on 10 జులై 2007 at 9:10 pm1Ramulu
మా మేనల్లుడు ఇంతకు ముందు నేను తెలంగాణ గురించి ఎప్పుడన్న ప్రస్తావిస్తే చర్చించటానికి కూడా ఇష్ట పడె వాదు కాదు .ఐనా పై జవాబు నేను రాసిన తరువాత వాడు నాదగ్గరికి వస్తే నేను రాసిన పై జవాబు చూపించాను. వాడిచ్చిన కొన్ని జవాబులు నన్నే అశ్చర్య పరిచాయి. అందుకే ఇక్కడ అంశాల్ వారీగా రాస్తున్నాను,నా జవాబుకు కొనసాగిమ్పుగా ఉంటుందని.
1.ఒకప్పుడు బ్రిటీషుచవారికి వ్యతిరేకంగా’ సైమన్్ గోబ్యాక్ ‘ అంటూ మన తెలుగు వాళ్ళు కూడా నినదించారు కదా! అలాగే మన తెలంగాణవాళ్ళను ‘దోచుకుంటున్న’, మనకు ‘ బ్రతుకు లేకుండ చేస్తున్న’,మనలను ఆత్మ హత్యల పాలుచేస్తున్న ఆంధ్ర_సీమల దోపిడీ దొరలను ‘గోబ్యాక్’ అంటే తప్పెలా ఔతుంది? అంటూ ప్రశ్నించాడు.
2.భారతీయులంతా భరతదేశంలోని ఏరాష్ట్రానికైనా వెళ్ళడానికి,వ్యపార,వాణిజ్యాలు చేసుకోవడానికి,కంపెపెలు,కాలేజీలు పెట్టడానికి, సంపాదించుకోవడానికి,సంపదలు పెంచుకోవడానికి,స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి రాజ్యాంగ పరమైన హక్కులనే కలిగి ఉన్నారు.వారు కలిగి ఉన్నటువంటి హక్కులు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న మాకెందుకు ఉండవు,మాకెట్లా ఉండవు అంటూ సీతారాం వంటి చేయితిరిగిన ఇతర ప్రాంతపు రచయితలు, విధ్యావంతులు పరుశ్నిస్తున్నారు. నిజమే మరి అంటూ ఒప్పుకుందాం. కాని మాదగ్గరికి వచ్చి పనులు చేస్తున్న ,నివసిస్తున్నఇతర్ ప్రాంతపు ప్రజలు మా తెలంగాణ వేరుకావడానికి ఎందుకు అడ్డుతగులుతలేరు? అటువంటి వారినచాశ్నించంలి అంటూ సలహా ఇచ్చాడు. అంతేకాదు ఉత్తరాంచల్,జార్ఖండ్,చత్తీస్గడ్ వంటి ప్రాంతాలకు వేరుపడటానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మా తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాలి అనికూడా అన్నాడు. అదీకాక ఉత్తరాంచల్ వేరౌతున్నప్పుడు_ ఉత్తరప్రడదేశ్ ,చత్తీస్గడ్ ఎర్పడుతున్నప్పుడు_ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎందుకు బలంగా అడ్డు తగలలేదని అన్నాడు. అవి ఎందుకు అడ్డు తగల లేదంటే వేరైనా తమకు వచ్చేనష్టాలేమీ పెద్దగాఉండవు కాబట్టి. ఇప్పుడు మన ఆంధ్ర_సీమల తెలుగు సోదరులు ఎందుకంత హైరానా పడుతున్నారు?ఎందుకంత అడ్డుతగులుతున్నారు? ఎందుకంత దిగాలు పడుతున్నరు? ఎందుకంత ప్రరిఘటిస్తున్నారు? ఎందుకంటే వారికి విపరీతంగా వస్తున్న ఆందాని(సంపదలు,భోగాలు,లాభాలు) ఆగిపోతుంది కాబట్టి,అని కూడా వాడే సమాధానం చెప్పాడు.
3.అమెరికా,బ్రిటన్ వంటి విదేశాల్లో పరదేశీయులకు మేనేజింగ్,కంట్రోలింగ్్ వంటి ఉన్నత స్తాయి పోస్టులు ఇస్తలేరు, ఇతర పోస్టులలో కి వచ్చిన కంప్యూటర్ పనివాళ్ళు( నిపుణులు )కూడా తమ సంపద పెంచేందుకే వస్తున్నరు కాబట్టి ఎప్పటికి మన వారిని ‘గోబ్యాక్’ అనే అవసరమే రాదు అంటూ సమధానమిచ్చాడు. ఇందుకు విరుద్ధంగా ఇతర్ ప్రాంతపు తెలుగు వాళ్ళు మన తెలంగాణకు వచ్చి,మనలోని కొందరిని బానిసలుగా చేసుకొని(డబ్బుద్వారా,పదవుణింపిణి ద్వార) మనకు చెందిన ఉన్నత ఉద్యోగాలను రకరకాలైన మాయోపాయాలచేత (తమకు,తమవారికి మాత్రమే ఉన్నతోద్యోగాలు,కాలేజీలలో సీట్లు, ప్రాజెక్టుల కాంట్రాక్టులు) దక్కించుకుంటున్నారు /కైవసం చేసుకుంటున్నారు . మనకేమో చిన్న,చిన్న ఉద్యోగాలు (ఈమధ్య అవికూడా లేవు) ఇస్తున్నారు. ఇటువంటి పనులు వేరే దేశం నుంచి వచ్చిన వారు చేస్తే ఈ/ఆ దేశాలు సహిస్తాయా? అప్పుడు మాత్రం తప్పకుండ ‘ గో బ్యాక్’ అంటు నినదిస్తాయి అంటూ చిన ఉపన్యాసమే ఇచ్చాడు. ఇటువంటి సమాధనం విని నేను డంగై పోయినాను.
Wednesday, April 23, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment