Sunday, May 11, 2008

అవును, రెఫరెండమే:కేసీఆర్

Tuesday, 06 May , 2008, 10:07

హైదరాబాద్: ఉప ఎన్నికలు తెలంగాణకు రెఫరెండమేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపాలను చిత్తుగా ఓడించి తెరాస అభ్యర్థులందర్నీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెదేపాలకు డిపాజిట్‌ దక్కదని జోస్యం చెప్పారు. ఈనెల 8న తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారని తెలిపారు. ఈనెల 11న వరంగల్‌ జిల్లా పరకాలలో తాను ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టనున్నట్లు తెలిపారు. వేసవి కాలం కాబట్టి రాత్రిళ్లు ఎక్కువ సమయం వరకు ప్రచారం చేసే వెసులుబాటు కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరతామని చెప్పారు

No comments:

Post a Comment