Thursday, May 8, 2008

అతడామె గురించి చాలా చెప్పాడు, కానీ ఆమె మాత్రం padma


అతడామెను

నడిచే చందమామ అనీ
పరచుకొన్న వెన్నెలనీ
నిలచిపోయిన వసంతమనీ
అని వర్ణించాడు.

ఆమె నవ్వును
పూల పరిమళంతోను
సెలయేటి స్వచ్చతతోను,
రత్న కాంతుల సవ్వడితోను పోల్చాడు.

ఆమె కళ్లను
బటర్ ఫ్లై విప్పారిన రెక్కల ద్వయమనీ
ఆత్మలోక ద్వారాలనీ
రెండు పున్నమిలనీ
మిగిలిన దేహమంతా
ఆ రెండు కళ్లకూ పొడిగింపనీ అన్నాడు.

ఆమె చూపుల్లో
ప్రేమలోక సంగీతముందనీ,
కాంతులీను కరుణా ఝురిలున్నాయనీ,
అమరత్వానికి ఆహ్వానాలున్నాయనీ అన్నాడు.

ఆమె మాటలు
నెరళ్లు తీసిన నేల అడుగున
ఉండే విత్తును మొలకెత్తించే ఆర్ధ్రతనీ,

పరాజితుడిని కూడా అజేయుడిని
చేయగలిగే మంత్రమోహన శక్తులనీ,

తేనె జలపాతాలు కుచించుకుపోయి ఆమె

పెదవులపై తారాడే శబ్ధ తరంగాలయ్యాయనీ,



ఎన్నో అన్నాడు
అతడామె గురించి చాలా చెప్పాడు

కానీ ఆమె మాత్రం
ఒక చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది.
తెరచాటు మనిషి కదా!

1 comment:

Bolloju Baba said...

ఈ కవిత నా పోస్టుకు కాపీ దయచేసి డేట్లను గమనించగలరు
http://sahitheeyanam.blogspot.in/2008/05/blog-post_04.html