Friday, October 24, 2008

తెలంగాణము

- శ్రీ ఆదిరాజు వీరభద్రరావు

కర్నూలు జిల్లాలోని శ్రీశైలము, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామము, కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము- ఈ మూడును గొప్ప శైవక్షేత్రములు. ఈ మూడు లింగముల మధ్యనున్న దేశమునకు త్రిలింగదేశమని పేరు వచ్చినది. ఆణెము అనగా దేశమని అర్థము. కావున త్రిలింగ దేశము త్రిలింగనాణెము, త్రిలింగాణము అయినది. త్రిలింగాణ శబ్దమే మారి తెలంగాణెము, తెలంగాణము అనుపేరు వ్యవహారములోనికి వచ్చినది. శాసనములలో దీనిని తిలింగమనిరి. ముసల్మాను చరిత్రకారులు దీనిని తిలింగ్‌ అనియే వ్యవహరించింది. ప్రజలు తైలంగులయిరి.

శ్రీశైలంతు సమారభ్య - చోళేశాన్మధ్యభాగ్యతః
త్రైలాంగ దేశో దేవేశి - ధ్యానాధ్యయన తత్పరః

అను తంత్ర శాస్త్రమును బట్టి త్రైలింగులు అనగా తెలుగువారు ధ్యాన, అధ్యయన తత్పరులుగా నున్నట్లు ప్రశంసింపబడియున్నారు.

తెలంగాణ మనగా తెలుగువారుండు దేశమని అర్థము. ఇది ప్రాచీనపదము. ఒకప్పుడు తెలంగాణము దక్షిణాపథమున విశాల భూభాగమును ఆక్రమించి యుండెను. కాని కాలక్రమమున తెలంగాణము చీలికలయి, వేర్వేరు రాజుల ఆధిపత్యములోకి వచ్చినందున వేర్వేరు నామమలను బొందెను, అయినను హైదరాబాదు రాష్ట్రములోని హైదరాబాదు, వరంగల్లు, ఖమ్మముమెట్టు, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ అను తొమ్మిది జిల్లాలకు ప్రాచీన తెలంగాణ శబ్దమే నిలిచిపోయినది. తెలంగాణ పదము ఈ తొమ్మిది జిల్లాలకు అన్వయిచుచు, రాజకీయ పత్రములందు వ్యవహరించుచున్నారు. ఈ తొమ్మిది జిల్లాల యందును తెలుగువారు ప్రధానముగా నుంటచే తెలంగాణ శబ్దము సార్థకముగా నున్నది. అసలీ తెలంగాణమే తెలుగువారికి ఆది నివాస భూమిగా నుండెను. ఇచ్చిటి నుండియే వారు పలు ప్రాంతములకు విస్తరిల్లిరి. ఆ ప్రాంతములందు ఆంధ్ర శబ్దము ప్రచారమునకు వచ్చి, ఆంధ్రప్రాంతంగా రూఢియై పోయినది. తెలుగువారు ఆంధ్రులు గనుకను, ఆంధ్రులు తెలుగువారు గనుకను ఇప్పుడంతయు తెలంగాణమే, అంతయు ఆంధ్రాణమే.

ఆంధ్రులు ప్రాచీనులు ఐతరేయ బ్రాహ్మణమునందు ఆంధ్రుల ప్రశంసకలదు. రామాయణ, మహాభారతము లందును ఆంధ్రులను గూర్చిన ప్రశంస కలదు. రామాయణ కథలోని పర్ణశాల తెలంగాణమునకు చెందినదే. వరంగల్ జిల్లా, జనగాం తాలూకాలోని జీడికల్లు నందే శ్రీరాముడు మాయా కురంగమును వధించినట్లు ఐతిహ్యము కలదు. శ్రీరాముడు సుగ్రీవునితో మైత్రిచేసిన కిష్కిందాపురము ఈ రాష్ట్రములోని ఆనెగొంది ప్రాంతమని చరిత్రకారులు నిర్ణయించియున్నారు.

ప్రాచీనకాలములో తెలంగాణ నివాసులు విశిష్ట సభ్యత కలవారయి యున్నట్లు నిజమాబాదు నుండి మధిర వరకును గనబడుచున్న “కెయిరను” లను సమాధుల పరిశీలనము వలన తేలుచున్నది. కాని ఆనాటి అనగా సుమారు మూడువేల సంవత్సరముల క్రిందటి చరిత్ర తెలియుట లేదు.

ఆర్యులు దక్షిణాపథమునకు ఎప్పుడు ఏతెంచిరో సరిగా తెలియదు. మౌర్య చక్రవర్తుల కాలము నాటికే తెలంగాణమున ఆంధ్ర రాజన్యులు ప్రబలులై యున్నట్లు తెలియుచున్నది. అయినను మౌర్యవంశ రాజులు ఆంధ్రరాజ్యమును జయించి మగధ రాజ్యములో చేర్చుకొనిరి. అశోకవర్ధన మహారాజు, మరణానంతరము క్రీస్తుకు పూర్వము మూడవ శతాబ్దములో ఆంధ్రులు విజృంభించి తిరిగి ఆంధ్ర రాజ్యమును స్థాపించిరి.

దక్షిణాపథములో వెలిసిన మొట్టమొదటి గొప్ప రాజ్యము ఆంద్రులది. ఈ ఆంధ్ర రాజ్యమును స్థాపించిన కీర్తి శాతవాహన వంశమునకు చెందవలసి యున్నది. శాతవాహనుడు, శ్రీముఖుడు, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టిపుత్ర పులుమాయి, రెండవ పులుమాయి, యజ్ఞశ్రీ శాతకర్ణి మున్నగు ఆంధ్ర రాజులు శాతవాహన వంశీయులు ముప్పది యిద్దరు రాజులు క్రీస్తు శకము 225 ప్రాంతము వరకు పరాక్రమోపేతులయి దక్షిణాపథము నంతయునేలిరి. శాతవాహనుల విశాల సామ్రాజ్యములో తెలంగాణము చేరి యుండెను.

శాతవాహనులు ఆంధ్రులైనను వారిది ఆంధ్రభాష కాదు. అప్పుడు ప్రజల భాష ప్రాకృత భాషయై యుండెను. శాతవాహనులు దాక్షిణాత్య సంస్కృతిని తీర్చి దిద్దిరి. కళలను పెంపొందించిరి. వైదిక మతావలంబకులైనను బౌద్ధ, జైన, మతములయెడ ఆదరాభిమానములు చూపిరి. వర్తకము విస్తరిల్లెను. వీరికి ముప్పది కోటలు, రెండు వేల ఆశ్విక దళము, వేయిగజములు, లక్ష కాల్బలము ఉండెను. మెదకు జిల్లాలోని కొండాపురం వారి టంకసాల నగరముగా నుండెను. శాతవాహనుల తరువాత క్రీస్తు శకము మూడవ శతాబ్దము మొదలుకొని రెండు మూడువందల సంవత్సరముల వరకు తెలంగాణ చరిత్ర తెలియుట లేదు. చిన్న చిన్న సంస్థానములు ఉండి యుండెనేమో !

శాతవాహనుల తరువాత చెప్పుకోతగ్గ వారు చాళుక్యులు. క్రీస్తు శకము ఆరవ శతాబ్దములో చాళుక్యుల కథతో చరిత్ర ప్రారంభమగుచున్నది. ఆరవ శతాబ్దములో రెండవ పులకేశి అను మహారాజు మహాశూరుడయి,దిగ్విజయయాత్రలు చేసి నర్మదానదికి దక్షిణ భాతమునంతయు తన ఏలుబడిలోనికి తెచ్చెను. తెలంగాణములో కొందరు సామంతరాజులు వెలిసిరి. చాళుక్యులు ఎల్లప్పుడు పల్లపులతో యుద్ధము చేయుచుండిరి. ఎనిమిదవ శతాబ్ది మధ్య భాగమున రాష్ట్ర కూటులు రాజ్యాధి పతులయిరి. చాళుక్యులు తిరిగి పరాక్రమించి రాజ్యమును జయించి సుమారు రెండు వందల సంవత్సరములు తమ యాధిపత్యమును నిలుపుకొనిరి. చాళుక్యుల అధికారము క్రీ.శ. 1189లో అంతమొందెను. చాళుక్యులు శైవమతాభి మానులు. తెలంగాణములో కాలాముఖ శైవము, పాశుపత శైవము, లకులీశ శైవము ప్రబలియుండెను. చాళుక్యులు శిల్ప సంగీత నాట్యకళలను ప్రోత్సహించిరి.

తరువాత హోయిసలులు, యాదవులు, అధిపతులైరి. దక్షిణాపథము నేలిన హిందూరాజులో యాదవులే కడపటివారు.

చాళుక్యులకు ఓరుగంటి నుండి అనుమకొండ విషయమును ఏలుచుండిరి. చాళుక్యుడయిన ఆరవ విక్రమాదిత్యుని మరణానంతరము కాకతీయ రాజగు రెండవ ప్రోలరాజు చాళుక్యాధికారమును ధిక్కరించి స్వతంత్రుడయ్యెను. కాకతీయులకు ఒరుగల్లు రాజధానిగా నుండెను. దీనినే ఏకశిలాగనరమనుచుండిరి. ఇప్పుడు వరంగల్లు అనుచున్నారు. కాకతీయులు ఒరుంగల్లు మొదలి పట్టణంబుగా, శ్రీ స్వయంభూదేవ దివ్యశ్రీపాద పద్మారాధకులై, విదితవిక్రమశీలురై పరమమాహేశ్వర వీరలక్ష్మి ఆంధ్ర భూభాగమునంతయు ఏకఛత్రచ్ఛాయకు తెచ్చిరి. విశాల సామ్రాజ్యము ఏర్పడెను. తెలంగాణ వాసుల ప్రభ తేజోవంతముగా వెలిగెను. ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర భాష ప్రశస్తి చెందెను. కాకతీయ సామ్రాజ్యకాలము ఆంధ్రులకు స్వర్ణయుగముగా ప్రకాశించెను. కాకతీయులలో కడపటివాడు ప్రతాపరుద్రదేవ మహారాజు. కాకతీయ సామ్రాజ్యము విధిక్రమము ననుసరించి క్రీ.శ. 1323లో అస్తమించెను. తెలంగాణమున ముస్లిం రాజుల పరిపాలనము ప్రారంభమయ్యెను.

ఢిల్లీ సుల్తానుల కన్నులు 1303లో ఓరుగల్లుపై పడెను. వారి ప్రయత్నము లన్నియు విఫలము లయ్యెను. కాని 1321లో మహమ్మదు బిన్ టోగ్లకు ఘోరయుద్ధచేసి ఓరుగల్లును వశపరుచుకొనెను. దక్కను అంతయు మొగలుల స్వాధీనమయ్యెను. ఆంధ్రులలో ఐకమత్యము లేనందున స్వార్ధపరులమూలకముగా తెలంగాణ రాజ్యము బ్రద్దలయ్యెను. మొగలుల ప్రభ వెలుగసాగెను. అయినను క్రీ.శ. 1335-1336 ప్రాంతములో ఆంధ్రనాయకులు తిరుగబడి ముసల్మానులను జయించి ఓరుగంటి కోటను వశపరుచుకొని ఆంధ్ర హిందూ రాజ్యమును మరల ప్రతిష్టాపించిరి. కాని ఈ ఐకమత్యము ఎక్కువ కాలము నిలువలేదు. తమలో తాము పొట్లాడు కొనసాగిరి. ఓరుగల్లు, రాచకొండ రాజ్యములు తెలంగాణము లో ఏర్పడెను. ఆంధ్రజాతి దుర్బలస్థితి చెందెను.

క్రీ.శ. 1347 లో గుల్బర్గాలో బహమనీ రాజ్యము ఏర్పడి తిరిగి దక్కను ముస్లిం పాలకుల క్రిందికివచ్చెను. 1417లో బహమనీ నవాబు మహబూబ్‌నగర్ జిల్లాలోని పానుగల్లు దుర్గమును ముట్టడించెను. విజయనగరము, ఓరుగల్లు రాజులు, సరదారులు గొప్ప సైన్యముతో బహమనీ నవాబులను ఎదురించిరి. పెక్కు యుద్ధములు జరిగెను. ఉభయ పక్షములు పడుచు, లేచుచుండెను తెలంగాణము బహనీ నవాబుల వశమయ్యెను. క్రీ.శ. 1527లో బహమనీ రాజ్యము అస్తమించెను. బహమనీ రాజుల కాలములో తెలంగాణము యుద్ధరంగముగా మారెను. ప్రజల కష్టపడిరి.

బహమనీ రాజ్యములోని గోలకొండసీమకు కులీ కుతుబుల్ ముల్కు అనువాడు 1512 లో బహమనీ రాజ్యములో ఒక సుబేదారుగా నియమితుడయ్యెను. ఇతడు స్వాతంత్య్రము ప్రకటించి గోలకొండ రాజధానిగా తెలంగాణమునకు అధిపతి అయ్యెను. గొలకొండ కుతుబుషాహీల కాలములో తెలంగాణము స్వస్థత చెందెను. తెలంగాణమునకు గోలకొండ కేంద్రమయి విరాజిల్లెను. కుతుబుషాహీ వంశములో ఆఖరువాడు అబుల్ హసన్ తానేషా (తాన్షాహా). ఇతనిని జయించి ఔరంగజేబు చక్రవర్తి 1687లో తెలంగాణమును మొగలు సామ్రాజ్యములో జేర్చెను. కుతుబుషాహీల కాలములోనే హైదరాబాదు నగరము నిర్మాణమయ్యెను (1591)

క్రీ.శ. 1713లో మొగలు సుబేదారుగా ఆసఫ్జా నిజాముల్ ముల్కు హైదరాబాదు వచ్చెను. ఇతడు 1724లో స్వాతంత్య్రము ప్రకటించి ప్రస్తుతపు నిజాము ప్రభువు వంశమునకు మూలపురుషుడయ్యెను. నిజాము ప్రభుత్వ ప్రారంభముననే ఇంగ్లీషువారు, ఫ్రెంచివారు రాజకీయరంగము న ప్రవేశించిరి. నిజాములు ఇంగ్లీషు వారికి సామంతులయిరి. రెండవ నిజామగు నిజామలీఖాను 1766లో ఉత్తర సర్కారు లను, 1800లో రాయలసీమను ఇంగ్లీషువారికి దత్తత చేసెను. విశాలమయిన తెలంగాణము రెండుభాగములుగా రాజకీయముగా విడివడిపోయెను. నిజాముల మంత్రులలో సర్సాలారుజంగు ప్రముఖుడు. ఇతడు పరిపాలనమున మంచి సంస్కరణలు చేసేను. ప్రస్తుతపు నిజాం సర్ మీరు ఉస్మానలీఖాన్ బహద్దరు వారు సప్తమ నైజాము. శ్రీవారు 1911లో సింహాసనమెక్కిరి. వీరు తమ పరిపాలనా కాలమున పెక్కు రాజకీయ సంస్కరణములు కావించి రాజ్యమును సువ్యవస్థితముగా నొనర్చిరి. ఇప్పుడు ప్రజాస్వామిక పద్ధతుల మీద రాజ్యాంగము నడుచుచున్నది. 1950 జనవరి 26 గురువారమునాడు హైదరాబాదు రాష్ట్రము భారత యూనియనులో విలీనమయ్యెను. నిజాము ప్రభువు “రాజప్రముఖ” పదవి వహించియున్నారు.

(తెలంగాణం, మొదటి భాగం, దేశోద్దారక గ్రంథమాల, 1956 సంకలనం : వట్టికోట ఆళ్వారు స్వామి)

బౌద్ధంతో మొదలైన తెలంగాణా చరిత్ర

- తిరుమల రామచంద్ర

తెలంగాణ చరిత్ర బుద్దుని సమకాలీన చరిత్ర. నిజామాబాద్ జిల్లాలోని నేటి బోధన్‌లో బవరి అనే విద్యాంసుడు ఉండేవాడు. అతడు బుద్దుని చరిత్రను కర్ణాకర్ణికగా విన్నాడు. బుద్దుని తథాగతి - సత్యమార్గం - అతనికి నచ్చింది. తన శిష్యులను బుద్దుని దర్శించి, అతని అష్టాంగ మార్గాన్ని ఆకళించుకొని రమ్మని రాజగృహానికి పంపాడు. వారు బుద్దుని సన్నిధానంలో కొంతకాలం ఉండి, అతని తథాగతిని యథావత్తుగా గ్రహించి బోధన్‌కు తిరిగి వచ్చారు. సంతృప్తితో బవరి పండితుడు ఆ మార్గాన్ని అనుసరించాడు. ప్రజలలో ప్రచారమూ చేశాడు. బుద్దుని సమకాలంలోనే అతని ఉపదేశాలు వేలమైళ్ళ దూరంలో ఉన్న తెలంగాణ ప్రజలను ప్రభావితం చేశాయన్నప్పుడు మంచిపట్ల వారి అభిముఖ్యం ఎంత నిశితమైందో మనం అంచనా వేయవచ్చు.

ప్రాగైతిహాసిక యుగం
తక్కిన ఆంధ్రదేశంతో పాటే తెలంగాణాను ప్రాగైతిహాసిక కాలంలో మానవుడు మూడులక్షల సంవత్సరాల నుంచి నివసిస్తున్నట్లు తెలుస్తున్నది. వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలో జరిగిన తవ్వకాలలో శిలాయుగపు ఆయుధాలు, పరికరాలు లభించాయి. డోర్లగల్లు - ఆత్మకూరు కనుమ దగ్గర శిలాయుగ పరికరాల పరిశ్రమ విశేషంగా సాగింది. తెలంగాణ ఆదిమానవుడు శిలాయుగం నుంచి మరికొంత ముందడుగు వేసి, నూతన శిలాయుగంలో ప్రవేశించి, ఆహరాన్ని పండించుకొని దేశ దిమ్మరితనం తగ్గించుకొని కొండమీద, కొండ ఆడివారాలలోను నివాసాలు ఏర్పరచుకొన్న చిహ్నాలు కూడా వరంగల్లు, నల్లగొండ జిల్లాల్లో తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మరికొంత సభ్యత ఏర్పడిన తర్వాత తెలంగాణ మానవుడు లోహయుగంలో ప్రవేశించి కంచు, ఇనుము పరికరాలను నిర్మించుకొన్నాడనడానికి తెలంగాణా అంతటా ముఖ్యంగా వరంగల్లు, కరీంనగర్, నల్లగొండ జిల్లాలోని “రాకాసి గుళ్ళు” నిదర్శనం.

చరిత్రయుగం తెలంగాణాలో బౌద్దంతో ప్రారంభమయింది. బోధన్ శాతవాహనులకు ముందే, శుంగకాణ్వుల కాలంలోనే ప్రసిద్ధమైంది. ఇది అస్మక దేశంలోని ప్రధాన పట్టణాలలో ఒక్కటి. అక్కడి నుంచి తెలంగాణా అంతటా బౌద్ధం వ్యాపించింది. గుమ్మడిదుర్రు, ఫణిగిరి మున్నగు ప్రాంతాలలో జరిగిన తవ్వకాలలో వెలువడిన బౌద్ధ స్తూపావశేషాలు, బుద్ధ విగ్రహాలు ఈ వ్యాప్తికి నిదర్శనం, ఆంధ్రబౌద్ధులలో తర్వాత ఏర్పడిన చైత్యక, అపరశైలేయ, రాజగిరీయాది శాఖలలో రాజగిరీయులు రాచకొండవారయి ఉంటారని లేక యాదగిరిగుట్ట ద్వారమైన రాయగిరివారు అయినా కావచ్చునని తెలుగుభాషా సమితి విజ్ఞాన సర్వస్వం ప్రధాన సంగ్రాహకులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు భావిస్తున్నారు.

బోధన్ పట్టణం, తర్వాత జైనమతానికి కూడా ఆటపట్టయింది, అక్కడి నుంచే జైనం కొలనుపాక మున్నగు ప్రాంతాలకు వ్యాపించింది. బోధన్‌లో గొప్ప గోమటేశ్వర విగ్రహం ఉండేదని, దానిని చూచిన తర్వాతనే హొయసళుల కాలంలో శ్రవణ బెళగొళ గోమటేశ్వర విగ్రహం వెలసిందని అంటారు.

మరొక సంగతి, జైనులు ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా మొదట ఒక సరోవరం తవ్వించేవారు. దాని తీరంలో తీర్థంకరుల విగ్రహాలు స్థాపించేవారు. కొలనుపాక, అంటే కొలను వున్న పాక-వూరు. కొలనున్న జైనుల పర్ణశాల అని అర్ధం. దీనికి ప్రతికృతి అయిన శ్రవణ బెళగొళ జైన శ్రమణుల కొలను. కొలనుపాకలో మేఘచంద్రాది ప్రసిద్ధ జైనాచార్యులున్నట్టు జైనుల మతగ్రంథమైన అనంతపాసాదిక తెలుపుతున్నది. కాని బోధన్‌లోని గోమటేశ్వరుని విగ్రహం జాడ తెలియదు. జైన శైవ సంఘర్షణలో ముక్కలు ముక్కలయిందేమో! కొలనుపాకలో మాత్రం జైన తీర్ధంకరులలో ఒకడైన వృషభనాథుని పచ్చరాతి విగ్రహం నేటికి పూజలందుకుంటున్నది.

సాతవాహనులు
సాతవాహనుల కాలం నుంచి తెలంగాణా చరిత్ర స్పష్టంగా తెలుస్తున్నది. తెలంగాణ సాతవాహనుల ఏలుబడిలోకి వచ్చినట్లు మెదక్ జిల్లా కొండాపురం, కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, ధూళికట్ట, నల్లగొండజిల్లాలోని సూర్యాపేట, ఫణిగిరి, వర్ధమానుకోట మున్నగు చోట్ల జరిగిన తవ్వకాలలో సాతవాహన చక్రవర్తుల నాణేలు, మట్టిబొమ్మలు, మట్టిపాత్రలు మున్నగునవి లభించడం నిరూపిస్తున్నవి. ఇటీవల 1982 అక్టోబరు నెలలో రాష్ట్ర పురాతత్త్వశాఖ డైరెక్టరు డాక్టర్ కృష్ణశాస్త్రిగారు నల్లగొండజిల్లా, తుంగతుర్తి తాలూకా వర్ధమానుకోటలో కోటదిబ్బ అనే ప్రాంతంలో జరిపిన పరిశోధనలలో సాతవాహనుల కాలపు నిర్మాణాలు వెలువడ్డాయి. సీసంతో తయారయిన వర్తులాకారపు నాణేలు లభించాయి. వాటిపైన, మధ్యన గుర్రం, చుట్టూ బ్రాహ్మిలిపిలోని శాసనం “మహాతలవరస వాజసామికస సవస…” అని ఉన్నాయి. ఈ నాణేల వంటి మట్టిముద్రికలు కరీంనగర్ జిల్లా పెద్దబంకూరు త్రవ్వకాలలో దొరికాయి. దీనినిబట్టి క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాలలో కరీంనగర్, వరంగల్, నల్లగొండజిల్లా ప్రాంతాలను మహా తలవర బిరుదాంచితులైన వాజసామికులు, ఆశ్వపతి వంశీయులు, సాతవాహన సామంతులు పాలించి ఉంటారని డాక్టర్ శాస్త్రి అభిప్రాయపడు తున్నారు. జనగామ నుంచి సూర్యాపేట మార్గంలో ఇంతకు ముందు ఫణిగిరి, తిరుమలగిరి, గాజులబండ వద్ద బౌద్ధ క్షేత్రాలు కనుగొన్నారు. మధ్య భారతదేశం నుంచి బౌద్ధ యాత్రికులు వర్దానది నుంచి ప్రాణహితానది ద్వారా గోదావరిదాటి కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలు చేరేవారు. అక్కడి నుండి పాషిగాం అనే గ్రామం వద్ద (కనుగొన్న) బౌద్ధక్షేత్రం దర్శించి, ఫణిగిరి చేరేవారని తెలుస్తున్నది. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ పయనించిన మార్గం ఇదేనని స్పష్టమవుతున్నదని డాక్టర్ కృష్ణశాస్త్రి అభిప్రాయపడుతున్నారు.

సాతవాహన చక్రవర్తులలో 17వ వాడైన హాల సాతవాహనుడు తన కాలపు కవుల ముక్తకాలను 700 లను ఏర్చి దండగా కూర్చాడు. దీనిపేరు గాథాసప్తశతి. దీనిలోని అల్లయవంటి పేర్లు చూడగా వారు తెలుగువారయి ఉంటారేమోననిపిస్తుంది. సప్తశతిలోని గోదావరి ఒడ్ల శృంగారాలు, జనుపచేలు, పత్తిచేలు, కుసుమచేలు, కుండల కపిల బావులు చూడగా తెలంగాణా ప్రాంతం సుందర ప్రతిరూపమా అనిపిస్తుంది.

తవ్వకాలు జరిగిన ప్రాంతాలలో కొండాపురానికి విశిష్ఠత ఉంది. కొండాపురం హైదరాబాదుకు వాయవ్యంగా 43 మైళ్ళ దూరంలో మెదక్ జిల్లా కలబగూడు తాలూకాలో ఉంది. ఈ గ్రామానికి అరమైలు దూరంలోని ఒక వాగు చెరువులో కలిసే ప్రాంతంలోని ఒక దిబ్బను త్రవ్వారు. మానవ జీవితానికి సంబంధించిన సకల వస్తువులూ, ఇళ్ళ పునాదులు చైత్యాలతో సహా బయటపడ్డాయి. కొండాపురం చాలా ప్రాముఖ్యం గల ఆంధ్ర సాతవాహన కేంద్రమయి ఉంటుందని, గ్రీకు రాయబారి మెగస్థనీస్ చెప్పిన ముప్పయి ఆంధ్రమహా నగరాలలో ఒకటయి ఉంటుందని విశ్వసించడానికి తగిన ఆధారాలు దొరికాయి. పురాణకాలపు కుండిన నగరం ఇదేనని కొందరి వూహ. గౌతమీ పుత్రశాతకర్ణి, వాశిష్ఠీపుత్ర పులమావి నాణేలు లభించడం వల్ల ఈ ప్రాంతం, తెలంగాణలో చాలా ప్రాంతం క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం మొదలు క్రీస్తుశకం 218 తర్వాత వరకు సాతవాహనుల ఏలుబడిలో ఉంది.

సాతవాహనుల పిదప తెలుగుదేశాన్ని పాలించిన ఇక్ష్వాకు, బృహత్పలాయన, ఆనందగోత్రుల పరిపాలన తెలంగాణలో ఉన్నట్టు కనిపించదు. సాతవాహన సామ్రాజ్య పతనానంతరం ఎవరికి వారు స్థానికులు మహాతలవరులై ఉంటారు. అభీరులు కొంతప్రాంతం, ఇక్ష్వాకుల సామంతులుగా పాలించినట్టు అభీరవసుషేణుని శాసనంవల్ల తెలుస్తున్నది.

తర్వాతి రాజులు
పిదప తెలుగుదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలంలో తెలంగాణలో నల్లగొండ మున్నగు ప్రాంతాలు వారి ఆధీనంలో ఉన్నట్టు తోస్తుంది. నల్లగొండ జిల్లాలోని ఇంద్రపాలపురం వారి రాజధాని. వీరికి వాకాటులతో సంబంధ బాంధవ్యాలున్నందున మెదక్, నిజామాబాద్ ప్రాంతాలు వాకాటుల పాలనలో ఉండేవి. ఇటీవల కీసరగుట్ట త్రవ్వకాలలో వెలువడ్డ అవశేషాలను బట్టి విష్ణుకుండినుల పాలన వాకాటుల సరిహద్దువరకు ఉండేదని స్పష్టం. సరిహద్ధులలో ఎవరూ రాజధాని నిర్మించుకోరు గదా! కనుక ఇంద్రపాలపురి వారి రాజధాని. ఈ వంశరాజులో ఒకడయిన ఇంద్రవర్మ పేరుతో ఈ నగరం వెలసి ఉండవచ్చు.

మహబూబ్‌నగర్ జిల్లా, తత్పరిసరాలను ‘చోళవాడి’ అనేవారు. చోళుల కాలం క్రీస్తుశకం 480 ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇది కొంత కాలం చోళుల అధీనంలో ఉండి ఉంటుంది.

విష్ణుకుండినుల అనంతరం తెలంగాణలో చాలాభాగం బాదామీ చాళుక్య, రాష్టక్రూట, కళ్యాణి చాళుక్యుల ఏడుబడిలో ఉంది. కళ్యాణి చాళుక్యులు, రాష్ట్ర కూటులు దుర్బలులయిన తర్వాత సామంతులు కొందరు స్వతంత్రులై స్వీయరాజ్యాలు స్థాపించారు. అట్టివారు వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కాకతీయులూను. వీరిలో మొదటి ఇద్దరు సామ్రాజ్యాలు స్థాపించలేకపోయారు. కాకతీయులు క్రీస్తుశకం 1158 నుంచి 1323 వరకు 165 సంవత్సరాలు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి పాలించారు.

ముదిగొండ చాళుక్యులు
బాదామీ చాళుక్వవంశం వాడైన రెండవ సత్యాశ్రయ పులకేసి వల్లభుడు క్రీస్తుశకం 624లో పూర్వ దిగ్విజయ యాత్రకు బయలుదేరి వేంగీకళింగాలను జయించి, తన సోదరులు కుబ్జ విష్ణువర్ధనుణ్ని పిష్టపురం (పిఠాపురం)లో వేంగీరాష్ట్రానికి, రణమర్ధనుని ముదిగొండ రాజ్యానికి రాజ ప్రతినిధులుగా నియమించాడు. ఈ వంశం వారు తమ తమ ప్రాంతాలలో స్ధిరపడినా, ముదిగొండ రాజ్యం వారు వేంగీ చాళుక్యులకు లోబడే వుండేవారు. కాని చాళుక్య భీముని, రెండవ భీముని కాలాలలో ముదిగొండ పాలకులు రాష్ట్ర కూటుల వల్ల చాల నష్టపడ్డారు. వీరి రాజ్యం రాష్ట్ర కూటుల రాజ్యానికీ, వేంగీ రాజ్యానికి మధ్య ఉన్నందున రాష్ట్ర కూటులు వేంగీపై దాడి జరిపినప్పుడెల్లా ముదిగొండ రాజ్యానికి చాలా నష్టం కలిగేది. ముదిగొండ రాజ్యం నేటి ఖమ్మంజిల్లా ప్రాంతం. కృష్ణాతీరంలోని కొండపల్లి నుంచి వరంగల్లు జిల్లాలోని కొరవి వరకు వ్యాపించి ఉండేది. రాష్ట్ర కూటుల, చాళుక్యులకు సహజ శత్రువులు కనుక తూర్పు చాళుక్య రాజ్యాన్ని మింగడానికి సిద్ధంగా ఉండేవారు. వేంగీలో రెండవ అమ్మరాజు రాజ్యకాలంలో అతనికి, సవతి అన్న అయిన దానార్ణవునికి సంఘర్షణ వచ్చింది. తిమ్మరాజు రాష్ట్ర కూట కృష్ణుణ్ణి సహాయం కోరాడు. ఇలాంటి అదనుకోసమే కాచుకున్న రాష్టక్రూట చక్రవర్తి తన సేనాపతి అయిన కాకతీగుండ సేనానిని దానార్ణవుని మీదికి పంపాడు. గుండసేనాని ముదిగొండవారి రాజ్యం ఆక్రమించుకొన్నాడు. పిదప వచ్చిన మార్పులో ముదిగొండ చాళుక్యులు రాజ్యం మరల సంపాదించుకొన్నారు. ముదిగొండరాజులు, కాకతీయులు పశ్చిమ చాళుక్యులకు లోబడే కలతలు లేకుండా ఉండేవారు. కాని, కాకతీయరుద్రుడు స్వతంత్రుడైన పిదప ముదిగొండ చాళుక్యులను పూర్తిగా వోడించి, ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకొన్నాడు. ముదిగొండ చాళుక్యులు కొంత కాలం కోస్తా ప్రాంతంలో కొలని రాజుల ఆశ్రయంలోగడిపి, మరల భద్రాచల ప్రాంతంలో స్వతంత్రులుగా తల ఎత్తారు. కాని, కాకతి గణపతి దేవుడు వారిని పూర్తిగా అణచివేసాడు.

పొలవాస రాజులు
ఇప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలోని పొలాస గ్రామాన్ని పూర్వం పొలవాస అనేవారు. ఇక్కడి సామంతులు క్రీస్తుశకం 1075 నుంచి 1160 వరకు చిన్న రాజ్యం పాలించారు. వీరి రాజ్యంలో జగిత్యాల, మంతెన, ములుగు, పర్కాల, నర్సంపేట తాలూకాలుండేవి. వీరు రాష్ట్ర కూటులు. వీరికి, పొరుగున ఉండే కాకతి రాజులకు బద్దవైరం. క్రీస్తుశకం 1127 లో భూలోకమల్ల సోమేశ్వరుడు చాళుక్య సామ్రాజ్యనికి చక్రవర్తి అయినప్పుడు అతని తమ్ముడైన యువరాజు తైలవుడు కందూరునాడులో రాజప్రతినిధి. ఇతడు స్వాతంత్య్రం ప్రకటించుకొన్నప్పుడు పొలవాస సామంతులు మేడరాజు, గుండరాజు చక్రవర్తిని ధిక్కరించి, తైలవుని సమర్ధించారు. 1138లో భూలోకమల్లుని కుమారుడు జగదేకమల్లుడు చక్రవర్తి అయి, తెలంగాణాలో చెలరేగిన విప్లవాన్ని అణచడానికి స్వయంగా తరలి వచ్చాడు. కాకతి ప్రోలరాజు చక్రవర్తి పక్షాన పొలవాస గుండరాజును యుద్దంలో చంపాడు. కందూరు నాడంటే జడ్చెర్ల సమీపంలోని కందూరు. ఇది పూర్వం ఒక ప్రాంతానికి ముఖ్యపట్టణం. ఇక్కడ పశ్చిమ చాళుక్యుల రాజప్రతినిధిగా తైలవుడు ఉండేవాడు.

వేములవాడ చాళుక్యులు
వేములవాడ చాళుక్యుల మూలపురుషుడు కూడా బాదామి సత్యాశ్రయ పులకేసి వల్లభుడే. వేములవాడ చాళుక్యులలో 8వ శతాబ్దంలో ఉన్నవాడు వినయాదిత్య యుద్దమల్లుడు. ఇతని ప్రధాన పట్టణం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ. యుద్దమల్లుని కుమారుడు అరికేసరి. ఇతడు రాష్టక్రూట నిరుపమ ధ్రువ చక్రవర్తి సామంతుడు, మహావీరుడు. చక్రవర్తి కోసం పెక్కు యుద్ధాలు గెలిచాడు. ఇతని మనుమడు రెండవ అరికేసరి. ఇతడు గొప్ప రాజతంత్రుజ్ఞడు, పరాక్రమశాలి. రాష్టక్రూట సామంతుడైనా, ఆ రాజవంశ కన్యను వివాహమాడాడు. ఈమె పేరు లోకాంబిక. ఇతనికి రాష్ట్ర కూట చక్రవర్తి అయిన గోవిందరాజుతో వైరం ఏర్పడింది. ఇతడు గోవిందరాజును ధిక్కరించి, జయించి, అతని పినతండ్రి అయిన బద్దెగ అనే వాడిని రాష్టక్రూట చక్రవర్తిగా ప్రతిష్టింపచేశాడు. అరికేసరి కర్నాట భాషా పోషకుడు. పంపడను మహాకవి ఇతని ఆస్థానంలో ఉండి భారతాన్ని జైన సంప్రదాయంతో అరికేసరి నాయకుడుగా విక్రమార్జున విజయమనే పేర రచించాడు. ఇది తెలుగువాడయిన పంపడు రచించిన తొలి కన్నడ కావ్యం, తెలంగాణాలో అవతరించింది. ఇది 10వ శతాబ్దంలోని నన్నయ్య భారతానికి ఒక శతాబ్దం ముందు రచితమైంది. పంపని తమ్ముడు జీవ వల్లభుడు వేయించిన గంగాధర పర్వత కన్నడ శాసనంలో చివరన మూడు తెలుగు కందాలు చెక్కించాడు. అవే తెలుగులో తొలి కందాలు. వానిలో ఒకటి ఉదాహరిస్తున్నాను.

“జిన భవనంబు లెత్తించుట
జినపూజ ల్సేయుచున్కి జీనమునులకు న
త్తిన యన్నదానం బీవుట
జినవల్లభు బోలగలరె జిన ధర్మపరుల్”

కాకతీయులు
కాకతీయుల పుట్టుపుర్వాలపై విశేష పరిశోదన జరిపి, అపూర్వ విషయాలు కనుగొన్న డాక్టర్ పివి పరబ్రహ్మశాస్త్రి తెలుపుతున్న విషయాలు క్రింద క్రోడీకరిస్తున్నాను.
కాకతీయులు మొదట్లో చాలా కాలము రాష్ట్ర కూట రాజుల సేనాపతులు. కాకతీయ వెన్నమ రాజు నాల్గవతరం వాడయిన గుండరాజు రాష్ట్ర కూట సేనాపతిగ వేంగీ దేశంపై దాడిచేసి మరణించాడు. ఇది సుమారు క్రీస్తుశకం 890-900 నడుమ జరిగింది. ఇతని కుమారుడు ఎర్రన. రాష్టక్రూట రాజులు ముదిగొండ చాళుక్యులను కొరవి రాజ్యం నుంచి తరిమివేసి, ఎర్రనను దానికి పాలకునిగా నియమించారు. ఇతని కుమారుడు బేతరాజు, ఇతని కుమారుడు గుండమరాజు, ఇతడు గొప్పయోధుడు. ఇతడే వేంగీ రాజయిన చాళుక్య అమ్మరాజును గెలిచినవాడు. కాని ఇతనిని తర్వాత ముదిగొండ చాళుక్య చక్రవర్తి తైలవుని సహాయంతో యుద్ధంలో చంపారు.

గుండరాజు మరణించగానే కొరవిరాజ్యం ముదిగొండ చాళుక్యుల వశమైంది. అతనిని కుమారుడు బేతరాజు చాల చిన్నవాడు. అతనిని అతని మేనత్త కామసాని తన భర్త ద్వారా చాళుక్య చక్రవర్తికి విన్నవించి, అనుమకొండ ప్రాంతానికి రాజుగా చేసింది. దీనితో కాకతీయులలో మార్పు వచ్చింది. కాకతీయులు రాష్ట్ర కూటులపట్ల అభిమానం వదలి చాళుక్యులకు విధేయులయ్యారు. పిదప బేతరాజు, పిదప అతని కుమారుడైన మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, దుగ్గరాజు, రెండవ ప్రోలరాజు క్రీ.శ.1052 నుంచి 1157 వరకు నూట అయిదేళ్ళు సామంతులుగానే పాలించారు. రెండవ ప్రోలరాజు గొప్ప యోధుడు. ఇతడు తెలంగాణాలో చెలరేగిన విప్లవాలన్నిటినీ అణచివేసి కల్యాణి చాళుక్య చక్రవర్తి రెండవ జగదేకమల్ల ప్రతాప చక్రవర్తి అనుగ్రహం పూర్తిగా సంపాదించాడు. తెలంగాణాలో తనకు సాటి వీరుడు మరొకడు లేడని నిరూపించుకొన్నాడు. దీనితో కాకతీయ సామ్రాజ్యానికి గట్టి పునాది పడింది.

స్వాతంత్య్ర ప్రకటన - రుద్రదేవుడు
రెండవ ప్రోలరాజు పెద్ద కుమారుడు రుద్రదేవుడు 1158 లో పట్టానికి వచ్చాడు. ఇతని కాలంలో కల్యాణి చాళుక్య చక్రవర్తి అయిన ద్వితీయ జగదేకమల్ల ప్రతాప చక్రవర్తిని అతని సోదరుడైన తైలవుడు త్రోసిరాజని సింహాసనం ఆక్రమించాడు. ఇలా ఉండగా, ఆరవ విక్రమార్కుని దౌహిత్రుడైన కళచురి బిజ్జలుడు మూడవ తైలవుని తరుమగొట్టి రాజ్యమాక్రమించాడు. కల్యాణి చాళుక్య సామ్రాజ్యం మూడు ముక్కలైంది. కాకతీయ రుద్రుడు వీరిలో ఎవరికి విధేయుడుగా ఉండాలో తేల్చుకోలేకపోయాడు. దురాక్రమణ దారుడైన బిజ్జలునికీ తలవంచడం అతనికి నచ్చలేదు. కనుక క్రమంగా తెలంగాణాను ఆక్రమించుకోవడం ప్రారంభించాడు. బిజ్జలుడు మైళగి అనే సేనాపతి అధీనాన గొప్ప సైన్యం పంపాడు. దానితోను, ఇరుగు పొరుగు వారితోను రుద్రదేవుడు పోరి, అందరిని జయించి, అనుమకొండ వేయిస్తంభాల గుడిలో విజయ శాసనం వేయించాడు. స్వాతంత్య్రం ప్రకటించి, కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని రాజ్యానికి దక్షిణాన శ్రీశైలం వరకు, ఉత్తరాన గోదావరి, పశ్చిమాన బీదరు తూర్పున ద్రాక్షారామం ఎల్లలు. రుద్రదేవుడు దేవగిరి యాదవ రాజులపై దండెత్తి ఆ యుద్ధంలో 1195 లో మరణించాడు. అతని పిదప అతని తమ్ముడైన మహాదేవుడు మూడు సంవత్సరాలు రాజ్యమేలి దేవగిరి యాదవరాజులపై దండెత్తి యుద్ధంలో మరణించగా, రుద్రుని కుమారుడైన గణపతిదేవుణ్ని 1199 లో విధేయులైన మంత్రి సేనాపతులు సింహాసనా సీనుణ్ని చేశారు. గణపతిదేవుడు 1199 నుంచి 1262 వరకు 63 ఏళ్ళు రాజ్యం చేసి, చోళులను, పాండ్యులను, కళింగులను జయించి, పెక్కు కోవెలలను నిర్మించాడు. దాదాపు తెలుగు దేశమంతా ఈయన రాజ్యంలో ఉంది. ఉత్తరాన గోదావరి, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన కాంచి రాజ్యమూ సరిహద్దులు. గణపతిదేవునికి కుమారులు లేనందున, అతని కుమార్తె రుద్రమదేవి, గణపతిదేవుని తర్వాత 1262 లో రాజ్యానికి వచ్చి 1289 వరకు ఏలింది. ఎదురు తిరిగిన సామంతులను అణచివేసి, రాజ్యాన్ని స్థిరపరచింది.

రుద్రమదేవికి కుమారులు లేరు. ఆమె దౌహిత్రుడైన ప్రతాపరుద్రుని దత్తత తీసుకుంది. అతడు 1189-1323 వరకు రాజ్యం చేశాడు. అతని కాలంలో కాకతీయ రాజ్యం పడమట బీదరు దాటి, దక్షిణాన కంచి, తూర్పున ద్రాక్షారామం, ఉత్తరాన కోటగిరి, పోలాస్ వరకు వ్యాపించి ఉండేది.

ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తానయిన ఘియాజుద్ధీన్ ఖిల్జి ఉలుగ్‌ ఖాన్ అనే సేనాపతిని పంపి వరంగల్లుపై దాడి జరిపారు. ఆ దాడిలో కాకతీయులు వోడిపోయారు. ప్రతాపరుద్రుడు బందీ అయ్యాడు. అతడు ఢిల్లీకి వెళ్ళే దారిలో యమునానదీ తీరంలో అత్మహత్య చేసుకున్నాడు. కాకతీయ సామ్రాజ్యం పతనమైంది.

కాకతీయ సామ్రాజ్యంలో కళా సాహిత్యాలు చాలా అభివృద్ధి పొందాయి.

తెలంగాణా బాధను, కన్నీళ్ళ గాధను…అక్షర బద్ధం చేసిన రచయిత్రి సబ్బని శారద ”తెలంగాణా బతుకమ్మపాట”

-సంకెపల్లి నాగేంద్ర శర్మ



Bathukamma

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో….బంగారు బతుకమ్మ ఊయ్యాలో… అంటూ వయస్సు, అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తెదవులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరంతో కలిసి ఆడుకునే తెలంగాణా ట్రేడ్‌ మార్కు పండుగ. గుజరాతీలు, రాజస్ధానీలు శరన్నవరాత్రులలో జరుపుకునే దాండియా, గర్బి ఆటతో ఆ పండుగను పోల్చవచ్చును. బతుకమ్మల పండుగ, ఇది పల్లె ప్రజల పండుగ, ముఖ్యంగా మహిళలు కోలాహలంగా జరుపుకునే జానపదులు పండుగ. ఆశ్వీజ మాసంలో దసరా ముందు అరుదెంచే తొమ్మిది రోజుల పండుగ. ఈ పండుగ ప్రాశస్త్యాన్ని, తెలంగాణ పొగసూరిన బతుకుల వెనుకబాటుతనాన్ని, ఉద్యమాల త్యాగనిరతిని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను గూర్చి కరీంనగర్‌ రచయిత్రి శ్రీమతి సబ్బని శారద 2001లో రాసిన ‘తెలంగాణా బతుకమ్మ పాట’ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. తెలంగాణా భాషలోని వంపుసొంపైన పదాల మాటలతో ఆమె అల్లిన 34 పేజీల గ్రంధ రూపంలో బతుకమ్మ దీర్ఘ గానవాహిని వింటే మనసు పులకించి, ఆవేశం జలగంగలా ఉప్పొంగుతుంది. తెలంగాణా జిల్లాల వెనుకబాటుతనాన్ని, మూతబడుతున్న ఫ్యాక్టరీలు, రైతుల, నేతన్నల ఆత్మహత్యలు, పనులు లేక చినిగిన విస్తర్లయిన కూలీల బతుకులు, ఆకలిచావులు, బీడీ మహిళా కార్మికుల వెతలు, వలసవాదుల దోపిడిిని, మొసలి కన్నీరు కార్చే పాలకుల వివక్షతలను, ఆమె తూర్పారబడుతూ చిత్రీకరించిన తీరు అద్భుతంగా కనిపిస్తుంది. జానపదుల కళలైన ఒగ్గు కథలా, చిందు యక్షగానంలా, వీధి బాగవతుల గాన మాధుర్యతల శైలి ఇందులో అలరారుతుంది. కొత్త తరహా ప్రక్రియలో ఈమె రాసిన బతుకమ్మ పాటలు జనాదరణ పొందాయి. ఆడియో క్యాసెట్లుగా కూడా విడుదలై ఈ ప్రాంత జనాల నోళ్ళలో నానుతున్నాయి.

పండుగ నేపథ్యం:

మహాలయ అమావాస్య నుండి దసరా ముందు దుర్గాష్టమి వరకు తెలంగాణా ప్రాంతంలో ఈ పండుగను జరుపుకునే ఆచారం ఉంది.

ఓ విధంగా చెప్పాలంటే గౌరీదేవి రూపంలో అమ్మవారిని ఆరాధించే పండుగ.

ఈ పండుగ పారమార్థికాన్ని పరిశీలిస్తే సుమారు 2 వందలు ఏళ్ళ నుండి ఈ పండుగ తెలంగాణలో అమలులో వున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కరువు-కాటకాలు, పాలకుల దోపిడీలు, కన్నీళ్ళు, కష్టాలు బతుకమ్మ పాటలలో నిలిచాయి. అందుకే బతుకమ్మ పాటల్లో ఆనాటి సాంఘీక సంస్కృతుల, పుట్టింటి ప్రేమలు, అత్తింటి ఆరళ్ళు అణగారిన బతుకుల వ్యధలు కనిపిస్తాయి. ఈ పండుగ అంతరంగంతో పాటు, తెలంగాణా జిల్లాల వెనుకబాటు తనాన్ని సమతౌల్యంగా బాధలు, ఆవేదనల పూలతో పేర్చి రచయిత్రి పాఠకుల ముందుంచింది.

సాహితీ ప్రక్రియగా బతుకమ్మ పాట:

తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల సాంప్రదాయకతను, సనాతన ఆచారాలను, వెనుకబాటుతనాలను చొప్పిస్తూ రచయిత్రి శ్రీమతి సబ్బని శారద బతుకమ్మ పాట ప్రక్రియలో హృద్యంగా వివరించారు. సాహిత్యంలో వివిధ ప్రక్రియలు ఉన్నప్పటికినీ, బతుకమ్మ పాట ప్రక్రియ రూపంలో తన అభిప్రాయాలను నిఖ్ఖచ్చితంగా చెప్పడం అమెకే చెల్లింది. బతుకమ్మపాటను విలక్షణమైన సాహితీ ప్రక్రియగా గుర్తించి తొలిసారిగా ఆమె తెలంగాణా వెనుకబాటుతనాన్ని లయబద్ధంగా సాహిత్యీకరించడం ఆమె చేసిన సాహితీ ప్రయోగానికి జేజేలు పలుకక తప్పదు. గత ఏడేళ్ళ కిందట రాసిన తెలంగాణా బతుకమ్మ పాట విశేష ప్రాచుర్యాన్ని పొందింది. తెలంగాణా రాజకీయ ప్రముఖులు, రచయితలు, సాహితీవేత్తలు ఈ పాటలలోని వాడిన మకుటం: రామరామ ఉయ్యాలో/ రామనే శ్రీరామ ఉయ్యాలో / హరి హరి ఓ రామ ఉయ్యలో / హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో .. అన్న లయాత్మకమైన మకుటంతో ఆమె పాటతో పాటు సాహిత్యం పరుగెడుతుంది.

తెలంగాణా ప్రాంతంలో దేవతలను ఆమె తన బతుకమ్మ పాటలో ఇలా చెప్పింది.

రామరామ ఉయ్యలో… ముందుగా నినుదల్తు ఉయ్యాలో / ముక్కోటి పోశవ్వ ఉయ్యాలో/ అటెన్క నిను దల్తు ఉయ్యాలో / అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో/ భక్తితో నినుదుల్తు ఉయ్యాలో/ బాసరా సరస్వతి ఉయ్యాలో/ సమ్మక్క సారక్క ఉయ్యాలో/ సక్కంగ మముజూడు ఉయ్యాలో/ బద్రాద్రి రామన్న ఉయ్యాలో / భవిత మాకు జెప్పు ఉయ్యాలో / యాదితో నినుదల్తు ఉయ్యాలో/ యాదగిరి నర్సింలు ఉయ్యాలో/ ఎరుకతో నినుదల్తు ఉయ్యాలో / ఎములాడ రాజన్న ఉయ్యాలో/ ఐలేని మల్లన్న ఉయ్యాలో/ ఐక్యమత్యమియ్యి ఉయ్యాలో/ …అంటూ తల్లడిల్లుతున్న తెలంగాణా గూర్చి చెబుతూ, తెలంగాణా సాధనే ఏకైక మార్గమని అంటుంది. తల్లడిల్లుతుంది ఉయ్యాలో/ తల్లి తెలంగాణా ఉయ్యాలో/ ఆర్తితో బతుకులూ ఉయ్యాలో/ ఆగమయ్యే సూడు ఉయ్యాలో/ అక్కలార మీరు ఉయ్యాలో/ తెలంగాణా మనది ఉయ్యాలో/ తెలంగాణం మనది ఉయ్యాలో/ గాంధీలాగా మీరు ఉయ్యాలో/ గమ్యాన్ని చేరాలి ఉయ్యాలో/ అంబేత్కరుని ఉయ్యాలో/ ఆశయాల మేర ఉయ్యాలో/ మంచి కోరి మనం ఉయ్యాలో/ మనుగడ సాగిద్దాం ఉయ్యాలో/ కష్టాల కడలి ఉయ్యాలో/ కన్నీటి కావ్యమూ ఉయ్యాలో/ తెలంగాణా బతుకు ఉయ్యాలో/ తెలంగాణా బతుకమ్మ ఉయ్యాలో …అంటూ తెలంగాణా బతుకు కన్నీళ్ళ గాథలను అక్షరబద్దం చేసింది.

కరీంనగర్‌ బాధలను ఆమె చెప్పిన తీరులో

రాజకీయపు జిల్లా ఉయ్యాలో/రాణించె జిల్లా ఉయ్యాలో/ కరినారం జిల్ల ఉయ్యాలో/ కదిలికున్న జిల్ల ఉయ్యాలో/ మానేరు పరుగులు ఉయ్యాలో/ మరి చిన్నవయిపోయే ఉయ్యాలో అంటుంది. విషాదకరమైన దృశ్య రూపకంలా సిరిసిల్లా నేతన్న ఆకలి చావులపై ఇలా పాట కట్టింది.. సిరిసిల్లా బతుకులు ఉయ్యాలో/ సిరిలేని బతుకులు ఉయ్యలో/ ఆకలి చావులు ఉయ్యాలో ఆత్మహత్యలు చూడు ఉయ్యాలో/ వలస బతుకులు జూడు ఉయ్యాలో/ వట్టిపోయిన బతుకు ఉయ్యాలో/ బొంబాయి భీవండి ఉయ్యాలో/ బోసి పోయిన బతుకు ఉయ్యాలో అంటుంది.

అనేకానేక పెద్దపెద్ద బీడి కార్ఖానాలకు నిలయమై, బీడి కార్మికుల వెతలకు ఖిల్లాయైన ఇందూరు జిల్లా బాధలను ఆమె ఇలా ఏకరువు పెట్టింది. నిజాం బాధలు ఉయ్యాలో/ నిట్టూర్పు బతుకులు ఉయ్యాలో/ బీడీల బతుకులు ఉయ్యాలో/ బీడైన బతుకులు ఉయ్యాలో.

తెలంగాణా జిల్లాల బతుకులను పీడించే కరెంట్‌ వ్యథలను ఇలా పాటలో కై కట్టింది. సింగరేణి బొగ్గు ఉయ్యాలో/ సిరిగలా సీమరా ఉయ్యాలో/ ఎన్టీపిసీలు ఉయ్యాలో/ కరెంటు పుట్టిల్లు ఉయ్యాలో/ కరువెట్ల వచ్చెరా ఉయ్యాలో/ ఉపాధులు కోల్పోయి బజారున పడిన బతుకులు, మూత పడుతున్న ప్యాక్టరీల గూర్చి ఇలా చెప్పింది. ఎఫ్‌సిఐ కంపిన్లు ఉయ్యాలో/ ఏమై పాయరా ఉయ్యాలో/ అంతర్గాం మిల్లులు ఉయ్యాలో/ అంతరించి పోయె ఉయ్యాలో/ సిరిసిల్లా స్పిన్నింగ్‌ ఉయ్యాలో/ సిక్కుల్లో పడెరా ఉయ్యాలో/ గోదారి దారుల్లో ఉయ్యాలో/ గోసకచ్చె బతుకు ఉయ్యాలో/ అని చెబుతుంది.


మూత పడిన వరంగల్‌ ఆజాంజాహి మిల్‌ గూర్చి…

కాకతీయలు నాటి ఉయ్యాలో/ కాలమేది నేడు ఉయ్యాలో/ పరిశ్రమ లేవి ఉయ్యాలో/ పనిపాట లేవి ఉయ్యాలో/ అజంజాహి మిల్లు ఉయ్యాలో/ ఆంతరించిపోయె ఉయ్యాలో … సింగరేణి గనులుండి ఉద్యోగాల ఖిల్లాయైన ఖమ్మం జిల్లాకు వచ్చిన

కోస్తాంద్రుల కొత్త వలసల గూర్చి ఇలా చెప్పింది. ఖమ్మం సీమకు ఉయ్యాలో/ కాలుజేతులచ్చె ఉయ్యాలో/ గోదారి దారుల్లో ఉయ్యాలో/ కొత్త వలసలచ్చె ఉయ్యాలో/ అయ్యయ్యో ఓ రామ ఉయ్యాలో/ హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో.. నల్లగొండ జిల్లా వెతలను ఇలా చెప్పింది. నాగార్జున సాగరు ఉయ్యాలో/ నల్లగొండలుంటె ఉయ్యాలో/ కటకట నీళ్ళకు ఉయ్యాలో/ కరువెట్ల వచ్చెరా ఉయ్యాలో/ ఫ్లోరైడ్‌ నీళ్ళల్లో ఉయ్యాలో/ పాడయ్యెను బతుకు ఉయ్యాలో/ కష్టకాలమచ్చె ఉయ్యాలో/ కరువుకాలమచ్చె ఉయ్యాలో/ పరుగులిడె కృష్ణమ్మ ఉయ్యాలో/ పక్షపాతమేమి ఉయ్యాలో.

మెదక్‌ జిల్లా కరువు గురించి ఇలా రాసింది. మెదక్‌ సీమ జూడు ఉయ్యాలో/ మెతుక్కు కరువాయె ఉయ్యాలో/పటాన్‌ చెరువు ఉయ్యాలో/ పర్యావరణం చూడు ఉయ్యాలో/ కాలుష్యం కోరల్లో ఉయ్యాలో/ కాటేస్తున్నది ఉయ్యాలో అంటుంది.

జీడిమెట్ల జూడు ఉయ్యాలో/ జీవులా బతుకులు ఉయ్యాలో/ రోగాల బారిన ఉయ్యాలో/ రోధించె బతుకులు ఉయ్యాలో/ అల్‌ కబీర్ల జూడు ఉయ్యాలో/ అంగట్ట బతుకులూ ఉయ్యాలో/ పశువుల రక్తమూ ఉయ్యాలో/ పారుతుండె జూడు ఉయ్యాలో అంటుంది. ఆదిలాబాద్‌ గిరిజనుల బతుకులను, పాలమూరు కూలీల బతుకు వ్యధలను రంగారెడ్డి జిల్లాలో విషం జిమ్ముతున్న ఫ్యాక్టరీల కాలుష్యాలను హైదరాబాద్‌లోని భూబకాసురులైన రియల్‌ ఎస్టేట్ల అక్రమ మాఫియా దందాలను ఆమె తన పాటలో ఏకరువు పెట్టింది.నంది అవార్డులు, నాటకాలు, ఆటా, తానా అవకాశాలు దూరదర్శన్‌, ఆకాశవాణి, పత్రికల్లో తెలంగాణా వాళ్లకు చూపిస్తున్న వివక్షతను ఆమె ఎండగట్టింది.

తెలంగాణా రాష్ట్ర సాధన:

తెలంగాణా బతుకులు మెరుగు కావాలంటే రాష్ట్ర సాధనే దిక్కని బల్లగుద్ధి చెప్పింది. తెలంగాణా రావాలి ఉయ్యాలో/ తెలంగాణా బాగుకూ ఉయ్యాలో/ తెలంగాణ కావాలి ఉయ్యాలో/ తెలంగాణ మేలుకూ ఉయ్యాలో అంటుంది.

తెలంగాణా బతుకమ్మలు కొనసాగినంత కాలం ఈ రచయిత్రి రాసిన పాట

జవజీవాలతో ఉంటుందని, అంత సాహితీ పరిపుష్ఠి, తెలంగాణా నిండుదనం ఇందులో వుంది అని నేను భావిస్తున్నాను.

2001లో మొదటి ముద్రణగా వెలువడి విశేష ఆదరణ పొందిన ఈ పుస్తకం మళ్ళీ ఈ 2008న ద్వితీయ ముద్రణకు రావడం ఈ బతుమ్మ పాట ప్రముఖ తెలంగాణ జానపద గాయని అంతడుపుల రమాదేవి గాత్రంతో ఆడియో

క్యాసెట్‌గానూ ఆడియో సి.డి.గానూ వెలువడటం గొప్ప విషయం. రచయిత్రి శ్రీమతి సబ్బని శారద గారిని, వారికి చేదోడువాదోడుగా నిలిచిన వారి శ్రీవారు సబ్బని శ్రీ లక్ష్మీనారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

friend gift

███─█─────█─███─███─███
█───█─────█─█───█────█
███─█──█──█─██──██───█
──█─█─█─█─█─█───█────█
███─██───██─███─███──█


███─███──███─███─██───█─███─
█───█─█───█──█───█─█──█─█──█
███─██────█──██──█──█─█─█──█
█───█─█───█──█───█───██─█──█
█───█──█─███─███─█────█─███─
....._.;_'.-._
Friend ship is not collection of hearts ...
but it is a selection of hearts...
all friends r not gud ....
but good friends are very few....
which include u.......
...{`--..-.'_,}
.{;..\,__...-'/}
.{..'-`.._;..-';
....`'--.._..-'
........,--\\..,-"-.
........`-..\(..'-...\
...............\.;---,/
..........,-""-;\
......../....-'.)..\
........\,---'`...\\

Thursday, October 16, 2008

ప్రపంచ హృదయం

యిదిగో యిక్కడ
గత యిరవై యేండ్లుగా
నా నీడలోనే నేను బంధింపబడి …

యీ నిర్దాక్షిణ్య బండరాళ్ళనుండీ ,
యినుప గోడలనుండీ
ముళ్ళతీగలనుండీ
నా చేతిని చాచి
ప్రపంచ హ్రుదయాన్ని తాకాను.

‘మిటాకుయే ఒయాసిన్ ‘
నా లకోటా సోదరులంటారు.

‘మనమంతా బంధువులం.
మనమంతా ఒక్కటి. ‘



రాత్రి నీడల్లో …



అప్పుడప్పుడూ
నీడలావరించిన రాత్రి
నేను
ఆత్మనౌతాను.

యీ
జైలు గోడలూ
యినుప వుచలూ
కాంతిలోకి కరిగిపోతాయి.
నా ఆత్మని బంధ విముక్తి చేసి

నా అంతరాల్లోని చీకట్లోంచి
ఎగిరి పోతాను పారదర్శకమౌతాను
వొక వెలుతురు నీడనౌతాను
జీవన వృక్షం మీంచి
పాడుతున్న
కలల పక్షినౌతాను!



లెనార్డ్ పెల్టియర్ అమెరిక కౄరమైన జాతి వివక్ష చట్టాలకు బలయిన నేటివ్ అమరికన్ యోధుడు – AIM (American Indian Movement) నాయకుడు.
గత 30 యేండ్లుగా చెయ్యని నేరానికి మరణ శిక్ష విధించబడి జైలులో మగ్గి పోతున్న స్వాతంత్ర్య పోరాట యోధుడు
అతని జైలు రాతలు – నా జీవితమే నా సూర్య నృత్యం (My Life is My Sun Dance) లో అతని కవితలకివి స్వేచ్చానుసరణ

గతితార్కిక భౌతికవాదం

- ఐరా గొలోబిన్‌
రెండో అధ్యాయం (తరువాయి భాగం)

గతితార్కిక భౌతికవాదం అంటే తత్వశాస్త్రానికి శాస్త్రీయసూత్రీకరణవంటిది; అంటే వైజ్ఞానిక తత్వశాస్త్రం. హెగెల్ ముందుచూపుతో వ్యాఖ్యానించినట్టుగా “సత్యానికి యదార్థరూపంలో ఉనికినిచ్చేది దాని వైజ్ఞానికవ్యవస్థ ఒక్కటే. తత్వశాస్త్రాన్ని విజ్ఞానశాస్త్రం స్థాయికి తీసుకెళ్ళాల్సిన సమయం వచ్చిందని నిరూపించాలి; ఇందుకు తోడ్పడే ప్రయత్నం చెయ్యాలని నేను నిశ్చయించుకున్నాను…తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రంలా రూపొందాలి. తత్వశాస్త్రంఅంటే కేవలం జ్ఞానాన్ని ప్రేమించడం కాదు; అది నిజంగా జ్ఞానమే”. 16

వైజ్ఞానిక తత్వశాస్త్రం

వైజ్ఞానిక తత్వశాస్త్రం పుట్టుక:
గతితార్కిక అంశాలను చాలావరకూ సూత్రీకరించిన హెగెల్ తన శాస్త్రీయలక్ష్యం దిశగా ముందడుగు వేశాడు. అయితే మార్క్స్, ఎంగెల్స్ జమిలిగా సాధించినదేమిటంటే వైజ్ఞానిక తత్వశాస్త్రాన్నీ, గతితార్కిక భౌతికవాదాన్నీ విశదపరచడం. హెగెల్, ఫ్యూఅర్బాఖ్లూ, వారికి మునుపటి అనేక తత్వచింతకులూ, శాస్త్రీయవిశ్లేషకులూ అందరి రచనలనూ వారు ఉపయోగించుకున్నారు. “…గతితర్కం తదితర జ్ఞానసూత్రాలన్నీ ఈ అన్వేషణకు నాంది అనుకోరాదు; అవి అంతిమఫలితాలు. వాటిని ప్రకృతికీ, మానవజాతి చరిత్రకూ అన్వయించడంకాదు; సారాంశంగా భావించాలి. ప్రకృతీ, మానవజాతీ ఈ సూత్రాలకు కట్టుబడిఉంటాయని కాదు; ప్రకృతికీ, చరిత్రకూ అనురూపంగా ఉన్నంతమేరకే ఈ సూత్రాలకు చెల్లుబాటు ఉంటుంది. 17

పెట్టుబడిదారీ విధానపు ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక వికాసమూ, [ఇంగ్లండ్ ఆర్థికవ్యవస్థ, ఫ్రాన్స్ సోషలిజం, జర్మనీ తత్వశాస్త్రం] భౌతిక, రసాయనశాస్త్రాలూ వగైరాల వృద్ధీ, అన్నీ మార్క్స్, ఎంగెల్స్ల పటిష్ట సూత్రీకరణలకు భూమికనిచ్చాయి. ఇవి విశ్వమంతటికీ వర్తించే సామాన్యసూత్రాలు; పెట్టుబడిదారీ విధానంతోసహా మొత్తం సమాజవికాసానికి (చారిత్రక భౌతికవాదం) వర్తించే ప్రత్యేక సూత్రాలు. వైజ్ఞానిక తత్వశాస్త్రం, సామాజశాస్త్రం అనేవి రెండూ తప్పనిసరిగా విప్లవంలో పుట్టిన కవలల వంటివి. పెట్టుబడిదారీ యథాస్థితివాదాన్ని ధిక్కరిస్తూ, దాని అంతం తప్పదని శాస్త్రీయంగా సూచించినవి. “…సాంప్రదాయక ఆస్తిసంబంధాలు సంపూర్ణంగా భగ్నం అవుతున్నప్పుడు… సాంప్రదాయక భావనలన్నీ సంపూర్ణంగా భగ్నమవుతాయి. “18

వైజ్ఞానికతత్వశాస్త్రానికీ, (అన్నిటికీ వర్తించే సర్వసామాన్యశాస్త్రం), తక్కిన జ్ఞానానికీ (ప్రత్యేకవిషయాలకు మాత్రమే వర్తించే సత్యాలు) మధ్య మౌలికమైన తేడాలు తొలిసారిగా ఏర్పడ్డాయి. (’వైజ్ఞానికతత్వశాస్త్రం’ అంటే ‘తాత్వికతలోని శాస్త్రీయత’ అనుకోరాదు. ‘వైజ్ఞానికతత్వశాస్త్రం’ అనేది తత్వశాస్త్రంలోని వైజ్ఞానిక అంశాలకు మాత్రమే పరిమితమైనది. ఇందులో అశాస్త్రీయమైనవాటికి తావుండదు. అలాగే అది కళలూ, వివిధశాస్త్రాలూ అన్నిటి శాస్త్రీయఅంశాలకూ సమగ్రంగా వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా ‘తాత్వికతలోని శాస్త్రీయత’ అనేది తాత్వికతలోని శాస్త్రీయ, అశాస్త్రీయసూత్రాలన్నిటికీ సమగ్రంగా వర్తిస్తుంది. అలాగే అది ప్రత్యేకశాస్త్రాల సామాన్యవిషయాలకే పరిమితం. కళలకూ, నీతిశాస్త్రం వగైరాలకూ వర్తించదు; అవన్నీ ప్రత్యేకశాస్త్రాల వైజ్ఞానికలక్షణాలకు సంబంధించినవైనప్పటికీ కూడా.) ఇది డార్విన్‌తో సహా అనేకుల వైజ్ఞానిక ఆవిష్కరణలన్నిటి మూలంగానే సాధ్యమైంది. ఈ విభజనవల్ల వివిధవిషయాల మధ్యనుండే నిజమైన సంబంధాలు తేటతెల్లంకాసాగాయి. తక్కిన రంగాల్లో తెలిసిన విషయాలన్నిటినీ వైజ్ఞానికతత్వశాస్త్రం సంగ్రహించి ప్రాపంచిక వాస్తవాలను తెలియజేస్తుంది. (వైజ్ఞానికతత్వశాస్త్రం రాజకీయాలూ, భౌతికశాస్త్రం, సంగీతం, నీతిశాస్త్రం మొదలయినవాటి ప్రాథమిక సమాచారాన్ని తిన్నగా కాకుండా తాత్వికపరంగా స్వీకరించి సామాన్యసూత్రాలను రూపొందిస్తుంది. వీటిలో ప్రాథమికవిషయాలకూ, మధ్యస్థంగా అనిపించేవాటికీ సిద్ధాంతంద్వారా సామాన్యత ఏర్పడుతుంది. ఇక్కడ సిద్ధాంతం అంటే తాత్వికభావనల సమాహారం. ఒకప్పుడు దీన్ని ఆదర్శవాద పద్ధతిలో ఊహాజనిత చైతన్యంగా భావించేవారు.) “తత్వవేత్త అయినవాడు విషయాలన్నిటినీ సమగ్రంగా పరిగణించగలిగిఉండాలి”.19 వైజ్ఞానికతత్వశాస్త్రపు ఆకరాల్లో భౌతిక, జీవశాస్త్రాలూ, తర్కం, గణితంవంటి సిద్ధాంతశాస్త్రాలూ, విలువల నాపాదించే నీతిశాస్త్రం, సౌందర్యశాస్త్రం, చరిత్రయొక్క తాత్వికతా వగయిరాలుంటాయి. ఈ తత్వశాస్త్రం విజ్ఞానపు తక్కిన రంగాలన్నిటినీ పోషిస్తుంది. ఇది ‘విజ్ఞానానికొక ప్రాథమిక సైద్ధాంతిక మూలం’. (లెనిన్) సర్వసామాన్యతకిది శ్రేష్ఠమైన కేంద్రం. ‘ఇది రాజకీయ ఆర్థికశాస్త్రాన్నేకాక, మొత్తం మానవవికాస క్రమాన్నే ప్రకాశవంతం చేస్తుందీ.20 వైజ్ఞానిక తత్వశాస్త్రం సిద్ధాంతాల సిద్ధాంతం. జ్ఞానం గురించిన జ్ఞానం. శాస్త్రాల శాస్త్రం. తక్కిన జ్ఞానంతో ఇది విడదీయరాని సంబంధం కలిగి దాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ రెంటిలో ఏ ఒక్కదానిదీ పైచెయ్యి అనలేము. రెంటిలోనూ సత్యాసత్యాలు ఒకలాంటివే.

వైజ్ఞానిక తత్వశాస్త్రం, వైజ్ఞానిక ప్రమాణాలు:
వైజ్ఞానికతత్వశాస్త్రం వైజ్ఞానిక ప్రమాణాలను ఆంటిపెట్టుకుని ఉంటుంది. అది వస్తుగతపద్ధతిలో, స్థిరంగా, పొందికగాఉండే జ్ఞానం. అందులో వర్గీకరణలూ, నియమాలూ, పద్ధతులూ ఉంటాయి; నిరూపణీయంగా, భవిష్యత్తును తెలపగలిగినదై, పిడివాదధోరణి లేని నిశ్చితత్వం కలిగి ఉంటుంది. భౌతికశాస్త్ర ప్రయోగశాలల్లో నియంత్రితంగా, పరిశీలనకు లోబడినట్టుగా కాకుండా దాని సత్యాలను పరిమితులు లేకుండా పరీక్షించవచ్చు. మార్క్స్ తన కాపిటల్ గ్రంథానికి ముందుమాట రాస్తూ పరిశీలనకు లోబడని విషయాలకు “మైక్రోస్కోప్‌లూ, రసాయనిక పరీక్షకపదార్థాలూ అవసరంకావు” అంటాడు.21 ఇక్కడ భౌతిక అన్వేషణకు తోడ్పడేదల్లా రూపరహితంగానూ, మూర్తత్వపద్ధతిలోనూ విశ్లేషించి, సంశ్లేషించగలిగిన మేధాశక్తి మాత్రమే. ఇదే సిద్ధాంతంగానూ, ఆచరణగానూ పరిణమిస్తుంది. వివిధ విషయాలను తెలుసుకునే విధానాలన్నీ ఆయా విషయాల లక్షణాలకు అనుగుణంగా ఉంటాయి. వైజ్ఞానికతత్వశాస్త్ర నిశ్చితసత్యాలను రుజువు చెయ్యగలిగిన మేధోశక్తికూడా భౌతికశాస్త్రాల నిరూపణకు పనికొచ్చే చేతులూ, ఇంద్రియశక్తుల్లా వాస్తవమైనదిగానే ఉంటుంది.

భవిష్యత్తును గురించి చెప్పగలగడంలో వైజ్ఞానిక తత్వశాస్త్రం, తక్కిన విజ్ఞానశాస్త్రాలూ విడదీయలేనివిగా ఉంటాయి; పరస్పరం ఆధారపడతాయికూడా. సామాన్యసత్యాలూ, ప్రత్యేకసత్యాలూ కలిసే ఉంటాయి; అలాగే తక్కిన విజ్ఞానశాస్త్రాలు భవిష్యత్తును గురించి చెప్పగలిగే పద్ధతిని వైజ్ఞానిక తత్వశాస్త్రంనుంచి వేరుచేసినట్టయితే తీవ్రమైన పరిమితులూ, వికృతులూ తలెత్తగలవు. విజ్ఞానశాస్త్రా లన్నిటిలోనూ తెలిసో, తెలియకో కొన్ని అతిసామాన్య తాత్విక అంశాలను స్వాభావికం అనుకుంటాం. ఇవి గనక లేకపోతే భౌతిక, రసాయనశాస్త్రాలవంటివి విజ్ఞానం అనిపించుకోవు. “కొందరు ప్రకృతిశాస్త్రవేత్తలు తత్వశాస్త్రాన్ని లక్ష్యపెట్టకో, దురుపయోగం చేసో తాము స్వతంత్రులైపోయినట్టు భావిస్తారనేది నిజమేగాని, యోచన అనేది లేకుండా వారు ముందుకుపోలేరు. యోచించాలంటే యోచనకు నిర్ధారణలుండాలి”.22 వైజ్ఞానికతత్వశాస్త్రమంటే పూర్వాలోచనా, పునరాలోచనా అనే అర్థం.

వైజ్ఞానికతత్వశాస్త్రాన్ని తక్కిన శాస్త్రాల్లాగే నిరంతరమూ విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఉండాలి; అది చారిత్రకపరిణామాలకు లోనవుతూ, కొంతవరకూ లోపాలు కలిగినదై ఉంటుంది. “తత్వశాస్త్రమంటే దాని కాలాన్ని యోచనాత్మకంగా అవగాహన చేసుకోవడమే”.23 వైజ్ఞానిక తత్వశాస్త్రాన్ని అనునిత్యం వాస్తవప్రపంచంతో పోల్చిచూస్తూ ఉండాలి; దాన్ని వైజ్ఞానిక ఆవిష్కరణల ఆధారంతో వికసింపజేస్తూ ఉండాలి. అది నిలకడగా ఉండటానికి గుడ్డినమ్మకాలూ, పిడివాదవైఖరీ పనికిరావు; నిరంతర విచారణా, శాస్త్రీయఖండనకు అతీతం కాకపోవడం ముఖ్యం.

వైజ్ఞానికతత్వశాస్త్రం పిడివాదానికి ప్రతివాదంవంటిది. “ఏ సిద్ధాంతానికైనా ఏకైక, అంతిమ ప్రమాణం అది వికాసప్రక్రియను నిజంగా ప్రతిఫలిస్తోందా, లేదా అనేది అయినప్పుడు ఇక పిడివాదానికి ఆస్కారమే ఉండదు”.24

References:
16. Quoted in Kaufman, Hegel, pp.372, 374
17. Engels, Anti-Duehring, p.44
18. Marx and Engels, The Communist Manifesto, p. 29
19. Aristotle, Metaphysics, p.64
20. Dietzgen, Some of the Philosophical Essays, p.180
21. Marx, Preface to Capital, Vol.1, p.12
22. Engels, Dialectics of Nature, p.183
23. Hegel, ‘Preface to Philosophy of Right’, in Hegel, The Philosophy of Hegel, p.226
24. Lenin, Selected Works, Vol.1, p.326

ఒక ఆటోవాలా… నేనూ… చిరంజీవి

ఒక ఆటోవాలా… నేనూ… చిరంజీవి

- అల్లం నారాయణ

‘ఈనె అడ్డగోలుగున్నడు సార్. మా బతుకులు నాశ్నం చేస్తండు. డిజిటల్ మీటర్లని పెట్టిచ్చిండు.కంపెనీల కాడ దొ… మా ఆటోవాళ్ల బత్కు లు బండలు చేసిండు సార్. ఈనె జూడు. ఎట్ల కట్టుకున్నడో బంగ్ల’ ఉరుము లేని పిడుగు. ఒక ఆటోవాలాకు అంత ఆగ్రహం ఉన్నట్టుగానీ, అది ఒక అపరిచితునితో, ఆటో లో కూచున్న కస్టమర్‌తో అంత ఉద్రేకంగా పంచుకుంటాడనిగానీ ఊహించి ఉండలేదు. ‘ద హిందూ’ దగ్గర ఎక్కా ను ఆటో. మోతీనగర్ అంటే అప్పటికే ఆరుగురు ఆటో వాలాలు నిరాకరించి ముఖంమీదే చీదరగా చూసి వెళ్లా రు. నాకు ఆటోవాలాల మీద పీకలదాకా కోపంగా ఉంది.


ఒకతను 70 రూపాయలిస్తావా? అని అడిగాడు. ఇదిగో… ఇతను నన్ను కరుణించి ఒక్క మాటా మాట్లాడకుండా ‘ఛలో’ అని ఆటో స్టార్ట్ చేశాడు. ఫర్లాంగ్ దాటీ దాటగానే ఇదీ సంభాషణ - ‘అది ఆయన బంగ్ల కాదు. సర్కారుది. ముఖ్యమంత్రిది గదా. అది ఆయన క్యాంపు ఆఫీసు. మరి ఉండాలెగదా’ అన్నా నేను. ‘బిల్డింగ్ సరే సార్. ఏమ న్న బత్కెటట్లున్నదా. ఏదన్న కొనెటట్టున్నదా? తినెటట్టున్నదా? ఎట్ల బత్కాలె. ఆటో కిరాయి నూటిరవై రూపాలు. పెట్రోల్ అరవై రూపాలు. పైనుంచి డిజిటల్ మీటర్. ఇంగ ఏం సంపాంచి, ఏం తినాలె సార్. పిలగండ్లను ఎట్ల సదివియ్యాలె. సంసారం ఎట్ల నడపాలె. ఈ ధరలేంది సార్.

ఈళ్లేమొ కోట్లకు కోట్లు సంపాస్తరు. ముఖ్యమంత్ర య్యే దంక చెప్పిందేంది. అయినంక చేసిందేంది’ అన్నడు. నాకెందు కో భయంగా ఉన్నది. ఇట్లా ఒక ఆటోడ్రైవర్ మాట్లాడ్తడని, అదీ నేనేమీ అనకుండానే, నేనెవరో తెలియకుండానే ఇట్లా అంటాడని ఊహించని దిగ్భ్రాంతి. దానికి తోడు సీఎం క్యాంపు ఆఫీసు నుంచి కదిలి వెళ్తున్నప్పుడు ఇట్లా మాట్లాడ్డం. “మరి చంద్రబాబు కాలం బాగుండెనా?'’ భయం భయంగనే అడిగినా. “ఆయనా?'’ ఇంక జెప్పకు సార్. ఇద్దరూ గంతే. ఆయనట్ల చేసిండనే ఓడగొడ్తిమి. గొర్లను తినెటోడు పోతె బర్లను తినెటోడచ్చిండు?'’ అన్నడు ఈసడింపుగా ఆటో వాలా. చిన్నగా గడ్డం పెరిగి ఉంది.

నాలో సగటు కుతూహలం. మనిషి మామూలు గా బక్క పలుచగా… ముఖం మీద ఒక విధమైన నిరసన. ‘మరెట్లాగయ్యా’… ఆయ నంటే అట్లంటివి? ఈయనంటె ఇట్లంటివి ఎట్లా మరి'’… ఎట్లంటె ఏమున్నది సార్! “ఎర్ర జెండా'’.. గదొక్కటే మార్గం… నాకెందుకో భయం పెరిగిపోయింది. అసలే బలిమెల. కలిమెల కాలం. సీఎం ఇంటి పరిసరాలు.. దాటేసినందుకు కాస్త ఊరట. అయినా నాతో ఇవన్నీ ఎందుకు? చెబ్తున్నట్టు ఈ ‘ఎర్ర జెండా’ ఏంది? కుతూహలం. ‘నన్నెక్కడన్నా చూసినవా? అని అడిగినా. ‘లేదు సార్’.

నాది ముందు నుంచీ ఎర్ర జెండే. సీపీఎం కార్యకర్తను నేను. గా ఎర్రజెండ లేకుంటే గీ ప్రపంచం గిట్లెందు కుంటుండె సార్. గది జెయ్యవట్టే కొంత భయపడ్తరు. అడివీల ఉన్నరు చూడు. ఆళ్లు ఉండబట్టే ఈళ్లు భయపడ్తరు. కాని వాళ్లిప్పుడు లేరు సార్. చర్చలని పిలిచి ఆళ్లనూ నమ్మించి సంపిండ్రు.'’ మా సంభాషణ ఎటో పోతున్నట్టు గమనించాను నేను. ‘సరే లేవయ్యా! అయినా సీపీఎం అంటున్నవ్. అడవిలో ఉన్నరంటున్నవు. వాళ్లు వీళ్లు వేరు కదయ్యా’ అన్నానేను.

వేరే సార్. కానీ ఏదైనా ఎర్రజెండే. గది లేకుంటే గంతే సార్…’ మరి వాళ్ల రాజ్యం వస్తదంటవా. వాళ్లేమొ అడవుల్లో… మీ వోళ్లే మొ తెలుగుదేశంతోని ఎట్ల కలు స్తది’ అన్నా నేను. గదేసార్.. గందుకే ఎర్రజెండ ఎగుర్తలేదు. ఎర్రజెండోళ్లందరు ఒక్కటైతే గిసొంటోళ్ల ఆటలు సాగయి. మస్తు దందగిరి చేస్తండ్రు సార్. మా బత్కులయితే నాశ్నం అయితన్నయి. ఆటో మోతీనగర్‌కు చేరుకుంటున్నది. నాకొక రకంగా విభ్రమంగా, సంభ్రమంగా, కంగారుగా, కంగాళీగా ఉంది.

ఈ ఆటోవాలా సంభాషణకు ఒక విరామం ఇస్తే అన్న ఆలోచనతో అడిగాను. అవునయ్యా ‘రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దర్నీ అంటున్నవ్. ఎర్రజెండా రాదు. మరెట్లా’? అని అడిగినా. అందుకే గదా సార్. వస్తు న్నడు చిరంజీవి. ఆయన రావాలె సార్. ఏమన్నా మా బత్కు బాగుపడ్తది. ఎట్లా? ఇది నా ప్రశ్న. ఆటో దిగాను. మనసంతా శూన్యమా? గందరగోళమా? మీమాంసా? ఏమో? ఎర్రజెండన్న కావాలె. కాదంటే చిరంజీవన్నా రావాలెనా? అంటే -? ఏదో ఒక ఖాళీ పూరించకుండా మిగిలినట్టున్నది… ఔనా…?

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 19 జులై 2008

వెలుగు బాటలైన వలస జీవులు - వరవరరావు

ముంబాయి.. దుబాయి.. బొగ్గుబాయిల పోలికలు, తేడాల గురించి పిట్టల రవీందర్ చేసిన పరిశీల న, విశ్లేషణ (ఆంధ్రజ్యోతి 12 ఆగస్ట్ 2008) చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మరిన్ని ఆలోచనలను రేకేత్తించేదిగా ఉన్నది. వ్యవసాయ జీవితంలోకి వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు వచ్చినపుడు కొత్త ఉత్పత్తి శక్తుల వికాసం, కార్మిక వర్గం ఏర్పడడం, కార్మిక చైతన్యం, ఆ చైతన్యం తిరిగి గ్రామీణ రైతాంగ జీవితంపై చూపే ప్రభావం - ఇవన్నీ బొగ్గుబాయి, ముంబాయిలకు వలస పోయిన తెలంగాణ పల్లె ప్రజల జీవితాల నుంచి వివరించవచ్చు.

దుబాయి వలసల్లో ఇప్పటికి తెలంగాణ పట్ల ఒక సాంస్క­ృతిక చైతన్యాన్ని మాత్రం చూడగలుగుతున్నాం. దుబాయికి వలస వెళ్తున్న వారిలో రాయలసీమ, ముఖ్యం గా కడప జిల్లా నుంచి వెళ్తున్న వారు కూడా ఉన్నారు. చక్రవేణు కథ ‘కుపైట్ సావిత్రి’లో ఈ వలస జీవితంలోని మాననీయ కోణాన్ని చూడవచ్చు. ఈ వలసలన్నింట్లోనూ రైతాం గం కార్మికులుగానో, కాంట్రాక్టు లేబర్‌గానో, రాను రాను రిక్షాలు తొక్కేవాళ్లు, ఆటోలు నడిపేవాళ్లు, ఒళ్లమ్ముకునే వాళ్లు, బిచ్చమెత్తేవాళ్లు గానో మారిన, మారుతున్న వైనమేకానీ ఆధిపత్యమో, దోపిడియో ఎక్కడా కనిపించవు.

ఈ వలసజీవులు వెళ్లిన ప్రాంతాల ప్రజల జీవితాలను సౌకర్యవంతం చేసి తాము మురికి గుడిసెల్లో బతుకీడుస్తున్న ఉదంతాలే ముంబాయి, సూరత్, భివాందీ మొదలైన అన్ని ప్రాం తాల్లో కనిపిస్తాయి. ఇటువంటి జీవితాలు ఈడుస్తూ కూడా వీళ్లు తెలంగాణలోని పోరాటాల నుంచి ఉత్తేజాన్ని పొందు తూ అక్కడి ప్రజలకు కూడా వికాసాన్ని యిస్తున్నారు. నైజాం వ్యతిరేక, బ్రిటిష్ వ్యతిరేక తెలంగాణ పోరాటం లో అజ్ఞాతంలోని రైతాంగ గెరిల్లాలు ఎంత పాత్ర నిర్వహించారో బొగ్గు బావుల్లోని కార్మికులు అంత పాత్ర నిర్వహించారు. పిట్టల రవీందర్ రాసినట్లు బొగ్గుబావులకు వలస బొంబాయి, దుబాయిలకు వలస వంటిది కాదు.

తెలంగాణ జిల్లాల్లోని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని రైతు కుటుంబాలు, ఒక ఇంట్లో నలుగురు కొడుకులు ఉంటే అందరికీ సరిపడ భూమి లేనపుడు ఇంటికి ఒకరైనా బొగ్గుబాయి ఉద్యమానికి పంపించారు. ఆ ఆదాయాలు అప్పటి ఉమ్మడి కుటుంబాల వ్యవసాయ జీవితానికి చన్నీళ్లకు వేడినీళ్లు అయినవి. ఆ కార్మిక చైతన్యమూ గ్రామాలు వెట్టి బతుకుల నుంచి మేల్కొనడానికి తోడ్పడింది. ముఖ్యంగా సింగరేణి బొగ్గుబావులు గోదావరిలోయ పొడుగునా ఆదిలాబాదులో బెల్లంపల్లి నుంచి కరీంనగర్‌లో గోదావరిఖని మీదుగా వరంగల్ (భూపాలపల్లిలో బొగ్గుబావులు తవ్విన తర్వాత), ఖమ్మంలో కొత్తగూడెం, మణుగూరు దాకా విస్తరించి సింగరేణి బొగ్గుబావుల పేరుతో గోదావరి తీర రైతాంగ పోరాటానికి కత్తి అంచువలె పనిచేసినవి.

ఇంగ్లండుకు బొగ్గు ఎగుమతి చేయడానికి బ్రిటిష్ వాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఈ గనులు ఇటు నైజాం పెట్టుబడులు, అటు బిర్లా పెట్టుబడులు - వెరసి బ్రిటన్ పారిశ్రామిక ప్రయోజనాలు అనే మూడు అంశాలు ఇమిడి ఉండడం వల్ల ఇక్కడ పుట్టుకు వచ్చిన కార్మిక వర్గం సామ్రాజ్యవాద, భూస్వామ్య, పెట్టుబడిదారీ దళారీలకు వ్యతిరేకంగా పోరా డే బాట వేసినట్లయింది. అందుకోసమే రైలు మార్గం కూడ పడి, గోదావరిలోయ విద్యుతుత్పత్తికి కూడా దోహదం చేసి విప్లవానికి పెట్టుబడి అనివార్యంగా కూర్చిన ప్రేరకాలైనవి.

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు ఏకకాలంలో రైతాంగ పోరాటాలను, కార్మికవర్గ పోరాటాలను, బుద్ధిజీవుల పోరాటాలను కూడ చేపట్టింది. కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడి మగ్ధూం మొహియొద్దీన్, సర్వదేవభట్ల రామనాథం నాయకత్వంలో బట్టల మిల్లుల్లో కార్మిక సంఘాలు ఏర్పడడంతో పాటు, సింగరేణి బొగ్గు గనుల్లో శేషగిరిరావు నాయకత్వంలో సింగరేణి కార్మిక సంఘం కూడా ఏర్పడింది. శేషగిరి నాయకత్వంలో బొగ్గు బావులలోని కార్మికులు చేసిన మహత్తర పోరాటాలను పి.చంద్ తన నవల ‘శేషగిరి’లో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఎంతో ప్రామాణికమైన చారిత్రక ఆధారాలతో రాసిన జీవిత చరిత్ర వంటి నవల అది.

సాహు, అల్లం రాజయ్య చారిత్రక నవల ‘కొమురం భీం’లో కూడా 1940లలో బెంగాల్ తేయాకు తోటల కార్మికుల అనుభవాన్ని కొమురం భీం ఆదిలాబాద్ జిల్లాకు తెచ్చి కలిగించిన చైతన్యం ప్రస్తావన వస్తుంది. జగిత్యాల, సిరిసిల్లా పోరాటాలు ప్రారంభమైన తర్వాత గ్రామాల్లో రగుల్కొన్న చైతన్యంతో, ఆ చైతన్యాన్ని రగిలించిన యువకులు తమ ఊళ్లల్లో ఉండడం అసాధ్యమైనపుడు ఎక్కువమంది బొగ్గు బావుల్లో పనిచేయడానికి వెళ్లారు. ప్రతి రైతు కుటుంబం నుంచి బతుకుదెరువు కోసం పోయే అనూచాన సంప్రదాయానికి తోడు ఇదొక విప్లవావసర వలస అయింది.

ఇటువంటి యువకులే బొగ్గు బావుల్లో పనిచేసే కార్మికుల జీవితాలను బాగు చేయడానికి సింగరేణి కార్మిక సమాఖ్యను ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారాలు ఎక్కడో కలకత్తాలో ఉన్న కోల్ ఇండియా కేంద్ర కార్యాలయంలో కాకుండా వేజ్ బోర్డు దిగివచ్చి పారదర్శకంగా బొగ్గు బావుల మీద కార్మికుల సమక్షాన పరిష్కారించాలన్న మిలిటెంటు పోరాటాలతో సికాస విజయం సాధించింది. జీతాలు, అలవెన్సులు వంటి ఆర్థిక పోరాటాలే కాకుండా కార్మిక జీవితాల్లో సమగ్రమైన వికాసం తెచ్చే, జీవితంలోని అన్ని రంగాలను స్పృశించే పోరాటాలను సికాస నిర్వహించింది.

కార్మికవర్గ పోరాట చైతన్యానికి సికాస, అటువంటి నిర్మాణ నాయకత్వానికి రమాకాంత్ పర్యాయ పదాలయిపోయాయి. బహుశా దేశంలో మరెక్కడా ఒక స్పష్టమైన పోరాట రాజకీయ దృక్పథంతో ఒక కార్మిక సంఘం ఇట్లా ఏర్పడడం చూసి ఉండం. సికాస నుంచే గోదావరి లోయ పొడుగునా జననాట్యమండలి బృందాలు ఏర్పడినవి. అమరుడు సుధ, అల్లం వీరయ్య వంటి వాళ్లు అద్భతమైన సెమ్మాసు పాటలు రాసారు. పి.చంద్ నవలలన్నింటికీ కార్యక్షేత్రం బొగ్గుబావే. స్వయం గా బొగ్గుబావి కార్మికుడైన తుమ్మేటి రఘోత్తం రెడ్డి కథలు, ‘నల్లవజ్రం’ నవల ఈ బొగ్గుబావి నుంచి తవ్వితీసి సాన బెట్టినవే.

అల్లం రాజయ్య ‘అగ్నికణం’ నవల, మరికొన్ని కథలకు మూలాలిక్కడివే. ముఖ్యంగా సికాస చరిత్రాత్మక సమ్మెకాలంలో బొగ్గుబావుల దగ్గర చేరిన కార్మికుల చర్చల నుంచి, పోరాటాల నుంచి ‘బొగ్గు పొరల్లో’ కథలు, నాటకం కూడా రూపొంది ‘కొలిమంటుకున్నది’ నవల శ్రవ్య, దృశ్య సాహిత్య, సాంస్కృతిక సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోయినవి. బెల్లంపల్లి నుంచి ఈ సికా స చైతన్యాన్నే పెద్ది శంకర్ మహారాష్ట్రలోని సిరొంచ అడవిలోని ఆదివాసుల మధ్యకు తీసుకుపోయాడు. ఆ నిప్పురవ్వే ఇవ్వాళ దండకార ణ్య పోరాట దావానలమైంది. చేనేత కార్మికుల వలసలకు కూడ ఇంత సుదీర్ఘమైన పోరాట చరిత్రే ఉన్నది.

ఇది షోలాపూర్‌తో ప్రారంభమైంది. హైదరాబాద్ రాజ్యంలోని మరఠ్వాడ ప్రాంతానికి బొంబాయి రాష్ట్రంలోని సరిహద్దు పట్టణం షోలాపూర్ - చాలా పెద్ద చేనేత పట్టణం. ఆ పట్టణంపై, పరిసర ప్రాంతాలపై ఇటు తెలంగాణ రైతాంగ పోరాట ప్రభావం, అటు బొంబాయిలో కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ నాయకత్వంలోని ట్రేడ్ యూనియన్ ప్రభావాలు ఉండేవి. తెలంగాణ పల్లెలనుంచి బతుకు దెరువుకోసం ఎక్కువ సంఖ్యలో చేనేత కార్మికులు ఇక్కడికే వెళ్తుండేవాళ్లు. అందువల్ల కూడ ఇక్కడ తెలంగాణ రైతాంగ పోరాట ప్రభావం ఎక్కువ.

సాయుధ పోరాటం ప్రారంభమైనాక రెండు ఉరిశిక్షలు పడిన నల్లా నర్సింహులు (కడివెండి, జనగామ తాలూక) జైలునుంచి తప్పించుకొని ఈ షోలాపూర్ వెళ్లి అజ్ఞాత జీవితం గడిపి, పోరాట విరమణ తర్వాత తిరిగివచ్చాడు. ఈ కాలం నుంచే బొంబాయి, భివాండీ, సూరత్‌లకు చేనేత కార్మికుల వలసలు ప్రారంభమైనా 1980లలో తెలంగాణలో రాజ్యహింస, నిర్బంధాలతో ఇవి మరీ ఎక్కువైనవి. కోరుట్ల మెట్‌పల్లి వంటి ప్రాంతాల నుంచి రోజూ బొంబాయికి, దుబాయికి వెళ్లే బస్సులను చూస్తే ఈ వలసలను అర్థం చేసుకోవచ్చు.

బొంబాయి బస్తీల్లో, భివాండీ, సూరత్ మురికివాడల్లో నికృష్టమైన బతుకు బతుకుతున్న ఈ తెలంగాణ కార్మికులు సిరిసిల్లా జగిత్యాల పోరాటల తర్వాత ఆ ప్రాంతాల్లో నిర్మించిన కార్మికోద్యమాలైనా, సాంస్కృతికోద్యమాలైనా తాము కరిగిపోతూ చుట్టూ వెలుగులు ప్రవరిస్తున్న జీవితాలకు దాఖలాలు. బొగ్గుబాయి, బొంబాయి ‘వలసలు’ సృష్టించినటువంటి కార్మిక వర్గాన్ని హైటెక్ పరిశ్రమలు, బహుళజాతి కంపెనీలు, ప్రత్యేక ఆర్థిక మండలులు సృష్టించగలవా? లేనపుడు అవి పరిశ్రమలు అవుతాయా? అది అభివృద్ధి అవుతుందా?

వ్యవసాయ జీవితానికి, రైతాంగానికి, గ్రామీణ వృత్తులకు అండ గా ఉండే పరిశ్రమలన్నీ మూత పడిపోతున్నవి. రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని క్రమంగా రద్దు పరచి సేవారంగాన్ని పెంచుతున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వ్యవసాయరంగానికే కాదు, వ్యవసాయ సంబంధ పరిశ్రమలకు కూడా శత్రువు. కోస్తా, ఆంధ్ర వలసీకరణకు తెలంగాణ బలి అవుతున్నదని భావించే తెలంగాణ వాదులు బొగ్గుబాయి, బొంబా యి ‘వలసలు’ సాధించిన ఈ అనుకూల ఫలితాలను కాపాడుకోవాలంటే పాలకుల వలసీకరణకు, కష్టజీవుల బతుకు దెరువు వలసలకు మధ్యనున్న ఈ గుణాత్మక వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి.

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: ఆగష్టు 26, 2008

భూమికోసం - అల్లం నారాయణ

ఈ భూమి కోసమే చరిత్ర నెత్తురోడింది. ఈ భూమి కోసమే మహా యుద్ధాలు జరిగాయి. ఈ భూమి కోసమే భారత రైతాంగం విముక్తి పోరాటాలు నడుపు తున్నది. భూమి చుట్టూ బతుకున్నది. పోరాటమున్నది. చరిత్ర మరిచిపోతే ఇప్పటి ఏలికలనూ ఈ భూమి చుట్టుకునే అవకాశమూ ఉన్నది.

బెంగటిల్లి చచ్చిపోయిండు శంకరయ్య. ఒక మామూలు రైతు. శంకరయ్య పోలేపల్లి బాధితుడు. మళ్ళీ పోలేపల్లి గురించే మాట్లాడాల్సి వస్తున్నది. ఉత్తమాటలే. ఏమీ జరగడం లేదన్నది పోలేపల్లి బాధితుల ఫిర్యాదు. నిజమే ఏమి జరుగుతుంది. చిరంజీవి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కనుక ఆయనకు సిరిసిల్లలో చే’నేతన్న’లు ఆత్మహత్య చేసుకోవడమూ, పోలేపల్లిలో అన్యాయంగా రైతులను బేదఖలు చేయడం అబ్బురమైపోతున్నది. ఒక సమస్యగానైనా కనబడ్తున్నవి. ఆయన తాజాగా ఉన్నారు కనుక ఇది మాట్లాడ్తున్నారు. కానీ, ఆత్మహత్యలు, నిర్వాసితులు, నేలను తలకిందు చేసి సబ్బండ వర్ణాలకు, కోటొక్క పరిసెకూ బువ్వ పంచిపెట్టే రైతన్నల బలవన్మరణాలు పట్టించుకునేంత పెద్ద సమస్యలు కాదు.

తోలు మందం పెరిగిన రాజకీయవేత్తలు ఎవరి ఊహాస్వర్గాల్లో వాళ్లు తేలియాడుతున్నారు. ఎవరితో పొత్తుపెట్టుకుంటే ఎన్ని సీట్లొస్తాయి. సీపీఐతో, సీపీఎం కలవాలా? చంద్రబాబు తో కామ్రేడ్స్ కత్తు కలపాలా! మధ్యలో టీఆర్ఎస్‌తో ప్రేమ విహారం చెయ్యాలా? బీజేపీ ఏం చెయ్యాలి! కాంగ్రెస్ ఒంటరియేనా! ఇదీ కదనకుతూహలం. ఇదీ పార్టీల ప్రాథమ్యం. సిరిసిల్ల ఉరిశాల అయితేనేమి? ఆకలి చావు చస్తేనేమి? ఆత్మహత్య చేసుకుంటేనేమి? ‘ఎవరి కి పుట్టినవే బిడ్డా అంటే అంగట్ల పుట్టిన అవ్వా’ అన్నట్టు… ఎవరు వాళ్లు. ఎవరి శవాలవి! చివరికి బొందపెట్టడానికి ఊరిలో ఆరుగజాల నేల కరువైందని కన్నీళ్లు పెట్టుకుంటున్న పోలేపల్లి సెజ్ బాధితులను అడుగు.

ఇప్పటికే గోడలు కట్టేసుకుని సెజ్‌లు ప్రారంభించిన చోట, ఉన్న ఎకరమూ కోల్పోయి, పాతికో, పరకో పరిహారంగా వస్తే ఖర్చయిపోయి, చేసేందుకు పనిలేక, సెజ్ లో ఉద్యోగం ఎండమావులై ఖాళీగా చేతులు ముడుచుకు కూర్చున్న సత్యవేడు ప్రాంతాల రైతులనడుగు. ఏమి మిగిలింది చివరకు కొన్ని కన్నీళ్లు… ఎంతకూ తీరని కొంత దుఃఖం. నిర్వాసితులవడం అంటే నీ ఇల్లు నువ్వు ఖాళీ చేయడం. నీ భూమి నుంచి నీ తల్లి వేరు నుంచి నువ్వు వేరుకావడం. నీ వాకిలినుంచి, వాకిలిలో తలలూపే చెట్లనుంచి, పచ్చిక బయళ్లనుంచి, ఒరంజెక్కి, ఒడ్డుపెట్టి, అడుగడుగూ కదం కలిపి, కుళ్లగించి, పెళ్లగించి, చదునుచేసి దున్ని, దోకి, విత్తులేసి, లేలేత మొక్కలొస్తే మురిసిపోయే రైతు జీవితపు అత్యంత అద్భుతమైన జీవన సౌందర్యాన్ని కోల్పోవడం.

సృష్టికర్తలకు భూమినుంచి బేదఖలు కావడానికన్నా పెద్దసమస్య ఉండబోదన్న సమస్య ఈ తైతక్కల, టక్కుటమారాల మాయామోహపు వలలుపన్నే మాటల మూటలు కట్టే రాజకీయ నాయకులకు ఎట్లా తెలుస్తాయి. నిజమే అడ్డపంచె ఎగేసి కట్టినంతమాత్రాన ఎవరైనా రైతు ఆత్మను ఎట్లా పొందగలరు. ప్యాంటు తొడుక్కున్న వాళ్లకు ఎలాగూ ఆ ఆత్మశూన్యము. ఒకవేళ నిజంగానే మన నేతలకు రైతు ఆత్మ ఉంటే ప్రాణంగా ప్రేమించే, ప్రాణంగా భావించే నేలతల్లి నుంచి రైతులను బేదఖలు చేసి, రసాయనాల కంపెనీ లు ఎందుకు పెడ్తారు. భూమి గుండె చప్పుడు వినగలిగిన శక్తి ఉన్నవాళ్లైతే, పర్యావరణ కాలుష్యాలకు విలవిలాడుతున్న నేలతల్లి ఆత్మఘోషను కనకుండా ఎలా ఉండగలరు.

దృశ్యం ఒక్కటే కానీ ఆత్మలు వేరు. పంచెధారి ఒకరు గొంగడిలో నడినగరంలో మీకు గిరిజనుడిలా, గిరిపుత్రుడిగా కనిపించవచ్చుగాక. కానీ ఆయన గిరిపుత్రుడు కాలేడు. ఆయనలో హెటరోడ్రగ్స్, టెట్రాడ్రగ్స్, సిమెంటు కంపెనీలు, స్టీల్ కంపెనీలు, ఓడరేవులు, ఇనుప ఖనిజపు అవశేషాలు, కంప్యూటర్ డబ్బాలు దాగున్నాయి. అంతరంగంలో ఆయనలో రైతాంగాన్ని నేల నుంచి వేరుచేసి హింసించే, బతుకుదెరువును ఊడలాక్కునే ఒక విధ్వంసకారుడు ఉన్నాడు. అమెరికా నుంచో ఆవలి సముద్రాల నుంచో తైతక్కలాడిస్తున్న ‘పెద్దన్న’లూ ఉన్నారు. అదీ సమస్య. అవునూ వచ్చేదా? చచ్చేదా; ఏమొస్తుంది వ్యవసాయంతో ఏమివ్వగలదు సేద్యం. అవునూ భూమిని నమ్ముకుంటే ఏమి వస్తుంది. ఏమీరాదు. పోదు. నిజమే నా? అలాంటి పనికిరాని భూమిని ఏలికలు ఎందుకు లాక్కుంటున్నట్టు. భూమి అంటే తెలుసా! అదొక సృష్టి. ఏమిచ్చినా ఇవ్వకున్నా అది చేతినిండా పనివ్వగలదు. ఏమిచ్చినా ఇవ్వకున్నా బతుకు భరోసా ఇవ్వగలదు.

నోట్లోకి రెండు మెతుకులు ఇవ్వగలదు. లోకానికంతటికీ కొచ్చెటి మెతుకులు ఇవ్వగలదు. ఆ నేలను నమ్ముకున్న రైతుల గురించి మళ్లీ మాట్లాడడం అవసరమే. పోలేపల్లి, సత్యవేడు, కాకినాడ, కడప ఏదీ మినహాయింపు. ఏలికల వి«ధ్వంస ప్రణాళికల విషపు కన్ను పడినమేరా రైతులకు బతుకుల్లో పరుచుకుంటున్న ఎడారులు. జీవం లేని కళ్లల్లో మొలుస్తున్న జిల్లే ళ్లు. అయ్యా! అందరూ వస్తున్నరు. చెబుతున్నం. పోతున్నరు. కానీ మాకు భూమికి బదులు భూమి రాలేదు. ఎట్లా బతకాలో చెప్పండి. అని అడుగుతున్న లంబాడీలకు ఎవరు మాత్రం ఏమివ్వగలరు. నిజమే. కోటి వరాలిచ్చినా వాళ్లభూమికి భూమివ్వడం కిందకు రాదు. చెట్టు ఒక జీవ సంబంధం. మనుషులను పశుపక్షాదులను, మనుషుల మధ్య సంబంధాలను నిర్మించే కూడలి చెట్టు. చెట్టుకింద పంచాయితీలు, చెట్టు చప్టామీద బాతాఖానీలు, దుఃఖాలు, ఊరడిం పులు, ఆవేశాలు, ఆరాటాలు, నవ్వులు, ప్రేమలు, మమకారాలు, ఒక పల్లెకు చెట్టొక జీవన సూత్రం. నిండు బతుకుకు సూచిక. అలాంటి చెట్టూ లేని ఊరిలో ఎక్కడ ఉండమంటారు.

ఏలికలు. సెజ్‌లు పెట్టే చిచ్చు గురించి ఎట్లా చెప్పేది ఈ ఇనుప గుండెల మనుషులకు. కరడుగట్టిపోయి లోహం మాదిరి గడ్డకట్టిపోయిన మనుషులకు చెట్టు, పుట్ట, నేల, ఆవరణం, జీవం నిలపడానికి, నిండు జీవనం తొణికిసలాడడానికి, పల్లె నిర్మాణానికి ఉనికికీ, మనుగడకూ అవసరాలన్న విషయం ఎవరు చెప్పగలగాలి! భూమి అంటే ఏమిటి? అదొక ఎడతెగని బంధం. పుట్టుక నుంచి చావుదాకా మనిషితో వచ్చే బంధం. ఈ భూమి కోసమే చరిత్ర నెత్తురోడింది. ఈ భూమి కోసమే మహా యుద్ధాలు జరిగాయి. ఈ భూమి కోసమే భారత రైతాంగం విముక్తి పోరాటాలు నడుపుతున్నది. భూమి చుట్టూ బతుకున్నది. పోరాటమున్నది. చరిత్ర మరిచిపోతే ఇప్పటి ఏలికలనూ ఈ భూమి చుట్టుకునే అవకాశమూ ఉన్నది. ఇక్కడొక కథ గుర్తుకొస్తున్నది.

ఒక ఇరాక్ రైతు భూమిని తీసుకున్నది ప్రభుత్వం. కోర్టులో కేసు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, కొండపొడుగు చర్చలూ విన్న రైతు అమాయకంగా ఒక ప్రశ్న అడిగాడు ‘అవునూ నాకు ప్రభుత్వమనే ఒక ‘దాయాది’ ఉన్నట్టు తెలియదే’ అని. ఇప్పుడు పోలేపల్లి బాధితులు అడుగుతున్నారీ ప్రశ్న. వారి భూమిలో ఆ డ్రగ్స్, ఈ డ్రగ్స్ పెట్టుకోవడానికి, ఆ రెడ్డో, ఈ రెడ్డో, ఆ రావో, ఈ రావో మాకేమన్నా ‘దాయాదులా’ అని అడిగేరోజొకటి రాక తప్పుతుందా! ఏలికా! బహుపరాక్.

- అల్లం నారాయణ

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 27 సెప్టెంబరు 2008

ఉరితాళ్ళు పేనింది పాలకులే! -అమర్

సిరిసిల్ల పవర్‌లూమ్ వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.

చిరంజీవి గత నెల 20వ తేదీన ఏ కారణంతో సిరిసిల్ల పర్య టన చేపట్టినప్పటికీ, అక్కడి నేత కార్మికుల దుర్భర పరిస్థితుల్ని మరొకసారి లోకానికి చాటినట్టయింది. సిరిసిల్లలో నేత కార్మికుల దుస్థితికి ఎన్డీఏ, యూపీఏ -రెండూ బాధ్యత వహించాల్సిందే. అందు వల్ల సమస్య తీవ్రతను గుర్తించి దాని పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి సిరిసిల్ల బాధిత ప్రజల మధ్యనే పీపుల్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. బాధిత ప్రజలను, నేత కార్మిక సంఘాలను చేనేత రంగ నిపుణులను సహకార సంఘాలను కూడగట్టి సమిష్టి పరిష్కారాన్ని కనుక్కునే బాధ్యతను తెలంగా ణవాదులు తమ భుజానికెత్తుకోవాలనేది నా అభిలాష.

మొదట ఆత్మహత్యలు అరికట్టడానికి తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. కార్మిక సంఘాలు, సామాజిక సంస్థలు, హక్కుల సంఘాలు నిలబడి తమకు చేతనైన సహాయం చేస్తూనే, బాధిత ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాలి. ఎల్లవేళలా పాలకవర్గాలు ఉత్పత్తి సంక్షోభాన్ని కేవలం మార్కెటు సమస్యగా చిత్రించి తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఆధునికత- అభివృద్ధి పేరిట అనుసరించిన సామ్రాజ్య వాద విధానాల వల్ల, అందులో భాగంగా రూపొందించిన నూతన జౌళి విధానం వల్ల సిరిసిల్లకు ఈ దుస్థితి పట్టింది. నూతన జౌళి విధానానికి స్వస్తి చెప్పి, నేత రంగంపై ఉన్న అప్పులన్నీ రద్దుచేసి, కార్మికులందరికి ఉపాధి కల్పించే దిశగా, అంతిమంగా దేశీయ వస్త్ర పరిశ్రమను కాపాడుకునే విధంగా ఆందోళన కొనసాగాల్సిన అవసరం ఉంది.

అతిపెద్ద ఉపాధిరంగంగా ప్రసిద్ధి గాంచిన చేనేతరంగాన్ని విడిగా అభివృద్ధి చేయకుండా పాలకవర్గాలు మిల్లురంగం, పవర్‌లూమ్ రంగాలను చేనేతతో కలిపి భారత జౌళిరంగ విధానాన్ని రూపొందించారు. కార్మికులు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ దీనిని 1985లో ప్రజలపై రుద్దారు. పైగా వ్యవస్థాగత సర్దుబాటు కార్య క్రమం పేరిట 1991లో సరళీకృత విధానాలు అమలు చేశారు. దీనివల్ల నూలు- రంగుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2000 సంవత్సరంలోనే జౌళీ పార్కుల కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం టెక్నికల్ అప్‌గ్రెడేషన్ ఫండ్ (టియుఎఫ్) పేర 25,000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చింది. భారీ పెట్టుబడిదార్లకు ఆటోమైజేషన్ పేరుమీద భారీ సబ్సిడీలు ఇచ్చింది. ఆధునిక టెక్నాలజి పేరు మీద మరమగ్గాల దిగుమతులకు రాయితీలిచ్చింది.

20 శాతం పెట్టుబడి రాయితీలు, 100 శాతం మౌలిక వసతుల సబ్సిడీ, ఉచిత విద్యుత్, ఉచిత నీరుతోపాటు 5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వడానికి అంగీకరించి ఎన్డీఏ ప్రభుత్వ జాతీయ జౌళీ విధానం బహుళ జాతి సంస్థలకు, బడా పెట్టుబడిదార్లకు ఎర్ర తివాచీలు పరిచింది. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో జరిగిన ఆత్మహత్యలను అరికడతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ చర్యలు తీసుకోలేదు. పైగా ఆటోమైజే షన్‌తో కూడిన 14 జౌళీ పార్కుల నిర్మాణానికి రాష్ట్ర జౌళీ విధానం పేర భారీ ప్రణాళిక(2005-10)ను ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో హైదరాబాద్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు 300 ఎకరాల స్థలంలో 300 కోట్లతో ప్రారంభ సన్నాహాలు చేశారు. ఈ పార్కుల్లో కూడా జెట్‌లూమ్స్ (నాడీ లేకుండా వాయు వేగంతో నడిచే మరమగ్గాలు) ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ పథకం. సరిగ్గా తమిళనాడు, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల్లో ఇదే రకం ఉత్పత్తి విధానంతో పోటీపడలేక సిరిసిల్ల పవర్‌లూమ్ రంగం కుప్పకూలిందని నేత కార్మి కులు ఆరోపిస్తున్నారు.

ప్రపంచీకరణతో పొరుగుదేశాల నుంచి వస్త్రాలు, పట్టునూలు దిగుమతి చేసుకోవడంతో వారణాసి మొదలుకుని పోచంపల్లి వరకు పట్టు వస్త్ర పరిశ్రమ వీధుల్లో పడ్డది. పోచంపల్లి టై అండ్ డై తోపాటు చేనేత నైపుణ్యంపై కార్మికులకు పేటెంట్ హక్కులిచ్చి, అప్పులన్నీ రద్దు చేయాల్సింది. ఇది చేయకపోగా, సిరిసిల్ల లాంటి పవర్‌లూమ్ వస్త్రపరిశ్రమను పరిరక్షించకుండా, ప్రతి మనిషి రోజుకు సగటున 960 గజాల వస్త్రం నేసే జెట్‌లూమ్‌ల కోసం జౌళీ పార్కుల విధానాన్ని ప్రకటించడం, సిరిసిల్లను మరింత వధ్యశాలపై నెట్టడానికే దారితీస్తుంది.

వస్త్ర పరిశ్రమను కొద్దిమంది బడా వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి. అలాగే సరళీకరణ-ప్రపంచీకరణలో భాగంగా గుత్తపెట్టుబడిదార్లకు అనుగుణంగా ఉన్న జాతీయ జౌళి విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వ జౌళి విధానాలను మార్చకుండా 414 కోట్లకు చేరిన చేనేత రంగ బకాయిలు, ప్రైవేటు అప్పులు చెల్లించకుండా నేత రంగంలో ఆత్మహత్యలను అరికట్టడం సాధ్యం కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి బాధిత సిరిసిల్ల ప్రజలమధ్య ‘పీపుల్స్ రౌండ్ టేబుల్’ జరగాలని అభిలషిస్తూ, కొన్ని అంశాలు చర్చకు ప్రతిపాదిస్తున్నాను. 1997ను ప్రాతి పదికగా తీసుకుని, ఆత్మహత్యలు- ఆకలిచావులతోపాటు అనారోగ్యం తదితర కారణాలతో బలవన్మరణాలకు గురయిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషి యా ఇచ్చి, పిల్లలకు ఉచిత చదువుతో పాటు కుటుంబంలో ఒకరికయినా ఉపాధి కల్పించాలి.

పేరుకుపోయిన వస్త్రాలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి, తిరిగి ఉత్పత్తికి అవసరమయిన ముడిసరుకును, విద్యుత్‌ను సబ్సిడి రేట్లకు అందజేయాలి. సిరిసిల్ల పవర్‌లూం వస్త్రాల కొనుగోలుకు వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించి మార్కెట్ గ్యారంటీ కల్పించాలి. కార్మికులపై, సహకార సంఘాలపై ఉన్న ప్రభుత్వ బకాయిలను రద్దు చేయాలి. మైక్రోఫైనాన్స్ లాంటి ప్రైవేటు రుణాలకు ప్రభుత్వమే దఖలుపడాలి. షరతుల్లేకుండా రుణపరపతి కల్పించాలి.

అపెరల్ పార్కుల పేరిట భారీ రాయితీలతో సాగుతున్న గుత్తపెట్టుబడిదారు ల దోపిడికి అడ్డుకట్ట వేయాలి. ఉపాధి ప్రాతిపదికగా ప్రజామోదంతో సిరిసిల్లను టెక్స్‌టైల్ జోన్‌గా ప్రకటించాలి. కార్మికులందరికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ప్రత్యేక వృద్ధాప్య పింఛనును 1,000 రూపాయలకు పెంచాలి. నేత కార్మికులకు కనీసవేతనాలు అమలు పరచాలి. నిత్యావసర సరుకులన్నీ సబ్సిడి రేట్లకు చౌక దుకాణాల ద్వారా అందించాలి. తక్షణ సహాయ చర్యలకోసం, రుణ విముక్తికోసం కార్పస్‌ఫండ్‌తో స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాలి. చేనేత పరిశ్రమ పేటెంట్ హక్కులిచ్చి చారిత్రిక కళానైపుణ్యాలను పరిరక్షించాలి.

-అమర్ (జనశక్తి రాజకీయ ఖైదీ)

సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేది: 9 అక్టోబరు 2008

వైట్ హౌస్ లో మాయగాళ్ళు

అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు, జార్జ్ బుష్ అమెరికా ప్రజల, ప్రవాసుల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. అప్పులలో నిండా మునిగిన ‘బేర్ స్ట్రెన్స్’ను 29 బిలియన్లతో, ఫ్రెడీ మేక్ – ఫ్రెనీమే కంపెనీలను 200 బిలియన్లతో, ఎఐజి ఇన్యూస్సూరెన్స్ కంపెనీని 85 బిలియన్లతో కొన్నాడు.


అమెరికా ఆర్ధికరంగం పేకలమేడలా కుప్పకూలుతుంది. బ్యాంకులు, ఇన్యూసురెన్స్ కంపెనీలు, తాకట్టు కంపెనీలు ( మోర్టగేజ్ కంపెనీలు) నష్టాల ఊబిలో కూరుకుపోయి దివాళ తీస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నది. మరి దీనిలో వెనకాల వున్న కారణలు ఏమిటి?

ఈ ఆర్ధిక సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి కాస్తంత చారిత్రాత్మకంగా, అమెరికా ఆర్థిక విధానాలను గమనించాలి. అమెరికా లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, తాకట్ల కంపెనీలకు లాభం చేకూరే విధంగా అప్పటి ప్రభుత్వం 1938 లో ‘ఫెన్నీ మే’ 1970 లో ‘ఫ్రెడ్డీ మేక్’ అనే కంపెనీలను ప్రారంభించింది. యీ కంపెనీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల, తాకట్టు కంపెనీలకు పరోక్షంగా ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చాయి.

ఆర్థిక స్థోమత్త లేని వాళ్ళకు విపరీతమైన అప్పులిచ్చి రియల్ ఎస్టేట్ మార్కెటులో ఒక కృతిమైన డిమాండ్ సృష్టించారు. ఇళ్ళ ధరలను వాస్తవ విలువ కంటే విపరీతంగా రియల్ఎస్టేట్ కంపెనీలు పెంచేసాయి. వడ్డీ వ్యాపారం రుచి మరిగిన బ్యాంకులు, వ్యాపార సంస్థలు ఎలాంటి నియమనిబంధనలు పాఠించకుండా, అప్పులు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన జనం, తీసుకున్న అప్పులను చెల్లించలేక పోయారు. వడ్డీ వ్యాపారంలో జూదమాడిన కంపెనీలు పేకలమేడలా కుప్ప కూలుతున్నాయి. తాము తీసుకున్న గోతి లో తామే పడ్డాయి. కారల్ మార్క్స్ అన్నట్టుగా “పెట్టుబడిదారులు తమ బొందను తామే తవ్వుకుంటారని” వాస్తవంగా జరుగుతుంది. అమెరికా లో పెట్టుబడి వ్యవస్థ పరాకాష్టకు చేరుకుంది. 1930 అమెరికా లో ‘గ్రేట్ డిప్రెషన్’ (ఆర్ధిక వినాశకం) పునారావృత్తం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా చరిత్రలో, ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో, అమెరికా ప్రభుత్వం 700 బిలియన్ల డాలర్ల ప్రజల సొమ్ముని వాల్ స్ట్రీటు లో జూదమాడి నిండామునిగిన దళారులకు, తాకట్టు కంపెనీలకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తుంది. దీనిని అధికారంలో వున్న రిపబ్లికను పార్టీ, ప్రతిపక్షంలో వున్న డెమొక్రెటిక్ పార్టీ రెండూ సమర్ధిస్తున్నాయి.

ఈ సందర్భంగా ప్రభుత్వం, రాజకీయనాయకుల పాత్రను గమనించాలి. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ , ఆర్ధికమంత్రి హెన్రీ పాల్సన్ ప్రభుత్వపరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారు. బ్యాంకులు, తాకట్టు కంపెనీలు, వ్యాపారసంస్థలమీద ఎలాంటి ప్రభుత్వనియంత్రణ లేకుండా, తమ ఇష్టారాజ్యంగా నడిచాయి. వాల్ స్ట్రీటు జూదగాళ్ళ నష్టాలను సామాన్య జనం నెత్తిన రుద్దుదామని కొంతమంది రిపబ్లికన్లు, డెమోక్రెట్లు ప్రయత్నిస్తున్నారు. 700 బిలియన్ల ప్రభుత్వసొమ్ముని (అంటే అమెరికా ప్రజల సొమ్ముని) వాల్ స్ట్రీట్ షేర్ మార్కెటు దళారులకు ఇవ్వాలని ప్రత్నిస్తున్నారు. కొంతమంది అమెరికను కాంగ్రెసు సభ్యుల విజ్ఞత వల్ల “700 బిలియన్ల బెయిల్ అవుట్” బిల్లు ఓడిపోయింది.

అమెరికాలో అత్యంత ధనవంతమైన వ్యాపారసంస్థ జనరల్ ఎలక్ట్రిక్ చెందిన ఎన్.బి.సి, టైమ్ వార్నర్ చెందిన సి.ఎన్.ఎన్, అలాగే అత్యంత పెద్ద మీడియా కంపెనీ అయిన న్యూస్ కార్పొరేషన్ తమ స్వప్రయోజనాలకోసం యీ బిల్లును సమర్ధిస్తున్నాయి. “మీ ఉద్యోగాలు పోతాయి, మీకు జీతాలు రావు, ఎ.టి.యం కార్డులతో డబ్బు తీసుకోలేర”ని తప్పుడు ప్రచారంతో జనాన్ని బయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఒకవైపు అమెరికాలో మెజార్టీ ప్రజలు “బెయిల్ అవుట్” బిల్లును వ్యతిరేకిస్తున్నా, మరొకవైపు ప్రభుత్వం-రాజకీయనాయకులు-బడా కంపెనీలు “బెయిల్ అవుట్” బిల్లును అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికా లో బిజినెస్ లాబీలు ప్రభుత్వం-రాజకీయనాయకులను నియంత్రిస్తాయి. ఒకమాటలో చెప్పాలంటే, అధ్యక్షపదవి పోటిపడుతున్న బారకా ఒబామా 400 మిలియన్లు, జాన్ మెకేయిన్ 300 మిలియన్లు ( రిపబ్లికను పార్టీ తోకలపి) వసూలు చేసారు. దీనిలో మెజార్టీ భాగం బిజినెస్ లాబీల దగ్గర నుండి వచ్చిందే. సెనేట్ లో రాత్రింబగళ్ళు కష్టపడి సెనేటర్లు యీ బిల్లును ఆమోదించి దివాళ తీసిన వ్యాపారసంస్థలకు లాభం చేకూర్చారు.

చివరికి ‘అమెరికను కాంగ్రెసు’ 700 బిలియన్ల బిల్లును సాగదీసి 840 బిలియన్లు చేసి ఆమోదించింది. వెంటనే జార్జ్ బుష్ సంతకంచేసి చట్టం చేసాడు. అమెరికా ప్రభుత్వం, రాజకీయనాయకులు, వ్యాపారవర్గాలు ఎంతగా లాలూచీ పడ్డారో, తమ స్వప్రయోజనాలకోసం దేశాన్ని ఎలా తాకట్టు పెడతారో స్పష్టమైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంత దివాళకోరు స్థితికి చేరుకోవటం పరాకాష్ట. ఇదొక పట్టపగలి దొంగతనం; ప్రభుత్వం చట్టబద్దంగా జనాన్ని దోచుకున్న వైనం.