిగా బహిరంగపరచడం, చులకన చేయడం, నిందించడం.
అంగడి = సంత
అంగడి అంగడి అవుడు, అంగడి జేసుడు = ఇంట్లోని సామాన్లను చిందరవందర చేయడం
అంగడి పెట్టుడు = ఇంట్లోని సామాన్లను బయట వేయడం
అంగవడుడు = ఒల్లు వంచి శ్రమించడం
అంగామ (హంగామా) (ప) = హడావుడి, ఆడంబరం
అంగి, అంగీ = చొక్కా
అంగి రైకె పెట్టుడు = పిల్లలకు చొక్కా, తల్లికి రవిక పెట్టడం (సాధారణంగా కట్నాలు పెట్టునప్పుడు వాడుతారు)
అంగిలాగు = చొక్కా, ప్యాంటు లేదా నెక్కరు (డ్రెస్)

No comments: