Friday, April 25, 2008

జనార్దనరెడ్డి



హైదరాబాద్‌, : జనార్దనరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 2008 మార్చిలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 2009 ఏప్రిల్‌ వరకు ఉన్నందున ఉప ఎన్నిక ఖచ్చితంగా జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ తరువాత సభ కాలవ్యవధి అతి తక్కువకాలం ఉంటే ఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం పునరాలోచిస్తుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ కాలవ్యవధి ఇంకా 16 నెలలకు పైగా ఉంది. అందువల్ల
త్వరలోనే ఎన్నిక వస్తుందని భావిస్తున్నారు. కర్ణాటక శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ శాసనసభ రద్దవడంతో ఏప్రిల్‌లోగా ఎన్నికలు జరిపి తీరాలి. ఆ మేరకు కర్ణాటక ఎన్నికలు మార్చిలో జరగవచ్చునని వాటితో పాటే ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం జనార్దనరెడ్డి కుమారుడు విష్ణువర్దన్‌కే దక్కే అవకాశాలున్నాయి. మూడున్నర దశాబ్దాలపాటు పీజేఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలపై అధిష్ఠానంలో గుర్తింపు ఉంది. ఆయన అహర్నిశలు పార్టీ కోసం పని చేశారని ఢిల్లీ నేతలు కూడా శ్లాఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీజేఆర్‌ కుటుంబం నుంచే ఒకరికి అవకాశం ఇవ్వడం గ్యారంటీ అని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఈ విషయంలో అడ్డుపడే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. పీజేఆర్‌ కుటుంబంలో సహజంగానే తొలుత ఆయన భార్య సులోచన పేరు వినిపిస్తోంది. అయితే ఆమె ఆరోగ్యరీత్యా ఎన్నికల్లో తలపడి ఆ తరువాత ప్రజలతో సంబంధాలు నెరపడం కష్టమవుతుందనే భావన పీజేఆర్‌కు అత్యంత సన్నిహితులయిన వారిలో ఉంది. అందువల్ల యువకుడైన విష్ణువర్దన్‌నే పీజేఆర్‌ వారసునిగా ఆయన కుటుంబం ప్రకటిస్తుందని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా విష్ణు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. విష్ణును రాజకీయవారసుణ్ణి చేయాలనే తలంపు పీజేఆర్‌లోనూ ఉండేదని, ఇప్పుడుకూడా అందుకనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ర్దనరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 2008 మార్చిలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 2009 ఏప్రిల్‌ వరకు ఉన్నందున ఉప ఎన్నిక ఖచ్చితంగా జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ తరువాత సభ కాలవ్యవధి అతి తక్కువకాలం ఉంటే ఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం పునరాలోచిస్తుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ కాలవ్యవధి ఇంకా 16 నెలలకు పైగా ఉంది. అందువల్ల
త్వరలోనే ఎన్నిక వస్తుందని భావిస్తున్నారు. కర్ణాటక శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ శాసనసభ రద్దవడంతో ఏప్రిల్‌లోగా ఎన్నికలు జరిపి తీరాలి. ఆ మేరకు కర్ణాటక ఎన్నికలు మార్చిలో జరగవచ్చునని వాటితో పాటే ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం జనార్దనరెడ్డి కుమారుడు విష్ణువర్దన్‌కే దక్కే అవకాశాలున్నాయి. మూడున్నర దశాబ్దాలపాటు పీజేఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలపై అధిష్ఠానంలో గుర్తింపు ఉంది. ఆయన అహర్నిశలు పార్టీ కోసం పని చేశారని ఢిల్లీ నేతలు కూడా శ్లాఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీజేఆర్‌ కుటుంబం నుంచే ఒకరికి అవకాశం ఇవ్వడం గ్యారంటీ అని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఈ విషయంలో అడ్డుపడే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. పీజేఆర్‌ కుటుంబంలో సహజంగానే తొలుత ఆయన భార్య సులోచన పేరు వినిపిస్తోంది. అయితే ఆమె ఆరోగ్యరీత్యా ఎన్నికల్లో తలపడి ఆ తరువాత ప్రజలతో సంబంధాలు నెరపడం కష్టమవుతుందనే భావన పీజేఆర్‌కు అత్యంత సన్నిహితులయిన వారిలో ఉంది. అందువల్ల యువకుడైన విష్ణువర్దన్‌నే పీజేఆర్‌ వారసునిగా ఆయన కుటుంబం ప్రకటిస్తుందని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా విష్ణు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌యుఐ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. విష్ణును రాజకీయవారసుణ్ణి చేయాలనే తలంపు పీజేఆర్‌లోనూ ఉండేదని, ఇప్పుడుకూడా అందుకనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల భావప్రకటనా స్వేచ్ఛపై దాడిని ఖండించండి!

జర్నలిస్టు పిట్లల శ్రీశైలం విడుదల డిమాండు చేయండి!!

తన వృత్తిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకుడ్ని ఒకర్ని ఇంటర్వూ చేద్దామని వెళ్ళిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలం(33)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకాశం జిల్లా కందుకూరు లో అరెస్టు చేశారు. శ్రీశైలం మావోయిస్టులకు కొరియర్ గా పనిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు.

మంగళవారమే (04-12-2007) తనను పోలీసులు అరెస్టు చేశారనీ శ్రీశైలం మీడియా ముందు చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే శ్రీశైలం తనపై వచ్చిన ఆరోపణలన్ని కట్టుకథలని ఖండిస్తున్నారు. అయినా పోలీసులు రకరకాల కేసులు పెట్టి వేదిస్తున్నారు. విలేకర్లతో, మీడియాతో శ్రీశైలంను ఎంతోసేపు మాట్లాడనివ్వడం లేదు.

దీనంతటికీ కారణం జర్నలిస్ట్ శ్రీశైలం ఒక ప్రత్యామ్నాయ మీడియం ఏర్పాటు చేయడం, ఈ కృషిలో భాగంగా “మూసీ టీవీ” పేరుతో తెలంగాణ జిల్లాలో జరుగుతున్న రాజకీయ, సామాజిక, సాహిత్య కార్యక్రమాలను రికార్డు చేసి జనం ముందు తీసుకొని రావడం. దీనివల్ల తెలంగాణలో జరిగే అనేక అన్యాయాలను, వార్తాంశాలను బయటపెడుతూ, తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేయడంలో శ్రీశైలం నిరంతరం కృషిచేస్తున్నారు. అంతే కాదు తెలంగాణ జర్నలిస్టుల కార్యక్రమాలను, పల్లె పాటలను కూడా మూసీ టీవీ ద్వారా అందిస్తున్నారు. ఒక జర్నలిస్టుగా అనేక అభిప్రాయాలను ఇంటర్నెట్ పత్రిక “మూసీ టీవీ” ద్వారా అందిస్తున్నారు. పాత్రికేయ వృత్తిలో భాగంగా రకరకాల వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. మావోయిస్టుల సమాచారాన్ని ప్రజలకు చేరనివ్వకుండా ప్రభుత్వం వివిధ ఆటంకాలను కల్పించాటానికి రకరకాల కథనాలను చెప్తుంటారు. దీనిలో భాగమే జర్నలిస్ట్ శ్రీశైలం పై కొరియర్ అనే ముద్ర వేసి ఆయన్ని అరెస్టు చేయడం. దీన్ని ఇప్పటికే ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారు. జర్నలిస్టులు ర్యాలీలు చేస్తున్నారు.

పోలీసులు శ్రీశైలం పై పెట్టిన కేసులను ఎత్తివేసి వెంటనే ఆయన్ని విడుదల చేయాలనీ, భారత రాజ్యాంగం ఇచ్చిన పత్రికా స్వేచ్ఛ కాపాడవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు చేస్తున్న ప్రచారం వల్ల శ్రీశైలం కు ప్రాణ హాని తలపెట్టే అవకాశం కూడా ఉంది. ఈ చర్యను అందరు ముక్తకంఠంతో ఖండించవలసింది గా విజ్ఞప్తి చేస్తున్నాం.

కలానికి సంకెళ్ళేస్తే నిజాలు దాగవు: జర్నలిస్టు శ్రీశైలం

ప్రజాస్వామ్య దేశంలో కలాలకు సంకెళ్ళు వేసి నిజాలను దాచాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాలకు పునాదులు ఉండవని మూసి టివి ఎడిటర్ పిట్టల శ్రీశైలం తెలిపారు. మావోయిస్టుల కొరియర్‌గా ముద్రవేసి ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.


వారం రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీశైలం శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 20సంవత్సరాలకుపైగా తాను జర్నలిస్టుగా, తెలంగాణ జర్నలిస్టు ల ఫోరం కన్వీనర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో పలు న్యాయమైన సమస్యలపై పోరాటాలు చేశామన్నారు. గతంలో మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ మరికొంతమంది నాయకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసినట్లు చెప్పారు.

ఇటీవల టిఆర్ఎస్ నేత కేసిఆర్ నిజాంపై మాట్లాడిన పలు అంశాలపై తెలంగాణాకు సంబంధించి కొంతమంది పార్టీ నేతలతో, మావోయిస్టు అగ్రనేతలతో ఇంటర్వ్యూలు నిర్వహించాలనే ఉద్దేశంతో గత కొద్దిరోజులుగా వారిని కలిసే ప్రయత్నాలు చేశామన్నారు. ఇటీవల అటువైపు నుంచి ఇంటర్వ్యూకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో హైదరాబాద్ నుంచి ఈనెల నాలుగవ తేదీన కందుకూరుకు బయలుదేరి వెళ్ళామన్నారు. మావోయిస్టు నేతల దగ్గరకు తీసుకెళ్ళే కొరియర్ కందుకూరు ఆర్టీసి బస్టాండ్‌లో ఉంటాడని , అతని వద్దకు వెళ్ళి రాజు మీరేనా అని అడిగితే ఆ వ్యక్తి చేరాల్సిన గమ్యానికి తీసుకెళతాడని చెప్పి ఉండడంతో తాను నేరుగా కందుకూరు బస్టాండ్‌కు వెళ్ళినట్లు శ్రీశైలం తెలిపారు. బస్‌స్టాండ్‌లో తనే రాజునని తలూపిన వ్యక్తితో కొంత దూరం వెళ్ళాక ఒక్కసారిగా 10మంది మఫ్టీలో ఉన్న పోలీసులు తుపాకులు చూపిస్తూ చుట్టుముట్టి బలవంతంగా టాటా సుమోలో ఎక్కించుకుని వెళ్ళారన్నారు.

కళ్ళకు గంతలు కట్టి సుమారు 10గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పారన్నారు. అదేరోజు రాత్రి హైదరాబాద్‌కు తీసుకెళ్ళి తనకు సాగర్ సాంబశివుడితో సంబంధాలు ఉన్నాయని అభియోగం మోపి నిర్బంధించారన్నారు. మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్నట్లు ఒప్పుకోమని పోలీసులు చిత్రహింసలు పెట్టారని చెప్పారు. తన వద్ద సుమారు వంద తెల్లకాగితాలమీద సంతకాలు పెట్టించుకున్నారని శ్రీశైలం తెలిపారు. తాను జర్నలిస్టునని , మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఇంటర్వ్యూ కోసం వెళుతున్నట్లు చెప్పినా వారు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయన్నారు. ప్రజాసంఘాలు, మేథావులు, రాజకీయ పార్టీలు వీటిని ఖండించాలని కోరారు.

అధికారం, ఆప్యాయతల మధ్య నలిగిన స్త్రీ జీవితమే ‘ఆమ్రపాలి’ కథ

- డా॥ దార్ల వెంకటేశ్వరరావు

ఆమ్రపాలి కథ రసభరితమయినది. దీన్ని సినిమాలుగా కూడా తీశారు. ఇంకా తీస్తున్నారు. ఆ కథలో అంత ఆకర్షించిన అంశాలేమిటి? ఇలా ఆలోచిస్తూ మన తెలుగులో ఎవరైనా ఆమ్రపాలి కథను రాశారా? అనుకుంటూ చూశాను.తెలుగులో చాలామంది బౌద్ధ మతేతివృత్తంతో వివిధ కావ్యాలను రాశారు.


గౌతమబుద్ధుని బోధనలకు ఆకర్షితులైన వాళ్ళలో వేశ్యలు కూడా ఉన్నారు. వేశ్యగా మారడానికి కారణాలెన్ని ఉన్నా, మరలా సాధారణ స్త్రీగా ఆమె తన జీవితాన్ని గడపాలనుకుంటే, ఈ సమాజం ఎంతవరకూ అంగీకరిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న! ఆ ప్రశ్నకు సరైన సమాధానమే బుద్ధుడు ఆమ్రపాలిని బౌద్ధమతంలోకి ఆహ్వానించడం. బౌద్ధ హిందూమతంలో అనాచారులుగా కనిపించే చాలా వాటిని సంస్కరించే ప్రయత్నం కనిపిస్తుంది. సమాజ నిరాదరణకు గురయిన వాళ్ళనెంతోమందిని దరి చేర్చుకొని, తక్కువ కాలంలోనే విస్తృతంగా వ్యాపించ గలిగింది. సామాజిక నిర్బంధాల కారణంగా గణభోగ్యగా మారిన ఆమ్రపాలి కథ ఇంచుమించు అన్ని భారతీయ భాషలలోను ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగులో చాలామంది ఈ కథను రాశారు. ఈ వ్యాసంలో ఇద్దరు రాసిన కావ్యాలను, మరొకరు రాసిన నవలను తీసుకొని, ఆ కథను ఆయా రచయితలు ఎలా తీర్చిదిద్దారో పరిశీలించే ప్రయత్నం చేస్తాను.
‘ఆమ్రపాలి’ బౌద్ధ జాతక కథను యస్.టి.జ్ఞానానంద కవిగారు ఎనిమిది ఆశ్వాసాలుగాను, కరటూరి సత్యనారాయణగారు ఏడు సర్గలుగాను విభజించి ‘ఆమ్రపాలి’ అనే పేర్లతో కావ్యాలుగా రాశారు. జ్ఞానానందకవిగారు శాంతాన్నీ, కరటూరి వారు ‘కరుణ’ను ప్రధాన రసాలుగా పోషించారు.

ఇరువురు కవులూ ఆమ్రవనంలో ‘ఆమ్రపాలి’ అనాధగానే దొరికినట్లు పేర్కొన్నారు. లల్లాదేవి మాత్రం పూర్తి భిన్నంగా కథను సామాజిక అంశాలతో పరిశీలించి రచించారు. ఆమ్రపాలి అసలు పేరు ‘ఉదాయి’గా మార్పు చేసి, ఆమ్రవనంలో నివసించటం వల్ల ‘ఆమ్రపాలి’గా మారినట్లు, ఆ పిల్ల పుట్టిన తరువాత తల్లిదండ్రులు చనిపోయినట్లు లల్లాదేవి మార్పులు చేశారు.
యస్.టి. జ్ఞానానందకవిగారు తన కావ్యంలో పిల్లలు లేని మహానామునికి (శాక్య ధనికునికి) ‘ఆమ్రపాలి’ దొరకగా, కరటూరి వారి కావ్యంలో ఆనందుడనే కొడుకు కలిగిన శాక్యధనికునికి ఆ పసిపిల్ల దొరికినట్లు చిత్రించారు.

ఆడపిల్ల పెళ్ళీడుకొస్తుంటే, పెళ్ళి చేయాలనే తపన తండ్రికి ఎలా పెరుగుతుందో అది జ్ఞానానందకవిగారి కావ్యంలో బాగా కనిపిస్తుంది. కానీ, కరటూరివారు, ‘తండ్రి రాజ్య నిర్వహణా భారంలో పడి కూతురికి వివాహం చేయటం మరచిపోయినట్లు రాశారు. ఇటువంటి ప్రయత్నమేదీ లల్లాదేవి నవలలో కనిపించలేదు. ఆమ్రపాలి తండ్రి లిచ్ఛవుల మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారి వల్ల కూతురికి ఏ ముప్పు వాటిల్లుతుందోననే భయంతో ఉండేవాడనీ, కనుక సరియైన సమయంలో తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలని భావించి స్వయంవర సభను ఏర్పాటు చేసినట్లు జ్ఞానానందకవిగారు వివరించారు.
గణతంత్ర రాజ్యాలలో అందమైన యువతి కనిపిస్తే, ఆ దేశ పాలకులు గణభోగ్యగా చేసుకొనే ఆచారం ఉంది. శాక్యధనికుడు గణతంత్ర రాజ్యానికి చక్రవర్తి అయినా, పాలకులంతా ఏకమయి తీర్మానిస్తే తన కూతురినయినా గణభోగ్యగా చేయవలసిందే! కానీ, ‘స్వయంవరం’ అనేది ఒక సంప్రదాయం మాత్రం ఉంది. స్వయంవరంలో యువతికి నచ్చిన యువరాజుని పెళ్ళి చేసుకొనే స్వేచ్ఛ ఉన్నా, అది గణనాయకుడైన చక్రవర్తి చేతిలో ఉండదు. గణరాజ్యాలలో ఒక గణ పరిషత్తు ఉంటుంది. విధి, విధానాలను అన్నింటినీ ఆ గణపరిషత్తే నిర్ణయిస్తుంది.

అందుకనే స్వయంవర సభలో గణపరిషత్తులో సభ్యులైన లిచ్ఛవ రాజులు అందగత్తె అయిన ఆమ్రపాలి తమకే చెందాలని, ఇతరులకు చెందకూడదనీ పట్టుపడతారు. గణనాయకుడైన శాక్యధనికుణ్ణి, లిచ్ఛవులు తమ అభిప్రాయం ప్రకారం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరిస్తారు. గణనాయకుడైనా తండ్రికి నామమాత్రమైన అధికారాలే ఉన్నాయని ఆ పరిస్థితిని గమనించి సభలోనే ఉన్న ఆమ్రపాలి ‘గణభోగ్య’గా ఉండటానికి అంగీకరిస్తుంది. అందుకుగాను కొన్ని నియమ నిబంధనలను విధిస్తుంది. తనతోపాటు మొదటినుండీ సభల్లోనూ, రాచకార్యాల్లోనూ పాల్గొన్నట్లు జాగ్రత్తపడ్డారు జ్ఞానానంద కవిగారు.

కరటూరివారు లిచ్ఛవుల్లో ‘అభయుడు’ అనే బలవంతుడైన మూర్ఖుడు ఆమ్రపాలి పట్ల వ్యామోహం పెంచుకుని, లిచ్ఛవులను రెచ్చగొట్టి, ఆమ్రపాలికి పెళ్ళి చేయకపోవటం వల్లనే రాకుమారులు రాజ్యంలో అశాంతిని సృష్టిస్తూ, ఒకరినొకరు చంపుకుంటున్నారని రాజైన శాక్యధనికునికి నివేదించినట్లు వర్ణించారు.

సభలో మహానాముడిని ‘గణభోగ్య’గా ఆమ్రపాలిని చేయమని పట్టుపట్టడం తనకో ధర్మం, పరులకో ధర్మం పని చేయదని లిచ్ఛవులు రాజుని వ్యతిరేకించటం వల్ల మహానాముడే ఆమ్రపాలిని, ఆమె అంగీకారాన్ని కూడా తెలుసుకోకుండా ‘గణభోగ్య’గా ప్రకటించాడు. ఆ విషయాన్ని, కూతురైన ఆమ్రపాలికి చెప్పటానికి బాధాతప్త హృదయుడై ఆమె భవనానికి వెళతాడు. వెళ్ళి కూడా అక్కడే మాట్లాడకుండా కూర్చుండిపోతాడు. తండ్రిని చూసి, ఆమ్రపాలి బింబిసారుని వల్ల మోసగింపబడిన విషయం ఎక్కడ తెలిసిపోయిందోనని, అందుకే ఎంతో ప్రేమగా పిలిచి ఆదరించే తండ్రి తాను చేసిన పనికి బాధపడుతున్నాడనుకొంటుంది. ఈ సన్నివేశం చక్కని నాటకీయతతో సాగింది. జరిగిన విషయాన్ని అంతటినీ తండ్రికి చెప్పేసి, శత్రురాజైన బింబిసారుడని తెలియదనీ, దేశద్రోహం చేయననీ, క్షమించమనీ ప్రాధేయపడుతుంది.

తండ్రి ఆమ్రపాలిని సముదాయించి, అనివార్యమైన పరిస్థితుల్లో గణభోగ్యగా చేయవలసి వచ్చిందని, సభా విషయాలను ఆమెకు తెలుపుతాడు. ఆ సందర్భంలోనే ఆమ్రపాలి తనకు ఆమ్రవనంలో దొరికిందనీ, స్వంత కుమారుడైన ఆనందుడినీ నిన్నూ ఒకేలా పెంచాననీ చెపుతాడు.
తెలిసిన విషయాలు ఇరువురికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆమ్రపాలి దేశభక్తి (దేశంలో అల్లకల్లోలాలను ఆపడం కూడా దేశభక్తిగానే భావిస్తుంది.) దేశం కోసం దేనికైనా సిద్ధమవుతాననీ, బింబిసారుని చేతిలో మోసపోయినందుకు క్షమించమని చెపుతుంది.

ఇది జరిగిన తర్వాత కూతురు గురించి బెంగ పెట్టుకొని తండ్రి కొన్నాళ్ళకు చనిపోతాడు. ఆనందుడు బౌద్ధ సన్యాసిగా మారిపోతాడు. ఆమ్రపాలికి పుట్టిన కొడుకు ‘విమలకొండ’ను వేశ్య బిడ్డగా సమాజం గౌరవించదని ఆనందుడు చెప్పటం వల్ల బౌద్ధ సంఘంలో చేరటానికి తల్లి అంగీకరిస్తుంది. కానీ కొడుకు పట్ల పుత్ర వాత్సల్యం వీడలేకపోతుంది. ఏదో ఒక నెపంతో పుత్రుణ్ణి చూడాలనే బుద్ధుని దగ్గరకు వెళ్ళి, బుద్ధుణ్ణి, ‘కొడుకుని తల్లి నుండి విడదీయడం ధర్మమేనా?’ అని నిలదీస్తుంది. బుద్ధుడు జీవిత సత్యాన్ని, దుఃఖ నివారణను చెప్పటం వల్ల ఆమె బౌద్ధ సంఘంలో చేరగలుగుతుంది.

లల్లాదేవి రాసిన ‘ఆమ్రపాలి’ నవలలో కథను పరిశీలిస్తే ‘ఉదాయి’కి తల్లిదండ్రులు చనిపోవడంతో, వైశాలినీ రాజ్యంలో ఉన్న బంధువుల ఇంటికి మేనమామ ఆ పిల్లను తీసుకొని వెళుతుంటాడు. మార్గమధ్యంలో దొంగలబారిన పడటంతో మేనమామ చనిపోతాడు. భైరవుడనే మంచి దొంగ ఆ పసిపిల్లను చేరదీసి వైశాలినీ నగరానికి చేర్చి యశోదేవి దగ్గర విద్యాభ్యాసం కొనసాగేలా దోహదపడతాడు. గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అభ్యసిస్తూ రాజుగారి అనుగ్రహం పొంది, వారి ఆదరణకు పాత్రమవుతుంది. ఆమె చేసిన నాట్యానికి మెచ్చి, నర్తకి పదవినిచ్చి ఒక ఆమ్రవనాన్ని కేటాయించి, దానిలో చక్కని భవనాన్ని నిర్మించాలని రాజు చేతనుడు ఆదేశిస్తాడు. ఆమె ఆమ్రవనంలో ఉండటం వల్ల ‘ఆమ్రపాలిక’గా, తర్వాత ‘ఆమ్రపాలి’గా పిలువబడుతుంది.

భవన నిర్మాణానికి వినియోగించిన శిల్పులలో లౌకిక విషయాలను పట్టించుకోని ‘ఉదయుడు’ అనే శిల్పి ఏకాగ్రతతతో శిల్పాలను చెక్కుతుంటాడు. అతని శిల్ప నైపుణ్యాన్ని ఆమ్రపాలి అభిమానిస్తుంది. అతని దగ్గరే ఎక్కువసేపు గడుపుతుండేది. ఆమె కూర్చున్న భంగిమను ఒకసారి ‘ఉదయుడు’ చూసి చక్కని శిల్పాన్ని చెక్కుతాడు. ఆ శిల్పంతోపాటు, బుద్ధుని ప్రశాంతమైన విగ్రహాన్ని కూడా ఆమెకు బహూకరిస్తాడు. ఉదయునుడి పట్ల ఆసక్తిని పెంచుకోవడం గమనించిన రాజు ఆ శిల్పిని మరొక చోటికి పంపాలనుకొంటాడు. ఉదయునుడు ఒక స్వేచ్ఛాజీవి. ఎవరి నియమ నిబంధనలకు తలొగ్గనివాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మరోచోటికి శిల్పాలను చెక్కటానికి వెళ్ళమంటే ఇష్టపడక ఆ రాజ్యమే వదిలిపోతాడు.

బుద్ధుని ప్రశాంతమైన శిల్పాన్ని చూస్తూ బుద్ధుని గురించి, అతని ఆశయాలు, ధర్మాలను గురువుగారి సహాయంతో తెలుసుకొని, బుద్ధుణ్ణి దర్శించాలని తహతహలాడుతుంటుంది ఆమ్రపాలి. అదే సమయంలో ఒక బౌద్ధ భిక్షువు ఆ రాజ్యం వచ్చాడని తెలిసి తన భిక్షను స్వీకరించమని ప్రార్థిస్తుంది. ఆ బౌద్ధ భిక్షువు మొదట అంగీకరించి ఆమె ఇంటికి వెళ్ళి భిక్షను స్వీకరించాలనుకొంటాడు. అంతలో ఒక ధనస్వామి అనే ధనవంతుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ బౌద్ధ భిక్షువుతో, ‘ఆమె ఒక వేశ్య’ అనీ, ఆ భిక్షను స్వీకరించవద్దనీ, మా ధనవంతుల దగ్గర స్వీకరించమనీ చెపుతాడు. ఆ బౌద్ధ సన్యాసి వెంటనే ఆమె పెట్టే భిక్షను తిరస్కరిస్తాడు. దానితో ఆమె ఎంతో బాధపడుతుంది. వేశ్య అంటే ఏమిటో, ఆ జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ, తనకి తెలియకుండానే ఒక వేశ్యావాడలోని ఒక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ‘ఆమ్రపాలి’ని కొంతమంది పట్టుకొని వేశ్యగా ముద్రవేసి, రాజు చేత ఆమెను నర్తకి పదవి నుండి తప్పించి, రాజ్య బహిష్కార శిక్ష వేస్తారు. బుద్ధుడు ఆ నగరం వచ్చేవరకూ ఏ తిండీ బట్టా పట్టించుకోకుండా నిరీక్షించి, బుద్ధుని కరుణ వల్ల బౌద్ధ సన్యాసినిగా మారటంతో కథ ముగుస్తుంది.

ముగ్గురు రచయితలూ మూడు విధాలుగా ‘ఆమ్రపాలి’ కథను తీర్చిదిద్దారు.
జ్ఞానానందకవిగారు తండ్రి పాత్రను పోషించటంలో ఔన్నత్యాన్ని, నైతిక విలువలను పాటిస్తూ సమయోచితంగా, సందర్భోచితంగా వర్ణించినట్లు అవగతమవుతుంది. దీనికి ముందు నుండే కథను చక్కని ప్రణాళిక వేసుకొన్నారనిపిస్తుంది. రాచకార్యాల్లో పాల్గొనడం, ఆమ్రపాలికి ఏర్పాటుచేసిన ‘స్వయంవర సభ’లోనే గణభోగ్య నిర్ణయం జరిగినట్లూ రాశారు.
కరటూరి వారి కావ్యంలో అప్పటికే తప్పు చేసి ఉండటం వల్ల, తండ్రి అప్పటికే ఆమెను గణభోగ్యగా అంగీకరించటం వల్ల ‘గణభోగ్య’గా ఆమె అంగీకరిస్తూ, పైకి దేశభక్తి పూత పూసినట్లు అనుకోవడానికి అవకాశం కలుగుతుంది. కానీ, కావ్యాన్ని చదువుతున్న పాఠకునికి ఆ నాటకీయత అబ్బురపరుస్తుంది.

జ్ఞానానందకవీ, కరటూరి వారూ ఇద్దరూ కూడా ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత తండ్రి పాత్రను బాగా చిత్రించారు. జ్ఞానానందకవిగారు, ఆమ్రపాలి తండ్రి పాత్రను కావ్యంలో మరలా ప్రవేశపెట్టకుండానూ, కరటూరివారు, ఆమ్రపాలి తండ్రి బెంగ పెట్టుకొని మరణించినట్లు బాగా రాశారు. జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత కథను ఆమె నుండే చూశారు. పెంచిన తల్లిదండ్రుల కోణం నుంచి చూడలేదు. ఇది చక్కని కథన శిల్పం.
లల్లాదేవిగారి నవలలో ‘ఆమ్రపాలి’ వేశ్యగా ముద్ర వేయబడుతుంది. ఆమెకు తెలియకుండానే వేశ్యావాడకు పోతుంది. అక్కడకొంతమంది యువకులు ఆమెను నిర్బంధించి వేశ్యగా మార్చినట్లు రాశారు. అక్కడ వేశ్య జీవితచిత్రణను వర్ణించటంలో లల్లాదేవి పరిశీలన చక్కగా వ్యక్తమవుతుంది. దొంగల గుంపుకి దొరికిన ఉదాయి అడవిలో పాడుపడిన దేవాలయం మీద ఉన్న నాట్యభంగిమలను చూసి, ఆమె నాట్యాన్ని అభ్యసించాలనుకొన్నది. సాధన వలన నాట్యాన్ని సాధించింది. ఆ నాట్యమే ఆమ్రవనాన్ని, నర్తకి పదవిని వచ్చేలా చేసింది. అదే ఆమెను ‘వేశ్య’గా అనుమానించేలా చేసింది. ఆ అనుమానంలో నుండి వచ్చిన అవమానమే ఆమెను బౌద్ధభిక్షువుగా మార్చి, సన్మార్గంవైపు పోయేటట్లు చేసింది.

యస్.టి. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ బింబిసారుణ్ణి ప్రేమించింది. బింబిసారుడూ ఆమెను కోరుకున్నాడు. తర్వాత ఇరువురిలో ఎవరిని ఎవరూ ద్వేషించుకోలేదు. బింబిసారుడు మాత్రం ఆరురోజులు ఆమె భవనంలో ఉండి, దొంగచాటుగా వచ్చిన అతని రాకను లిచ్ఛవులు పసిట్టడం, అతడిని జాగ్రత్తగా దాచటం, ఆమెను విడిచి వెళ్ళిపోయేటపుడు ఒక ఉంగరాన్ని ఇవ్వటం, ఒకవేళ కొడుకు పుడితే, ఉంగరమిచ్చి పంపమని చెప్పి వెళ్ళిపోతాడు. తన కోసం చిత్రించిన చిత్రపటంలో బింబిసారుణ్ణి ఆకర్షించి, ఆలోచిస్తుండగా చెలికత్తె ఆమె హృదయాన్ని పసిగట్టడం, రాయబారం నడపడం వంటివన్నీ చేస్తుంది. బింబిసారుని పాత్రను కావాలనే కావ్యనాయకునిగా, కవి తీర్చిదిద్దలేదేమో ననిపిస్తుంది. ఆమెను బింబిసారుడు అనుభవించటానికే ప్రయత్నించినట్లు తేలుతుంది. అయితే ఉంగరాన్ని ఇచ్చి, కొడుకు పుడితే, ఉంగరం చూపితే తన పుత్రునిగా స్వీకరిస్తానని చెప్పటం అతని స్వభావాన్ని తేటపరిచే విషయాలుగా గమనించే వీలుంది.

‘గణభోగ్య’గా జీవితాన్ని గడుపుతున్న ఆమ్రపాలి తనలో తాను తీవ్ర సంఘర్షణకు లోనై ఒకసారి తాను దొరికిన ఆమ్రవనానికి ప్రశాంతత కోసం రావటంతో, అక్కడ తొలిసారిగా బుద్ధుని దర్శనమవుతుంది. ఆనాటి నుండే ఆమెలో బుద్ధుని ప్రవచనాలు లౌకిక విషయాల పట్ల కోరికను తగ్గించి, అలౌకిక విషయాల పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. బుద్ధుని రాక కోసం నిరీక్షిస్తూ, తీరా బుద్ధునికి భిక్షను పెట్టాలని ప్రయత్నించినపుడు ఆ నగరంలోని ధనవంతులు వ్యతిరేకిస్తారు. బుద్ధుని దర్శనాన్నీ బుద్ధుని శిష్యుడు కూడా అడ్డుకుంటాడు. కానీ బుద్ధుని జోక్యం వల్ల ఆమెకు అతని దర్శనం కలగటం, ఆమె పూర్వజన్మలో నెమలి అనీ, ఇంద్రుని శాపం వల్ల ‘ఆమ్రపాలి’గా జన్మించిందని, ఆమె జన్మ వృత్తాంతాన్ని బుద్ధుడు వివరించటంతో ప్రజల్లో ఎక్కడలేని ఆదరణ కలుగుతుంది. బుద్ధునికి భిక్షను పెట్టి, తన సర్వవిద్యలనూ బౌద్ధ సంఘ వ్యాప్తికే వినియోగిస్తూ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొంటుంది.

జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని చారిత్రక తత్త్వకావ్య లక్షణాలతో చక్కగా అన్వయించే ప్రయత్నం చేశారు. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో బుద్ధుని బోధనలు అడుగడుగునా కన్పిస్తుంటాయి. మరో విశేషమేమంటే, ఈ కావ్యంలో అన్ని పాత్రలూ ఆమ్రపాలి వైపు నడవగా, ఆమ్రపాలి బుద్ధుని ధర్మాలవైపు, బుద్ధుని వైపు పయనిస్తుంది. బౌద్ధమతంలోని ఆర్యసత్యాలనూ, త్రిరత్నాలనూ, అష్టాంగమార్గాన్ని కావ్యానికి అన్వయించి బౌద్ధ ధర్మేతిహాసంగా మలచగలిగారు.

జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి.
ఆమ్రపాలి గణభోగ్యగా జీవితాన్ని గడుపుతూ మానసిక ప్రశాంతత కోల్పోయి, సంఘర్షణ పడుతూ, తీవ్రవ్యధకు లోనై గుండెల్లో దుఃఖాన్ని పోగొట్టు కోవాలని తాను దొరికిన ఆమ్రవనంలోకి వస్తుంది. కరుణ హృదయుడైన బుద్ధుడు అక్కడ తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. అతడిని ఆమె ఎవరో ముని అనుకొని ఆమెలో తీరని కోరికను నర్మగర్భితంగా వ్యక్తీకరించి అతనిని తన ఇంటికి రమ్మనమనీ, సర్వసౌఖ్యాలనూ సమకూరుస్తానంటుంది.
బుద్ధుడు ఆమె మనోవాంఛను గమనిస్తాడు.

చాలా మృదువుగా, ప్రశాంతంగా, జీవిత సత్యాలను వివరిస్తాడు. అంతేకాక ఆమె బౌద్ధ భిక్షువుగా మారిన తరువాత ఆమెతోపాటు బౌద్ధారామానికి వచ్చిన మిగిలిన ప్రజలకు నాలుగు ఆర్యసత్యాలను వివరిస్తాడు.
బౌద్ధధర్మ మూలసూత్రాలలో సర్వమూ క్షణికమనేది ఒక మూల సూత్రం.
ఇది ప్రపంచం దుఃఖమయమనే దాన్ని స్పష్టం చేస్తుంది. పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. అయినా ఆశలు పెంచుకుంటారు. ప్రపంచంలో దుఃఖం లేకపోవటంగాని, పుట్టిన జీవి మరణించకపోవటమనేది కనిపిస్తే ఎంతో సంతోషం కదా! అని బుద్ధుడు చెబుతాడు.

మానవుని శరీరం వయః పరిణామాన్ని అనుసరించి క్షణక్షణం మారుతూ మట్టిలో కలిసిపోతుందనే విషయాన్ని కవి ‘నాల్గు దశల మధ్య నవయుచు నున్నటి’ అని వర్ణించారు. దృశ్యమాన ప్రపంచంలోని సర్వమూ అనిత్యమేనని దానివల్ల తెలుస్తుంది.
దుఃఖానికి కారణం కోరికలు అనేది బుద్ధుడు బోధించిన నాలుగు ఆర్య సత్యాల్లో రెండవది.
ఇంద్రియాలకు ప్రియమైన విషయ సంపర్కం, వాటి స్మృతి, కోరిక (తృష్ణ)లకు కారణమవుతుంది. ఆ కోరికలు పూర్తి కాగా త్యజించగలిగినపుడు దుఃఖం నివారింపబడుతుంది. ఇది మూడవ ఆర్యసత్యం.
ఆమ్రపాలి ఎన్నో కోర్కెలతో రగిలిపోతూనే బుద్ధుని ప్రథమ దర్శనం చేసుకొన్నది. బుద్ధుడు జీవితం క్షణికమైనదనే జీవిత సత్యాన్ని బోధించడం, తన తపస్సు పూర్తయిన తరువాత భిక్షను స్వీకరించటానికి వస్తానని చెప్పి పంపితే బుద్ధుని పునరాగమనం వరకూ భిక్షను సమర్పించటానికి ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికి ఆమెలో కోరికలు నశించిపోయాయి. తాత్కాలికమైన లౌకిక భోగాల నుండి శాశ్వతమైన విముక్తి మార్గానికి సిద్ధమై ఉంది. దీనికంతటికీ కారణం ఆమెలో వివాహం చేసుకోవాలనీ, సర్వసౌఖ్యాలను అనుభవించాలనీ ఉన్న కోర్కెలన్నీ నశించటమే. కొడుకుని, తండ్రిని, సర్వస్వాన్నీ వదిలి బుద్ధుని శిష్యగణంలో చేరిపోతుంది. ఆమె దుఃఖం నుండి విముక్తి పొందుతుంది. ఈ విధంగా చారిత్రక తత్త్వ కావ్యంగా జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని తీర్చిదిద్దారు.

బుద్ధుని బోధనలు సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపాయనేది తెలియజేసే కథలు ఎన్నో వస్తున్న నేపథ్యంలోనే ‘ఆమ్రపాలి’ కావ్యాలు, నాటకాలు, నవలలు కూడా వెలువడ్డాయి. మానవ విలువలను, మానవ సంబంధాలను పటిష్టపరచడంలో బౌద్ధేతివృత్త కావ్యాలు చాలావరకూ తోడ్పడ్డాయి. అలా నిరూపించే బౌద్ధజాతక కథలలో ఆమ్రపాలి కథ ఉత్తమమోత్తమ కథ. ఇంకా చాలామంది తెలుగు రచయితలు కూడా ఆమ్రపాలి కథను తీసుకొని వివిధ ప్రక్రియలలో రచనలు చేసినవారు ఉండవచ్చు.

మేడే చరిత్ర

- దేవరకొండ విన్సెంట్

అమెరికా లో కార్మిక సంఘాలు ( United States Federation of organized trade and labor unions) ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం మే 1, 1886 లో సమ్మె మొదలు పెట్టేరు. మే 3 తారీఖున మెఖార్మిక్ రీపర్ వర్క్స్ (Mccormik Reaper Works ) ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు నిరాయుధులుగా ఉన్న కార్మికులపై నిర్ధాక్షిణ్యం జరిగిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అమరులయ్యారు.




దీనికి స్పందిస్తూ 1886 మే నాలుగవ తారీఖున చికాగో కార్మికులు పోలీసు కాల్పుల్లో మరణించిన కామ్రెడ్ల కు జోహార్లర్పించడానికి హేమార్కెట్ చౌకులో ప్రదర్శన చేసేరు. ఒక కోవర్టు విసిరిన బాంబు ఫలితంగా ఏడుగురు పోలీసులు చనిపోయారు. తదుపరి జరిగిన పోలీసు కాల్పుల్లో చాలా మంది కార్మికులు అమరులయ్యారు.(లెక్క ఈనాటికీ తెలియదు). రెండవ ఇంటర్నేషనల్, 1889 కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు,1890 మే 1 న, చికాగో కార్మికుల త్యాగాల స్మృతిలో, ఎనిమిది గంటల పనిదినం కోసం, వైద్య సదుపాయాల కోసం, ఇతర హక్కుల కోసం, అమెరికా, ఐరోపా ల లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. ప్రతి ఏడూ మేడే జరపాలని అనేక కార్మిక సంఘాలు నిశ్చయించాయి. కార్మిక వర్గం చిందించిన నెత్తుటికి చిహ్నంగా ఎర్ర జెండాను స్వీకరించింది 1889 కాంగ్రెస్ లోనే.(రెండవ ఇంటర్నేషనల్).తరువాత కాలంలో కార్మికోద్యమాలు అన్ని దేశాల్లో బలపడటం, విప్లవ విజయం ద్వారా 1917 లో రష్యాలో, 1949 లో చైనాలో రాజ్యాధికారాన్ని హస్త గతం చేసుకోవటం జరిగింది. ఇది కార్మికోద్యపు పురోగమన దశ. కోట్లాది కార్మికులు మేడే అంటే ఉత్సాహంతో కర్తవ్యాల్ని గుర్తు చేసుకుంటూ ఊరేగింపు చేసే రోజు.
1953 మొదలుకొని రష్యాలో, 1975 మొదలుకొని చైనాలో కార్మిక వర్గం అధికారాన్ని కోల్పోయి, రాజకీయంగా చాలా దేశాల్లో తిరోగమన దశలో ఉండటం ఈ రోజున భౌతిక వాస్తవం. గతంలో ఎన్నో త్యాగాల ద్వారా, కష్టాలకోర్చి సంపాదించిన హక్కులు హరించివేయబడటం ఈ రోజున చూస్తున్నాం.

వర్తమానం

సమసమాజ స్థాపన దిశలో పురోగమనాలతో పాటు తిరోగమనాలూ సంభవం అన్న సత్యాన్నికార్మిక వర్గం, వారి నాయకత్వం అవగాహన చేసుకోవటం ముఖ్యం. భవిష్యత్తులో స్థాపింపబడే సమసమాజ వ్యవస్థను ఈ తిరోగమనానికి గురికాకుండా ఎలా కాపాడుకోవాలి అన్న ప్రశ్నకు మసం సమాధానం ఇవ్వగలగాలి. పెటీ బూర్జువా వర్గం, మేధావులు, విద్యార్ధులూ, పెద్ద సంఖ్యలో ఉద్యమం లోకి రావటానికి ఇది కీలకం.
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం తీవ్రతరం ఔతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉపరితల రాజకీయంలో ఉన్న తిరోగమనాన్ని అధిగమించి భారత దేశంలో విప్లవోద్యమం పురోగమిస్తోంది. విప్లవోద్యమం అశేష ప్రజానీకం అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొంది. అందుకే అమెరికా సామ్రాజ్య వాదుల దృష్టిలో హైదరాబాదు పడింది. వారి ప్రయోగాల్లో భాగంగా మిలియన్ల డాలర్లు విరజిమ్ముతుందీ అందుకే. నేపాల్లో కార్మిక వర్గం కొన్ని విజయాలు సాధించినప్పటికీ నాయకత్వ లొంగుబాటు వల్ల విఫలమైంది.
మేధావులు, విద్యార్ధులు, గరితార్కిక భౌతిక వాదాన్ని ఆధ్యయనం చేసి కార్మిక వర్గ నాయకత్వం క్రింద పనిచేస్తూ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం కీలకం. మేడే 2007 న ఇదే మన కర్తవ్యం.

స్త్రీ జీవిత చిత్రణలో భావజాల ప్రభావం

స్త్రీ జీవిత చిత్రణలో భావజాల ప్రభావం
- డా. దార్ల వెంకటేశ్వరరావు

మన ప్రాచీన తెలుగు సాహిత్యం స్త్రీని ఒక భోగ వస్తువుగా చిత్రించటంలో భావజాలం ప్రాత్ర చాలా ఉంది. రామాయణం , మహా భారతం, భాగవతం, ప్రబంధాలు , శతకాలు మొదలైన వాటిన్నింటిలోనూ ఈ భావజాల ప్రభావం ఉంది . సర్వ సాధారణంగా భావజాలం దేశ , కాలానుగుణంగా రూపొందుతుంది. మన భారత దేశంలో వేదాలు, స్మృతులు, పురాణాల రూపంలో హిందూభావజాలం ఉంది .


ఇది తరువాత కాలంలో ” హిందూ ధర్మ సూత్రాలు” గా ప్రచారం పొందింది. ఈ భావజాలం ప్రధానంగా వర్ణ, లింగభేధాలతో రూపొందింది . కొన్ని వర్ణాలవారిని కర్మపేరుతో ఇంచుమించు బానిసలుగానే మార్చుకున్నారు . రామాయణకాలంలో కర్మ సిధ్ధాంతాన్ని వ్యతిరేకించినందుకు శంబూకుడు మొదలైన వార్ని మరణశిక్షవిధించటానికీ వెనుకాడకపోవటానికీ ఈ భావజాల ప్రభావమే ప్రధాన కారణం. ఈ భావజాల ప్రభావమే ‘ ఆదర్శం’ పేరుతో సీతాదేవిని అగ్నిప్రవేశం చేసేలా పురిగొల్పింది. అన్ని చేసినా శ్రీరాముడ్నే సీతాదేవి ‘ తన దైవం’గా భావించటంలోనూ భావజాల ప్రభావం ఉంది. పరిశోధన దృష్టితో చూస్తే హిందూ భావజాలాన్ని ఆధారంగా చేసుకొని స్త్ర్రీని పురుషుడు తనబానిసగా ఎలా మార్చుకున్నాడో స్పష్టమవుతుంది.

హిందూభావజాలంలో జెండర్ సమస్య సామాన్యమైనదికాదు. స్త్రీని శూద్రురాలుగా పరిగణించారు. ఒకప్పుడు మహోన్నతమైన సింధూనాగరికతా కాలం నాటికి మాతృస్వామ్య వ్యవస్థ ఉండగా, ఆర్యులు భారత దేశంలో ప్రవేశించిన తరువాత, నెమ్మదినెమ్మదిగా పితృస్వామిక వ్యవస్థ కు పయనించేటట్లు చేయగలిగారని పరిశోధనలు తెలుపుతున్నాయి . కారల్ మార్క్స్, ఏంగిల్స్ , డి.డి.కోశాంబి, రోమిల్లాథాపర్ , ఆర్ . ఎస్. శర్మ తదితరుల పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఆనాటి సమాజంలో అధిక సంఖ్యలో స్త్ర్రీదేవతలు పూజింపబడినా , క్రమేపీ పురుష దేవుళ్ళు పూజలందుకోవటం ప్రారంభించిన తరువాత స్త్ర్రీ దేవతల స్థానం అధమస్థాయికి పోవటం లోనూ ఈ భావజాలం పాత్ర ఎంతో ఉంది.

మన తెలుగులో నీతిశతకాలు పేరుతో కొన్నిశతకాలను పిలుస్తున్నారు . అంతే కాకుండా” నీతి శతకములు సర్వజన హితకరములైనవి… విషయ బాహుళ్యమును బట్టి నీతి శతకములు సర్వజనపఠనీయములగుచున్నవి” ( డా. జి. నాగయ్య ‘ తెలుగు సాహిత్య సమీక్ష , రెండవ సంపుటి. 1996: 568) అనే అభిప్రాయంలో ఈ శతకాలు ప్రచారం లో ఉన్నాయి. శతకాల్లో నీతి లేక పోలేదు. కానీ , ఆ నీతి అందరికీ సంబంధించిందికాదు. అది ప్రధానంగా పురుష దృక్పథం నుండి రూపొందింది.

నీతి శతకాల్లో ఒక విశేషమేమిటంటే , వాటిలో కొన్ని సార్వ జన ,సార్వకాలిక నీతులుంటాయి . వాటిని చూపుతూ తమభావజాలాన్ని చాలా జాగ్రత్తగా అందరిలో ఇంజెక్ట్ చేస్తుంటాయి . 16, 17 శతాబ్దాల్లోనే అనేక అభ్యుదయభావాలను వివిధ పద్యాలుగా వెదజల్లిన వేమన పద్యాల్లోనూ స్త్రీ పట్ల చాలా నిరసన భావాలు కనిపిస్తాయి. అయితే , అందులో వేమన చెప్పిన అసలు పద్యాలెన్ని అనేది నేటికీ పరిశోధనాంశాల్లో నలుగుతునే ఉంది. ఆ పరిశోధన ఫలితాలు తెలిసే వరకూ మాత్రం స్త్రీ పట్ల వ్యక్తమైన వేమన భావాలు స్త్రీని అవమానించే విధంగానే ఉన్నాయని భావించక తప్పదు. “నీతి శతకాల్లో ఎడనెడ కొంత నీతి కనిపిస్తున్నప్పటికీ స్త్రీల విషయంలో చాలా తప్పుడు భావాలను కలిగి ఉన్నాయి… సుమతీ, వేమన శతకాల్లో చాలా వరకు సంస్కృత శతకాల ప్రభావం ఉంది” అని కత్తి పద్మారావు గారు (భారతీయ సంస్కృతిలో స్త్రీ 1993: 172) అనటంలోనూ భావజాల ప్రభావం శతక కర్తల పై ఉందని తెలుస్తుంది.

సాధారణంగా ప్రతి సాహిత్యం ,సాహిత్య ప్రక్రియా ఆ సమాజ పరిస్థితులకు అణుగుణంగానే రూపొందుతుంది. అలాగే మన తెలుగు సాహిత్యం కూడా సృజనీకరించబడింది. కనక, ఆనాటి సమాజ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ సాహిత్యాన్ని విమర్శించాలనే ఒక నియమం విమర్శకుల్లో ఉంది. ఆ పద్ధతిలో సాహిత్యాన్ని అంచనా వేయటమే సద్విమర్శ అవుతుంది . ప్రాచీన సాహిత్యమంతా పాతచింతకాయ పచ్చడని కోట్టేయడానికీ వీల్లేదు. కానీ , ‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’ అంటే మాత్రం ఒప్పుకోలేరు ! ఎప్పుడూ ఒక కాలం లో వచ్చిన సాహిత్యం నుండి

అందరూ గ్రహించవలసినవి కొన్ని మాత్రమే ఉంటాయి. ఎప్పుడూ సర్వజన హితం, సర్వకాలయోగ్యంగా ఉంటాయని భ్రమించటం మాత్రం అవగాహన రాహిత్యమే అవుతుంది. ఆ అవగాహననే అందరిపై రుద్దాలనుకున్నప్పుడు సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో నీతి పద్యాలు పెట్టాలనుకుంటున్నారు. మంచిదే. కానీ, ఎలాంటి పద్యాలు పెడతారో గమనించవలసి ఉంది. లేక పోతే చిన్న నాటి నుండే బాలబాలికల్లో విష భీజాలను నాటడానికి ప్రయత్నించడమే అవుతుంది. అది పెరిగి పెద్ద జెండర్ సమస్యగా మారుతుంది.

బతకమ్మా! బ్రతుకు

గుమ్మడిపూలు పూయగ బ్రతుకు
తంగెడి పసిడి చిందగ బ్రతుకు
గునుగు తురాయి కులుకగ బ్రతుకు
కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు || బతకమ్మా! బ్రతుకు … ||
అమ్మను మరవని సంతానము కని || బతకమ్మా! బ్రతుకు … ||

పచ్చని పసరిక బయళ్ళ బ్రతుకు
పల్లెపట్టుల పంటల బ్రతుకు
పసుపుతోట మరియాదగ బ్రతుకు
పున్నమ వెన్నెల మాదిరి బ్రతుకు || బతకమ్మా! బ్రతుకు … ||

మూడుముళ్ళ బిగియింతల పద్దుల
జంట బ్రతుకు తాహత్తుల హద్దుల
మమతల, మమతల పెంచెడి సుద్దుల
తీరుతీరు చవులూరెడి చద్దుల || బతకమ్మా! బ్రతుకు … ||

పసుపు కుంకుమల వసతుల తేలుచు
పారాణిలో మారాణిగ పారుచు
ఆలమంద గొంతుల ‘అంబా’డుచు
దాంపత్యపు దివ్వెల వెలయించుచు || బతకమ్మా! బ్రతుకు … ||

తండ్రుల తాతల జేయుచు మురియుచు
కొడుకుల తండ్రుల జేయుచు వెలయుచు
అమ్మల అవ్వల జేయుచు కాయుచు
బిడ్డల తల్లుల జేయుచు సాకుచు || బతకమ్మా! బ్రతుకు … ||

నొసటి కుంకుమల తళుకుల నీనుచు
మంగళసూత్రము వలపుల పేనుచు
గాజుల గలగల నవ్వుల తేలుచు
కాలిమట్టియల పలుకుల కులకుచు || బతకమ్మా! బ్రతుకు … ||
మక్కలరాసుల పసిడిగ బ్రతుకు
గేగుల కండల జవగా బ్రతుకు
‘సీతాఫల’ కనుగ్రుడ్డుగ బ్రతుకు
పాలుపట్టి గింజూరగ బ్రతుకు || బతకమ్మా! బ్రతుకు … ||

నల్లపూసల నడుమనె బ్రతుకు
పాలతిన్నియల దాపునె బ్రతుకు
నొసటి మధ్య మందారమ! బ్రతుకు
కాళ్ళపసుపు పారాణీ! బ్రతుకు || బతకమ్మా! బ్రతుకు … ||

పాటపాడి పాటల పాడిస్తూ
ఆటలాడి ఆటల ఆడిస్తూ
జంటగూడి జంటల కూరుస్తూ
బతుకు బ్రతికి బతుకుల బ్రతికిస్తూ || బతకమ్మా! బ్రతుకు … ||

చెలిమి చెలమలు ఊరేదాకా
చెలిమి కలుములు నిలిచేదాకా
చెలిమి వెన్నెలలు కాసేదాకా
చెలిమి రాగములు ఒలికేదాకా || బతకమ్మా! బ్రతుకు … ||

మన్నూమిన్నూ ఉండే దాకా
సూర్యుడు చంద్రుడు వెలిసే దాకా
చుక్కలు మింటిలో కులికే దాకా
కాలచక్రము తిరిగేదాకా || బతకమ్మా! బ్రతుకు … ||

అమ్మను మరవని సంతానము కని || బతకమ్మా! బ్రతుకు … ||



కాళోజి నా గొడవ కవితలు, 2001 సెప్టెంబర్‌లో నుండి
కాళోజీ ఫౌండేషన్, వరంగల్, హైదరాబాద్

ప్రభుత్వం, అధికార భాష

- వావిలాల గోపాలకృష్ణయ్య

“తేటల్‌ దేరెడు కాంతిపూరముల నుద్దీపించు ముత్యాల ము
ప్పేటల్‌ వోలె త్వదీయ కంఠమున శోభింపుల్‌ నిగారించు, చే
నాటన్‌ జీవన శోషణన్‌ గనని కృష్ణా గౌతమీ పెన్నలన్‌
గాటంపుం దమి త్రావువార మిదె కాంక్షాక్షీర మాంధ్రావనీ”

పరపాలననుండి బయటపడి ఇన్ని సంవత్సరములు గడచినందుకు ఉత్సవాలు జరుపు కుంటున్నాము. భారతీయ రాజకీయరంగంలో స్వాతంత్య్ర ప్రజ్వలన లార్డు క్లైవు ఏనాడు బెంగాలు ప్రజలను చీల్చి భాషా ప్రాతిపదిక కాకుండా హిందూ ముస్లిం మత ప్రాతిపదికగా రాష్ట్రాలు నిర్మించాడో, ఆ నాడే ప్రజానీకం జాగరితమై, పరపాలన అంతమొందించవలెనను ఆవేశం కలిగింది.

బెంగాలు అవిభాజ్యమని, బెంగాలు ప్రజానీకం సింహగర్జన చేసింది. పరభాషకు వ్యతిరేకంగా బెంగాలులో బెంగాలు భాష, మహారాష్ర్టలో స్వదేశీ, ఆంధ్రలో జాతీయోద్యమ బీజాలు నవజీవనోద్యమం సాగించింది. అంతా కలిసి వందేమాతరం ఉద్యమం అయింది. 1906లో విభజింపబడిన బెంగాలు 1912లో సమైక్యత సాధించింది.

భాషాధారక రాష్ర్టాలు స్వాతంత్య్రానికి, జాతీయతకు ప్రాతిపదిక అంటూ ప్రథమంగా పరిపాలన ప్రజల భాషలో జరుగవలెనని, విద్యాబోధన మాతృభాషలో నేర్పబడవలెనని ఆంధ్రోద్యమం ప్రారంభమైంది. 1913లో ప్రథమంగా బాపట్లలో ఆంధ్రమహాసభ జరిగింది. శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు ఆంధ్రజన సమావేశంలో ఉద్ఘాటించినట్లు ఆంధ్రోద్యమం ఉద్యోగాలకై కొట్లాటకాదు. పదవులకు ప్రాకులాట కాదు. పరిపాలన, విద్యాబోధన మాతృభాషలో జరిగితే, పరభాషలో జరిగితేను, తల్లి చనుబాలతో పెరిగిన బిడ్డకు, పోతపాలతో పెరిగిన బిడ్డకు ఉన్నంత తేడా ఉంటుందని ఘంటాపథంగా నుడివారు. ఆంధ్రోద్యమం జాతీయోద్యమానికి పునాది అయింది.

ఆంధ్ర ప్రజలకు అప్పటికే ఒక సంస్థ, కార్యకర్తలు, జాతీయభావం, ప్రజా ఉద్యమానికి పునాది అయింది. ఆనాటి ఆంధ్రోద్యమానికి ఆదర్శం శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు చూపారు.
జాతీయోద్యమంలో భాగంగా వున్న వందేమాతరం ఉద్యమంలో, హోంరూల్‌ ఉద్యమంలో, కాంగ్రెసు ఉద్యమంలో, ఆంధ్రులందరు కలిసి ఆంధ్ర ప్రాంతానికి (అప్పటికి బ్రిటిషు పాలనలో వున్న జిల్లాలను కలిపి) ఒక రాష్ట్ర సంఘం ఏర్పడి, పాలనా భాగంగా గౌరవం సాధించారు.

గాంధీజీ రాజకీయ రంగంలోకి రావడంతో హిందీ భారతదేశానికి రాష్ట్రభాషగా వుండవలెనని ఉద్బోధించారు. దేశానికి హిందీ రాష్ట్రభాష, అధికారభాషగా తమ ఆశయం ప్రజానీకం ప్రకటించింది.
పరప్రభుత్వం చీలించి పాలించమన్నట్లు బ్రిటిషు ప్రభుత్వానికి అండగా వున్నందున ఒరిస్సా, సింధు రాష్ర్టాలను 1935లో నిర్మించింది. జాతీయోద్యమ ప్రభావం ఉన్నందున ఆంధ్రులకు రాష్ట్రం లభించలేదు. కర్ణాటకము, మహారాష్ట్రము తమకు తమ భాషా రాష్ర్టాలు కావాలని కోరారు.

శ్రీ లాలాలజపతిరాయ్‌ నాయకత్వాన పంజాబు ఉద్యమం, బాలగంగాధరతిలక్‌ నాయకత్వాన మహారాష్ట్ర ఉద్యమం, రాజేంద్రప్రసాద్‌ నాయకత్వాన బీహారు ఉద్యమం, శ్రీ రవీంద్ర కవీంద్రుని నాయకత్వాన బెంగాలు ఉద్యమం, ఆంధ్రమహాసభ నాయకత్వాన ఆంధ్రోద్యమం…తమభాష కొరకు, తమ ఉనికి కొరకు, తమ వ్యక్తిత్వం కొరకు వివిధ రూపాల చైతన్యస్రవంతులు ప్రవహింపసాగినవి. అది జాతీయ ఉద్యమంలో భాగాలుగా ఉపనదులు మహానదిలో చేరినట్లు లీనమై, స్వాతంత్య్ర ధ్యేయంతో ముందుకు సాగాయి. తమ తమ భాషా వ్యక్తిత్వాలు నిలుపుకుంటూ నిలుపుకొనుటలో నవ జీవనోద్యమాలు సాగిస్తూ, బ్రిటిషు ప్రభుత్వాన్ని ప్రతిఘటించుటకు కావలసిన ఐక్యతను సాధించుకొను గమన పరిజ్ఞానం ఇంగ్లీషులో పొంది, సమైక్య ఉద్యమాలు సాగించి, స్వాతంత్య్రోద్యమ ఫలితంగా ఎన్నో సంవత్సరాల క్రితం సాధించగలిగారు. కాని 1906లో బెంగాల్‌ను మతప్రాతిపదిక మీద విభజించి, పాలించదలచి, 1912లో విఫలమైన ఇంగ్లీషు రాజనీతి, 1947లో బెంగాల్‌నే కాక, భారతదేశాన్నే మతప్రాతిపదిక మీద చీల్చి, భారత పాకిస్తాన్‌లు చేసి, రెండు దేశాలు నిర్మించి, రెంటికీ ప్రాధాన్యం ఇచ్చామంటూ వైదొలగారు.
భాషా ప్రాతిపదిక మీద యేర్పడిన జాతీయోద్యమమే స్థిర పునాదుల మీద నిలబడగలదని, మతప్రాతిపదిక మీద స్వాతంత్య్రం తాత్కాలికమేనని పాకిస్తాన్‌ ఇరవై అయిదు సంవత్సరాల చరిత్ర ఋజువు చేసింది. మతావేశంలో ప్రారంభమై, నామరూపాలు కలిగించుకున్న పాకిస్తాన్‌ 1969కల్లా మతం కన్నా భాష ప్రాధాన్యమని ముజిబుర్‌ రహమాన్‌ నాయకత్వాన ప్రారంభమైన బెంగాల్‌ ఉద్యమం సర్వస్వతంత్ర సమాన ప్రజాస్వామ్యంగా బంగ్లాదేశ్‌ యేర్పడి, బెంగాలీ భాషను రాజభాషగా, బోధనాభాషగా నిర్ణయించుకుంది.

భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఇన్ని సంవత్సరాలైనా, దేశానికి స్వతంత్ర భాషావిధానం యేర్పడకపోవడం, స్వాతంత్య్రానంతరం నవోజ్జీవనం సన్నగిలడం కారణం. స్వాతంత్య్రం లభించిన తర్వాత అలవాటు క్రింద అధికారులు ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోవడం, స్వాతంత్య్ర ప్రకటననాడే దేశభాషను ప్రకటించని బలహీనత ఇంగ్లీషు ప్రాబల్యానికేగాక, ఇంగ్లీషు మీదనే అధిక మోజు ఏర్పడి, స్వాతంత్య్రానంతరం ఏర్పడిన రెండు మూడు తరాల జనానికీ కూడ అలవాటు క్రింద ఇంగ్లీషు వాడుకలో పడిన అలవాటులో మాతృభాషపై అభిమానం సన్నగిల్లసాగింది.

ఆంధ్రోద్యమం సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు బలిదాన ఫలితంగా కర్నూలు రాజధానిగా, ఆంధ్రరాష్ర్టం 1953 అక్టోబరు 1వ తేదీన ఏర్పడింది. నిజంగా ఆంధ్రరాష్ర్టం యేర్పడిన వెంటనే,ఆంధ్ర శాసనసభ తన అధికార భాష తెలుగు అని ప్రకటించి ఉండవలసింది. అంత త్వరలో, అతి సాహసంతో, ప్రభుత్వం ఏర్పడగానే తమ అధికార భాష బెంగాలీ అని ప్రకటించిన కీర్తి బంగ్లాదేశ్‌కే చెందుతుంది. అయినా ఈ వ్యాసరచయిత ప్రతిపాదించిన “రాజ్యాంగ నిబంధనలను” అసంగతంగా లేనంతవరకు, ప్రభుత్వ వ్యవహారాలను తెలుగులోనే నిర్వహించాలనే తీర్మానం శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి “సాధ్యమైనంత త్వరలో” అనే సవరణతో 1955 సెప్టెంబరు 29 తేదీన ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. ఈ వ్యాసరచయిత ప్రతిపాదించిన బిల్లు మాత్రం త్రోసివేయబడింది.

1946 ప్రాంతంలో ఏర్పడిన మద్రాసు కాంగ్రెస్‌ మంత్రివర్గం ఆంధ్ర జిల్లాలలో తూర్పు గోదావరి జిల్లాలో, తమిళనాడులో తంజావూరు జిల్లాలో విద్యాబోధన జిల్లాస్థాయివరకు మాతృభాషలోనే నిర్వహించవలెనని ఆదేశించింది. అమలు జరపటానికి ప్రయత్నించింది. కాని తీవ్ర ప్రయత్నం మాత్రం జరగలేదని చెప్పవచ్చు. అందుకే ఈ తీర్మానం.
“సాధ్యమైనంత త్వరలో” అని ఉండడంతో, నత్త నడకతో ప్రారంభం అయింది. ఒక ఉన్నతాధికారిని వేశారు. ఇంతలో విశాలాంధ్రను సాధించడం జరిగింది. నైజాం నిరంకుశ పాలన క్రింద ఉర్దూ భాష రుద్దబడిన ఆంధ్ర ప్రజానీకం నైజాం ఆంధ్రమహాసభ ఆధ్వర్యాన శ్రీ మాడపాటి హనుమంతరావు నాయకత్వాన ఆంధ్ర భాషాభివృద్ధికి, ఆంధ్ర ప్రజల సముజ్జీవనానికీ, ఆంధ్రోద్యమం నడచి, తెలుగు భాషాభివృద్ధికీ సంస్కృతి పరిరక్షణకు మహదుద్యమాలు నడచినవి. నైజాం నిరంకుశత్వమే కాకుండా, ప్రభుత్వాన్నే తొలగించుకోగలిగారు. అందరూ తెలుగువారు ఒకటిగా అనేక శతాబ్దాల అనంతరం చేరగలిగారు. ఆంధ్రమాత కౌగలిలో అనుంగు బిడ్డలుగా ఆశ్రయం పొందగలిగామని మహదానందపడ్డారు.

విశాలాంధ్ర ఏర్పడగానే ప్రథమ కర్తవ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగును అన్ని స్థాయిలలో అధికారభాషగా చేసి ఉండినట్లయితే విశాలాంధ్ర సాధించినందుకు నిజమైన సార్థకత ఉండేది. అది కాకుండా మద్రాసురాష్ట్రం నుండి విడివడిన మన నాయకత్వం ఇంగ్లీషును వదలలేక, నైజాం పాలననుండి బయటపడ్డ నాయకత్వం ఉర్దూ నుండి బయటపడలేక తెలుగును అధికారభాషగా అమలు జరుపుటకు సాహసంతో నిర్ణయించుకోలేకపోవడంతో, అటు యిటు అధికారులు ఇంగ్లీషు అధికారభాషగా అమలు జరుపుటతో తమ శక్తిసామర్య్థాల్ని వినియోగించి రెండు వర్గాలలోను ఇంగ్లీషును అలవాటు చేశారు. విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడిందనే సంతోషంతో సంతృప్తి చెంది, అంతకుముందు ఈ రెండు ప్రాంతాలలోను నడచిన ఆంధ్రోద్యమాలు, ఆంధ్ర పునరుజ్జీవనోద్యమాలు మరుగునపడినవి. ఇటు బయట సాంస్కృతిక ఉద్యమం సజీవంగా నడవని సమయంలో, అటు అధికారులు, రాజకీయ నాయకత్వం తెలుగుపై పట్టుదల వహించక, ఇంగ్లీషునే ప్రోత్సహించడం, ఇంగ్లీషు లేకపోతే బ్రతకలేమనే మనోదౌర్బల్యంతో పనిసాగిపోతే, అధికారుల చేయి పైచేయి అయి అంతా ఇంగ్లీషులోనే సాగింది. అటు బ్రిటిషు పాలననుండి బయటపడిన ఆంధ్రులుగాని, తామాశించిన తెలుగు భాషలో పరిపాలన, బోధన జరిగి, తమ మాతృస్థానం అనుకోగలిగిన సాంస్కృతిక వారసత్వం భాషాభిమానం ఎప్పుడూ అమలు జరగలేదే. ఇక మిగిలింది ఉద్యోగాలు, అధికారాలు, స్వార్థలాభాలు, వీటితో ఆంధ్రుల సమైక్యతకు ప్రధానమైన శక్తి వమ్ము అయింది. ఇతర ఆలోచనలు సాగినవి. అధికారంలోని అధికారులలో వచ్చిన వివాదాలు, స్వార్థాలు, ఆంధ్రప్రదేశ్‌ విచ్ఛిన్నతకు దారితీసినవి. అదృష్టవశాత్తు విచ్ఛిత్తికి దారితీసినవే కాని విచ్ఛిత్తి కాకపోవడం ఆంధ్రుల అదృష్టం.

……….. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య (1908-2003)
పేరుమోసిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, నిస్వార్థ సంఘసేవకుడు, సుదీర్ఘమైన తన జీవితాన్నంతటినీ సార్వజనిక ప్రయోజనాలకై వెచ్చించిన గాంధేయవాది. కళాప్రపూర్ణ, పద్మభూషణ తదితర బిరుదులతో ఆయనను సత్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఆయన ఆదర్శాలతో మాత్రం పనిలేనట్టే కనబడింది. ఆయన భుజానికెత్తుకున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాల్లో తెలుగు భాషకు సేవ చెయ్యడం ఒకటి మాత్రమే. తెలుగును అధికారభాషగా చెయ్యాలని ఆయన ఎంతగా ప్రయత్నించాడో ఈ వ్యాసాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతకాలంలో తెలుగు భాష గురించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాసానికి కొంత ప్రాధాన్యత ఉంటుంది.

తెలంగాణ సాయుధ పోరాటం : దొడ్డి కొమురయ్య

నల్గొండ జిల్లా, జనగామ తాలూకాకు (ప్రస్తుతం జనగామ తాలూకా వరంగల్లు జిల్లాలో ఉంది) చెందిన పేరు మోసిన దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి 40 వేల ఎకరాలకు భూస్వామి. ఆయన కౌలుదార్లనుండి, రైతుల నుండి నిర్బంధంగా భూములు కబళిస్తూనే వచ్చాడు. తన ఆధీన ప్రాంతంలోని, దాదాపు 40 గ్రామాల రైతులచేత నిర్బంధంగా సంవత్సరం పొడవునా తన పొలాలలో చాకిరి చేయించుకొనేవాడు. కుటుంబంలో బిడ్డ పుట్టినా, వివాహం జరిగినా, ఎవరైనా మరణించినా ఆ సందర్భాలలో రైతులనుండి నిర్బంధంగా నజరానాలు (ధనరూపంగాగాని, వస్తురూపంగాగాని బహుమానాలు) పొందుతుండేవాడు.

ప్రతి చేతి పనివాడు, వ్యాపారస్తుడూ తన ఉత్పత్తులలో కొంత భాగాన్ని లేదా రొక్కరూపంగా నిర్ణీత మొత్తాన్ని చెల్లించక తప్పేదికాదు. చర్మకారులు – చెప్పులను, పశువులు కొమ్ములను, గొల్లవారు – కంబళ్ళను, విందుకోసం గొర్రెలను, మేకలను, పాలను; రైతులు – ధాన్యం, కూరగాయలు మొదలైనవి యిచ్చుకొంటూ వుండేవారు. 1940 ప్రాంతంలో ఆయన రెండు లక్షల రూపాయల విలువజేసే భవనం కట్టించాడు. ఆ భవన నిర్మాణ వ్యయంలో దాదాపు సగభాగాన్ని వివిధ నిర్మాణ పనులకు నిర్బంధంగా చాకిరీ చేయించుకోవడం ద్వారాను, రొక్కరూపంగాను సేకరించాడు. మూడు రోజుల క్రితమే ప్రసవించిన ఒక యువతిని, తన పసికందును ఇంటి వద్ద వదిలి అతని పొలాలలో చాకిరీ జేయటానికి నిర్బంధంగా రప్పించుకున్నాడు. దానితో చూచేవారెవరూ లేక, పాలులేక ఆ పసికందు కన్ను మూసింది. అతడెంత దుర్మార్గుడుగా పేరు మోసాడంటే, ఆ గ్రామలలో నివసించేవారికి తమ బిడ్డలనిచ్చి పెండ్లి చేయటానికి రైతులు వెనకాడేవారు.

ఆయన తన గ్రామాలలో ఒకటైన పాలకుర్తిలో సంఘాన్ని గట్టిగా బలపరిచే కార్యకర్తయగు అయిలమ్మ అనే రజక స్త్రీకి చెందిన పొలాన్ని స్వాధీనం చేసుకొనటానికి ప్రయత్నించాడు. పొలాలనుండి పంటను కోయించుకెళ్ళాలని పథకం వేసాడు. అంతకముందే ఆ గ్రామంలో జరిగిన ఒక బహిరంగసభపైకి, సంఘం నాయకులను హత్య చేయటంకోసం గూండాలను పంపించాడు. అయితే ప్రజలాతని పథకం సాగనివ్వలేదు. గూండానాయకుడగు ఓనమాల వెంకడుని చితకదన్ని పంపించారు. ఆ సాకుతో భూస్వామి, పధ్నాలుగుమంది సంఘనాయకులను అరెస్టు చేయించాడు. హత్యాప్రయత్నం చేసినట్టు వారిపై కేసు పెట్టించాడు. ఈ కేసులో ఆ గ్రామానికి, తాలూకాకు, జిల్లాకు చెందిన సంఘనాయకులు యిరికించబడ్డారు. ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ పరిస్థుతులలో, తాను అయిలమ్మ పొలాలను స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడే వారెవరూ వుండబోరని విసునూరు రామచంద్రా రెడ్డి భావించాడు.

అయిలమ్మ పొలంలో పంట కోసుకురమ్మని ఆడ, మగ నౌకర్లను వందమందిని, వందమంది గూండాలను పంపించాడు. అప్పుడు సంఘ నాయకులు, 28 మంది వలంటీర్లతో బయలుదేరారు. ప్రాణాలకు తెగించి, కర్రలు చేతబట్టుకుని, నినాదాలిచ్చుకుంటూ వెళ్ళి గూండాలపై దాడి చేసారు. ఈ వాలంటీర్లు కర్రలు చేతబూని ఒక వ్యూహం ప్రకారం నడుస్తూండటంజూచి, వారి ముఖాలలో కానవస్తున్న ధృఢ నిశ్చయాన్ని గాంచి గూండాలు బ్రతుకుజీవుడా అంటూ పలాయనం చిత్తగించారు. ఇంకెవ్వరూ మిగలలేదు, వాలంటీర్లే పంట కోసి అయిలమ్మ యింటికి పంపించారు. ఆ రాత్రే విసునూరునుండి పోలీసులు దిగారు. అయినా, అయిలమ్మ ఇంట్లో వున్న ఆ ధాన్యాని, ముట్టుకొనటానికి సాహసించలేదు. ఈ సంఘటన ప్రజలను ఉత్తేజ పరిచింది.

ఆ మరునాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్లు ప్రతాపరెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి గార్లతో సహా ఆరుగురు నాయకులను అరెస్టుజేసి, విసునూరు పోలీసు స్టేషనుకు తీసుకుపోయారు. వాళ్ళ చేతులకు, కాళ్ళకు బేడీలు వేసి అర్ధరాత్రి వేళ, కచేరిచావిడికి తీసుకుపోయారు. అక్కడ వాళ్ళను తీవ్రంగా దెబ్బలు గొట్టారు. వారి తలలు పొయ్యిలలోకి నెట్టారు. వారి ఆసనాలలో కారం కూరారు. వాళ్ళ నోళ్ళలో మూత్రంపోశారు. ఫాసిస్టు పైశాచిక చర్యలింకా అనేకం చేశారు. అయితే ఇంత జరిగినా, అయిలమ్మ పొలాన్ని గాని, ఆపొలంలో పండినపంటనుగాని దేశముఖు స్వాధీనం చేసుకోలేకపోయాడు. పేరుమోసిన దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డిపై సాధించిన ఈ విజయం మొత్తం తెలంగాణా ప్రజలను ఉత్తేజ పరిచింది. ధైర్యాన్నిచ్చింది. ఇది జరిగిన చాలాకాలం తర్వాత కూడా ప్రజలు ఈ వీరోచిత పోరాటాన్ని గూర్చి కథలుగా చెప్పుకుంటూ ఆగాధలను గూర్చి పాటలు పాడుకుంటూ వుండేవారు.

దొడ్డి కొమురయ్య ఆత్మార్పణ: 1946 జులై 4:


పైన పేర్కొన్న సంఘటనతో విసునూరు దేశముఖ్ బాగా రెచ్చిపోయాడు. తనజీవితంలోనే ఎన్నడూ ఎరుగనంతటి ఘోరమైన ఓటమిగా దాన్ని పరిగణించాడు. పోలీసుల సహాయంతో కడవెండి గ్రామానికి చెందిన నాయకులను హత్యజేయాలని పథకం వేసాడు. ఈ పథకంలో భాగంగా అనేకమంది ప్రజలపై కేసులు పెట్టాడు. వారిలో 15 మందిని అరెస్టు చేయించాడు. వారు తర్వాత బెయిలు మీద విడుదల చేయబడ్డారు. ఆరోజుల్లో ఎంత అవ్యవధిగానయినా సరే, ప్రజలు సంఘం కార్యాలయం వద్ద చేరేవారు. తమ కార్యక్రమాన్ని గూర్చి చర్చించుకొనేవారు. ఆ విధంగా సమావేశమై చర్చించుకొనటాన్ని అరికట్టేందుకు గాను, వారిపై కోర్టులలో కేసులుపెట్టి భయపెట్టేట్లయితే తన హత్యా పథకాలు, అమలు జరపవచ్చునని అతడు తలంచాడు. పోలీసు అధికారులు, జమీందారుతోను, అతని గూండాలతోనూ, కలిసి మొత్తం పధకమంతా తయారు చేసారు. జమీందారు యధేచ్ఛగా వ్యవహరించటంకోసం వాళ్ళక్కడనుండి వెళ్ళిపోయారు.

అది 1946 జూలై 4వ తేది. తప్పత్రాగిన గూండాలు నాయకుల యిండ్లపై రాళ్ళు విసిరారు. లాఠీలు, వడిసెలలు, చేతబూని నినాదాలు చేసుకుంటూ ప్రజలు ఊరేగింపు జరిపారు. ఆ ఊరేగింపు ప్రధాన వీధిలోనే వున్న జమీందారు యింటిదాపుకు వచ్చేసరికి, జమీందారు యింటిప్రక్కన ఒక పాకలో అప్పటికే సిద్ధంగా వున్న గూండాలు ప్రజలపైకి కాల్పులు జరిపారు. ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న గ్రామసంఘ నాయకుడు దొడ్డి కొమురయ్యకు తుపాకీతూటా పొట్టలో గుండా దూసుకుపోయింది. ఆయన అక్కడకక్కడే మృతిచెందాడు. ఆయన అన్నగారైన దొడ్డి మల్లయ్య కాలికి తూటా తగిలి క్రిందపడిపోయాడు. మంగలి కొండయ్య నుదుటికి దెబ్బ తగిలింది, అతని సోదరుడు నరసయ్య ముంజేయి గాయపడింది.

అయినా ప్రజలు భయకంపితులై పారిపోలేదు. రక్తానికి రక్తం అని నినాదాలు చేసుకుంటూ వారు జమీందారు భవనాన్ని చుట్టుముట్టారు. జమీందారు భవనానికి ప్రక్కనే పాకలోవున్న గూండాలది చూసి కంపించిపోయారు. ప్రజల కోపాగ్ని నుంది తప్పుకొని బతికి బయటపడటం సాధ్యం కాదని తలంచారు. జమీందారు భవనపు ఎత్తయిన గోడలు తమకు రక్షణ నివ్వగలవని భావించారు. జమీందారు భవనంలోకి దూకారు. అయితే ప్రజలప్పటికే ఆ భవనాన్ని చుట్టుముట్టారు. పరిసర గ్రామాల ప్రజలకు కబుర్లు పంపారు. జమీందారు భవనానికి నిప్పంటించడం కోసం ఎండుగడ్డి మోపులతో ప్రజలు వచ్చిపడ్డారు. రెండువేల మంది ప్రజలక్కడ చేరారు. కొంతమంది గడీని చుట్టుముట్టారు. మరికొంతమంది వూరి వెలుపల కాపలా కాస్తున్నారు. యింకా కొందరు గ్రామవీధులలో పహరా తిరుగుతున్నారు. ప్రజలు ఆగ్రహంతో అట్టుడికిపోతున్నారు.

ఈ వార్త విని విసునూరు రామచంద్రారెడ్డి కొడుకు బాబూరావు (జగన్ మోహన్) విసునూరు నుండి, కత్తులు, పిస్తోళ్ళు, బల్లేలు చేతబూనిన రెండువందల మంది గూండాలను తీసుకొచ్చాడు. గ్రామం వెలుపల కాపలాకాస్తున్న ప్రజలు వాళ్ళను చూసి ఆకాశం దద్దరిల్లేటట్లు నినాదాలు చేశారు. వడిసెలతో రువ్వుతూ మూకవుమ్మడిగా గూండాలమీదికి నడిచారు. ఆగ్రహావేశపరులైన జనసామాన్యాన్ని చూసిన గూండాలు, తుపాకీ కాల్పులు సహితం ప్రజల పురోగతిని ఆపజాలవని తలపోశారు. ప్రాణాలు దక్కితే చాలునని కాలికి బుద్దిజెప్పి పారిపోయారు. ప్రజలు వాళ్ళను మూడుమైళ్ళ దూరం తరిమికొట్టారు. అనేకమంది గూండాలకు రాళ్ళదెబ్బలు తగిలాయి. వాళ్ళలో చాలామంది, పారిపోతూ మాడాపురం తండాలో దాగుకున్నారు. అయితే అచ్చటి ప్రజలు పరిస్థితిని గమనించి ఆ గూండాలను తరిమివేశారు. పేరుమోసిన గూండా అనుముల రామిరెడ్డిని ఒకచోట పట్టుకున్నారు. కామ్రేడ్స్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, సి.యాదగిరిరావు తదితరుల నోళ్ళలో మూత్రంపోసిన వాళ్ళలో అతడూ వొకడని తెలిసిన ప్రజలు అతనిని చితకదన్ని పంపించారు. గూండాలు ఎక్కివచ్చిన బండ్లను ముక్కలుముక్కలు చేశారు. జమీందారు మామిడితోటలో ఒక్క చెట్టయినా మిగలకుండా చేశారు.

సరిగ్గా అదే సమయంలో 60 మంది రిజర్వుపోలీసులు ఆ గ్రామానికి వచ్చారు. గూండాలపై తాము చర్య తీసుకుంటామని ప్రజలకు చెప్పారు. వారిని అక్కనుండి వెళ్ళిపొమ్మన్నారు. ప్రజలక్కడినుండి చెదిరిపోయిన తర్వాత గూండాలను సురక్షితంగా జమీందారుకు వొప్పగించారు. ఇదంతా జరిగిన తర్వాత సంఘం నాయకులపై ఆరు కేసులు పెట్టారు. గూండాలపై దాడి చేసారని, గడీని చుట్టుముట్టరని, దానికి నిప్పంటించటానికి ప్రయత్నించారని. గూండాలలో ఎవరినీ అరెస్టు చేయలేదు. వాళ్ళ మీద ఏ కేసూ పెట్టలేదు. అయినా ప్రజలు చలించలేదు.

దొడ్డి కొమరయ్య మృతదేహానికి, శవపరీక్షానంతరం వేలాది ప్రజలు ఆ గ్రామాలన్నింటా పెద్ద వూరేగింపు జరిపిన అనంతరం అంత్యక్రియలు జరిగాయి. పరిసర గ్రామాల ప్రజలుకూడా ఆ వూరేగింపులో పాల్గొన్నారు. జమీందారు ఎదుట తాము తలవంచేది లేదని, సంఘంకోసం తామంతా ఇనుమడించిన శక్తితో పనిచేస్తామని వారంతా ప్రతినబూనారు. ఆ తర్వాత మూడు నెలల కాలంలో వారు, జమీందారు మనుషులను పొలాలలోకి రానివ్వలేదు. పనిచేయనివ్వలేదు. ఈ సంఘటన అనంతరం తమకు ప్రియతమమైన అమరవీరుని శ్లాఘించే పాటలు పాడుకుంటున్నారు.

కొమరయ్య మరణం, అమరత్వం తెలంగాణా రైతాంగంలో నిద్రాణమైవున్న ఆగ్రహాన్ని ప్రజ్వరిల్లజేసింది. నల్గొండ జిల్లాలోని అన్ని తాలూకాలలో ప్రజలు ఒక్కుమ్మడిగా విజృంభించారు. జిల్లా అంతటా జరిగే అన్ని సభలలోనూ, ప్రదర్శనలలోనూ, ఈ అమరవీరునికి జోహార్లర్పించే పాటపాడడం జరుగుతుండేది. కర్రలు, వడిసెలు ధరించిన ప్రజలు ఒక గ్రామానికి చెందినవారు మరొక గ్రామానికి వెళ్ళి వస్తూ ఉత్తేజం కలుగజేసేవారు. వారు ఉమ్మడిగా భూస్వామి గడీముందు బహిరంగ సభ జరిపేవారు. ఎర్రజెండాను ఆవిష్కరించేవారు. “ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. వెట్టి, అక్రమ నిర్బంధ వసూళ్ళు, బేదఖళ్ళు ఇంకెంతమాత్రం సాగవు”, అని ప్రకటించేవారు. భూస్వామిగాని, దేశముఖ్ గాని సంఘం యొక్క ఈ ఉత్తర్వులను అమలు జరపకపోతే అతనిని సాంఘిక బహిష్కారానికి గురిచేసేవారు. అతని పొలాలను ఎవరూ పనిచేయటానికి వీలులేదు. క్షుర కర్మకారులుగానీ, రక్షకులుగాని ఇంటిపని వాళ్ళుగాని, ఇతర పనివాళ్ళుగాని ఎవరూ అతనికి ఏ పని చేయటానికి వీలులేదు. ఈ యాత్రను నిర్వహించింది, నిర్మించి వ్యాప్తి గావించింది స్థానిక నాయకులే.

పొరుగు గ్రామం నుండి వచ్చిన ప్రజలకు కులమత వివక్షతలేకుండా, భోజనాలు పెట్టి సత్కరించేవారు. వారికి ఘనంగా వీడ్కోలిచ్చేవారు. దూర గ్రామాలనుండి వచ్చినవారు, వెనకకు వెళ్ళిపోగా, ఆ గ్రామం నుండి మరికొంతమంది ఆ యాత్రలో చేరి పక్క గ్రామం వరకు వెళ్ళివచ్చేవారు.

ఈ వూరేగింపులు, జమీందార్ల ఇండ్లముందు నిలిపి, “జమీందారీ విధానం రద్దుకావాలి,” “భూస్వాముల పీడనకు, పోలీసు జులుముకు స్వస్తి చెప్పాలి,” “నిర్బంధ ధాన్యసేకరణను, వెట్టిని, అవినీతిని అంతంచేయాలి,” “అమరజీవి దొడ్డి కొమరయ్య జిందాబాద్” మొదలగు నినాదాలు చేసేవారు. తమ చేతుల్లోని గుటపలన్నిటిని (కర్రలన్నింటినీ), ఒక్కుమ్మడిగా నేలపై కొట్టి పెద్ద శబ్దం చేసేవారు. ఆ శబ్దం యావత్తు గ్రామాన్ని దద్దరిల్ల చేసేది. ప్రజాద్రోహుల గుండెల్లో కంపరమెత్తించేది. “గూటుపాల సంఘం” అని వాళ్ళు పిలిస్తుండే సంఘం నినాదాలు వినపడగానే, ఈ ప్రజాద్రోహులు తమ తలుపులు మూసుకొని, లోపల కూర్చొని తాళాలు పెట్టుకునేవారు. ఈ వూరేగింపులలో గల ప్రత్యేక లక్షణాలలో ఒకటి ఏమిటంటే, పురుషులతోపాటు స్త్రీలుకూడా తమ గ్రామాలలోనేగాక, ఇతర గ్రామాల్లో కూడా పాల్గొనటం. అయిలమ్మ భూమి పోరాటంపై రాసిన పాటలు మహిళలను అత్యంతంగా ఆకర్షించాయి. మొట్టమొదటిసారిగా భూమి, బేదఖళ్ళు, వెట్టి, నిర్బంధ ధాన్యసేకరణ వంటి జీవిత సమస్యలను జమీందారీ రద్దు నినాదాని జోడించటం జరిగింది. ఈ దశలో ప్రధానమైన అంశమిది.

ఈ ప్రజా ఉద్యమ వెల్లువలో, ప్రభుత్వం లెవీ ధాన్యం సేకరించలేకపోయింది. లెవీ ధాన్యం వసూలు చేస్తుండే అధికారులను గ్రామంలో అడుగయినా పెట్టనివ్వటంలేదు. అదే విధంగా వెట్టికూడా దానంతటదే అంతమయింది. వెట్టి చేయించుకుంటూ వచ్చిన దేశముఖులు, గ్రామాధికారులు, గ్రామాలు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. వాళ్ళు ఊళ్ళోనేవున్నా తలెత్తుకు తిరగలేకపోయేవాళ్ళు. కొలది వారాలలోనే ఈ ఉద్యమం నల్గొండ జిల్లాలోనూ, పొరుగునే ఉన్న వరంగల్లు (ఖమ్మం) జిల్లాలో మూడు – నాలుగు వందల గ్రామాలకు వ్యాప్తి గాంచింది.

మూలం : పుచ్చలపల్లి సుందరయ్య ‘వీర తెలంగాణ విప్లవపోరాటం’

India Regional Movements : Telangana

India - Regionalism
The formation of states along linguistic and ethnic lines has occurred in India in numerous instances since independence in 1947 (see Linguistic States, this ch.). There have been demands, however, to form units within states based not only along linguistic, ethnic, and religious lines but also, in some cases, on a feeling of the distinctness of a geographical region and its culture and economic interests. The most volatile movements are those ongoing in Jammu and Kashmir and Punjab (see Political Issues, ch. 8; Insurgent Movements and External Subversion, ch. 9). How the central government responds to these demands will be an area of scrutiny through the late 1990s and beyond. It is believed by some officials that conceding regional autonomy is less arduous and takes less time and fewer resources than does meeting agitation, violence, and demands for concessions.

Telangana Movement
An early manifestation of regionalism was the Telangana movement in what became the state of Andhra Pradesh. The princely ruler of Hyderabad, the nizam, had attempted unsuccessfully to maintain Hyderabad as an independent state separate from India in 1947. His efforts were simultaneous with the largest agrarian armed rebellion in modern Indian history. Starting in July 1946, communist-led guerrilla squads began overthrowing local feudal village regimes and organizing land reform in Telugu-speaking areas of Hyderabad, collectively known as Telangana (an ancient name for the region dating from the Vijayanagar period). In time, about 3,000 villages and some 41,000 square kilometers of territory were involved in the revolt. Faced with the refusal of the nizam of Hyderabad to accede his territory to India and the violence of the communist-led rebellion, the central government sent in the army in September 1948. By November 1949, Hyderabad had been forced to accede to the Indian union, and, by October 1951, the violent phase of the Telangana movement had been suppressed. The effect of the 1946-51 rebellion and communist electoral victories in 1952 had led to the destruction of Hyderabad and set the scene for the establishment of a new state along linguistic lines. In 1953, based on the recommendation of the States Reorganisation Commission, Telugu-speaking areas were separated from the former Madras States to form Andhra, India’s first state established along linguistic lines. The commission also contemplated establishing Telangana as a separate state, but instead Telangana was merged with Andhra to form the new state of Andhra Pradesh in 1956.

The concerns about Telangana were manifold. The region had a less developed economy than Andhra, but a larger revenue base (mostly because it taxed rather than prohibited alcoholic beverages), which Telanganas feared might be diverted for use in Andhra. They also feared that planned dam projects on the Krishna and Godavari rivers would not benefit Telangana proportionately even though Telanganas controlled the headwaters of the rivers. Telanganas feared too that the people of Andhra would have the advantage in jobs, particularly in government and education.

The central government decided to ignore the recommendation to establish a separate Telangana state and, instead, merged the two regions into a unified Andhra Pradesh. However, a “gentlemen’s agreement” provided reassurances to the Telangana people. For at least five years, revenue was to be spent in the regions proportionately to the amount they contributed. Education institutions in Telangana were to be expanded and reserved for local students. Recruitment to the civil service and other areas of government employment such as education and medicine was to be proportional. The use of Urdu was to continue in the administration and the judiciary for five years. The state cabinet was to have proportional membership from both regions and a deputy chief minister from Telangana if the chief minister was from Andhra and vice versa. Finally, the Regional Council for Telangana was to be responsible for economic development, and its members were to be elected by the members of the state legislative assembly from the region.

In the following years, however, the Telangana people had a number of complaints about how the agreements and guarantees were implemented. The deputy chief minister position was never filled. Education institutions in the region were greatly expanded, but Telanganas felt that their enrollment was not proportionate to their numbers. The selection of the city of Hyderabad as the state capital led to massive migration of people from Andhra into Telangana. Telanganas felt discriminated against in education employment but were told by the state government that most non-Telanganas had been hired on the grounds that qualified local people were unavailable. In addition, the unification of pay scales between the two regions appeared to disadvantage Telangana civil servants. In the atmosphere of discontent, professional associations that earlier had amalgamated broke apart by region.

Discontent with the 1956 gentlemen’s agreement intensified in January 1969 when the guarantees that had been agreed on were supposed to lapse. Student agitation for the continuation of the agreement began at Osmania University in Hyderabad and spread to other parts of the region. Government employees and opposition members of the state legislative assembly swiftly threatened “direct action” in support of the students. The Congress-controlled state and central governments offered assurances that non-Telangana civil servants in the region would be replaced by Mulkis, disadvantaged local people, and that revenue surpluses from Telangana would be returned to the region. The protestors, however, were dissatisfied, and severe violence, including mob attacks on railroads, road transport, and government facilities, spread over the region. In addition, seventy-nine police firings resulted in twenty-three deaths according to official figures, the education system was shut down, and examinations were cancelled. Calls for a separate Telangana state came in the midst of counter violence in Andhra areas bordering Telangana. In the meantime, the Andhra Pradesh High Court decreed that a central government law mandating replacement of non-Telangana government employees with Mulkis was beyond Parliament’s constitutional powers.

Although the Congress faced dissension within its ranks, its leadership stood against additional linguistic states, which were regarded as “antinational.” As a result, defectors from the Congress, led by M. Chenna Reddy, founded the Telangana People’s Association (Telangana Praja Samithi). Despite electoral successes, however, some of the new party leaders gave up their agitation in September 1971 and, much to the disgust of many separatists, rejoined the safer political haven of the Congress ranks.

In 1972 the Supreme Court reversed the Andhra Pradesh High Court’s ruling that the Mulki rules were unconstitutional. This decision triggered agitation in the Andhra region that produced six months of violence.

Throughout the 1970s, Andhra Pradesh settled into a pattern of continuous domination by Congress (R) and later Congress (I), with much instability and dissidence within the state party and constant interference from Indira Gandhi and the national party. Chenna Reddy, the erstwhile opposition leader, was for a time the Congress (I) state chief minister. Congress domination was only ended by the founding of the Telugu National Party by N.T. Rama Rao in 1982 and its overwhelming victory in the state elections in 1983.

Polls taken after the end of the Telangana movement showed a certain lack of enthusiasm for it, and for the idea of a separate state. Although urban groups (students and civil servants) had been most active in the movement, its support was stronger in rural areas. Its supporters were mixed: low and middle castes, the young and the not so young, women, illiterates and the poorly educated, and rural gentry. Speakers of several other languages than Telugu were heavily involved. The movement had no element of religious communalism, but some observers thought Muslims were particularly involved in the movement. Other researchers found the Muslims were unenthusiastic about the movement and noted a feeling that migration from Andhra to Telangana was creating opportunities that were helping non-Telanganas. On the other hand, of the two locally prominent Muslim political groups, only one supported a separate state; the other opposed the idea while demanding full implementation of the regional safeguards. Although Urdu speakers were appealed to in the agitation (e.g., speeches were given in Urdu as well as Telugu), in the aftermath Urdu disappeared from the schools and the administration.

The Telangana movement grew out of a sense of regional identity as such, rather than out of a sense of ethnic identity, language, religion, or caste. The movement demanded redress for economic grievances, the writing of a separate history, and establishment of a sense of cultural distinctness. The emotions and forces generated by the movement were not strong enough, however, for a continuing drive for a separate state. In the late 1980s and early 1990s, the People’s War Group, an element of the Communist Party of India (Marxist-Leninist), renewed violence in Andhra Pradesh but was dealt with by state police forces. The Telangana movement was never directed against the territorial integrity of India, unlike the insurrections in Jammu and Kashmir and some of the unrest in northeastern India.

ముల్కీ రూల్సు చరిత్ర :

ముల్కీ రూల్సు చరిత్ర :

దక్కన్‌ ప్రాంతంలో, హైదరాబాద్‌ రాజ్యంలో ముల్కీ, నాన్‌ ముల్కీల సమస్య ఇప్పటిదికాదు. బహుమనీ సుల్తానుల కాలంలోనే ఉత్తరాది నుండి వలస వచ్చి దక్కన్‌లో ఉద్యోగాలను కొల్లగొట్టిన ఉత్తరాది వారికి, దక్కనీ ముల్కీలకు ఎప్పుడూ ఘర్షణ ఉంటూనే ఉండేది. ఉత్తరాది నుంచి వలసవచ్చిన వీరిని ఆఫాకీలుగా వ్యవహరించేవారు. ఆఫాకీలు సైన్యంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, వర్తక, వాణిజ్యాలలో చొరబడి ఆర్థికంగా బలపడినారు. దర్బారుల్లో ప్రముఖ స్థానాలను మంత్రి పదవులను దక్కించుకున్నారు. దక్కనీలు రెండవ శ్రేణి పౌరులుగా దిగజారి పోయినారు. ప్రభుత్వంలో ఆఫాకీలదే పైచేయి అయి వారే అన్ని ప్రయోజనాలు పొందేవారు. ఈ కారణంగా ఆఫాకీలకు, దక్కనీలకు అన్ని రంగాలలో అంతరాలు పెరిగిపోయి శతృత్వం ఏర్పడి పోయింది. దీనికితోడు ఆఫీకీలు షియాలు, దక్కనీలు సున్నీలు కావడంతో మతపరమైన వైరుధ్యాలు కూడా ముల్కీ, గైర్‌ ముల్కీ సమస్యను తీవ్రతరం చేసినాయి. ఇటువంటి ముల్కీ, గైర్‌ ముల్కీ సమస్య సైన్యంలోకి చొరబడి ఘర్షణలు తలఎత్తి చివరికి 1521లో బహమనీ రాజ్యం అంతరించిపోయింది. దీని స్థానంలో ఐదు రాజ్యాలు ఏర్పాటయినాయి. అందులో గోల్కొండ కుతుబ్‌షాహీ రాజ్యం ఒకటి. గోల్కొండ రాజులు ముల్కీలను గౌరవించారు. ఉద్యోగాలలో సముచిత స్థానం కల్పించారు. స్థానిక భాషా సంస్కృతులను గౌరవించారు. అందువల్లనే కుతుబ్‌షాహీల కాలంలో ముల్కీ నాన్‌ముల్కీ సమస్య సద్దుమణిగింది.

గోల్కొండ రాజ్యం కూలిపోయిన తర్వాత మొగల్‌ చక్రవర్తి ప్రతినిధిగా ఉత్తరాది నుండి వచ్చిన అసఫ్‌జాహీలు స్వతంత్రం ప్రకటించుకొని హైదరాబాద్‌ రాజ్యాన్ని స్థాపించారు. వీరికున్న ఉత్తరాది సంబంధాల వలన లక్నో, ఢిల్లీ, ముర్షిదాబాద్‌, అవద్‌ రాజ్యాల నుండి అనేక మంది నిజాం రాజ్యంలోకి వలసవచ్చి ఇక్కడి ఉద్యోగాలలో చొరబడిపోయినారు. నిజాం నవాబులు వీరిని ప్రోత్సహించారు. ఐదవ నిజాం కాలంనాటికి ముల్కీ, గైర్‌ ముల్కీల సమస్య తిరిగి ప్రస్పుటంగా రంగం మీదకి వచ్చింది. ఐదవ నిజాం కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న సర్‌ సాలార్‌ జంగు-1 హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసును స్థాపించి ఉత్తరాది నుండి ముఖ్యంగా అలీగఢ్‌నుండి చదువుకునన్న వారిని ప్రభుత్వ ఉద్యోగాలలోకి ఆహ్వానించాడు. ఈ వలసపట్ల స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ సాలార్‌జంగు తన విధానాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత 1880 ప్రాంతంలో సాలార్‌జింగు-2 పరిస్థితి తీవ్రతను నిజాం ప్రభువుకు నివేదించి ఉద్యోగాలలో స్థానికులకే అవకాశాలు కల్పించాలని సూచించాడు. మహారాజా సర్‌ కిషన్‌ పర్‌షాద్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముల్కీ సమస్యపై చొరవ తీసుకొని ముల్కీ ఫర్‌మానా 1919లో జారీ కావడానికి కారకుడైనాడు. 16-11-1919న నిజాం ఫర్‌మానా జారీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు స్థానికులు మాత్రమే అర్హులు. వారు తప్పనిసరిగా ముల్కీ సర్టిఫికేట్‌ని సమర్పించాలి. స్థానికులలో అర్హులు లేని పక్షంలోనే స్థానికేతరులను నియమించాలని ఆదేశించాడు.

ముల్కీలంటే ఎవరు?

ముల్కీలంటే ఎవరు? ఎవరికి ముల్కీ సర్టిఫికేట్లు ఇవ్వాలి? అన్న విషయంలో 1919లో ఫర్మానా జారీ చేసేనాటికి స్పష్టత లేదు. 12 - 15 సం.ల స్థిర నివాసం ఉన్నవారినే ముల్కీలుగా భావించేవారు. అయితే ముల్కీ సర్టిఫికేట్లు ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో మరిన్ని వివరణలు ఇస్తూ 1934లో నిజాం మరొక ఫర్మానా జారీచేశారు. 7-6-1934న జారీ అయిన ఫర్మానా ఇచ్చిన విరవణ ప్రకారం.

“The person who has appointed on govt. posts has to submit mulki certificate. The precondition for the issue of mulki certificate is that the father and grand father of the applicant should have been residing in the state last 12 to 15 years. Since the precondition for the issue of mulki certificate to whom who are residing in the state last 12-15 years is not appears to be correct. Residing in the state in not sufficient but ought to have mingled in the Hyderabadi society and having properties in the state and celebrated marrage with locals.”

12-15 సంవత్సరాల స్థిర నివాసం ఒక్కటే ముల్కీ సర్టిఫికెట్‌ పొందడానికి ప్రాతిపదిక కారాదని, అభ్యర్థి తండ్రి, తాతల నివాసం, అతని వివాహ సంబంధం, అతనికి ఉన్న ఆస్తులు మొదలైనవి కూడా పరిగణలోనికి తీసుకునే ముల్కీ సర్టిఫికేట్‌ జారీ చెయ్యాలని 1934 ఫర్మానా ఆదేశిస్తున్నది.

1919లో మొదటిసారి జారీ అయి ఆ తర్వాత మరిన్ని వివరణలతో 1934లో మరోసారి జారీ అయిన ముల్కీ రూల్సు ఫర్మానా నిజాం రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో కలిపోయేదాకా అంటే 1948 దాకా నిరాఘాటంగా అమలయి స్థానికులకు ఉద్యోగాలలో సముచిత స్థానం లభించేందుకు దోహదం చేసినాయి. 1948 నుండి 1952 దాకా 4 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ రాష్ట్రం మిలటరీ పాలనలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వెల్లోడిని ముఖ్య మంత్రిగా నియమించింది. ఈ నాలుగేళ్ళ కాలంలో ముల్కీ రూల్సు తీవ్ర ఉల్లంఘనలకు గురి అయి వేలాది మంది నాన్‌ముల్కీలు హైదరాబాద్‌ రాష్ట్రంలో చొరబడినారు. వెల్లోడి ప్రభుత్వం ఈ చొరబాటును యధేచ్చగా అనుమతించింది. ఈ చొరబాటును నిరసిస్తూ 1952లో ‘గైర్‌ ముల్కీ గోబ్యాక్‌’ ఉద్యమాన్ని విద్యార్థులు చేపట్టినారు. 1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పడినా వెల్లోడి ప్రభుత్వంలో చోటుచేసుకున్న ముల్కీరూల్సు ఉల్లంఘనల్ని సవరించలేదు. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. వరంగల్‌లో మొదలైన గైర్‌ముల్కీగోబ్యాక్‌ ఉద్యమం అన్ని తెలంగాణ జిల్లాలకు పాకింది. సమ్మెలు, క్లాసుల బహిష్కరణ, ఊరేగింపులు సర్వసాధారణమైపోయినాయి. విద్యార్థులపై లాఠీచార్జీలు జరిగినాయి. కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో మొత్తం 18 మంది విద్యార్థులు అసువులు బాసారు. వందలాది మంది గాయపడినారు. సుమారు 350 మంది విద్యార్థులను, పత్రికా విలేఖరులను అరెస్టుచేసి జైళ్ళలో నిర్భందించారు. ఇన్ని త్యాగాలు చేసినా గైర్‌ ముల్కీలు మాత్రం వెనక్కి వెళ్లిపోలేదు.

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విలీనం

1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రను విడదీసి ఆంధ్ర రాష్ట్రాన్ని కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రులకు రాజధాని నగరం లేదు. కర్నూలులో డేరాలలో రాష్ట్ర సచివాలయాన్ని నడుపుతున్నారు. లోటు బడ్జెటు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు హైదరాబాదు రాష్ట్రం సర్వాంగ సుందరమైన, సకల సౌకర్యాలతో ఉన్న రాజధానితో, మిగులు బడ్జెటుతో, నీళ్ళు, బొగ్గు, అటవీ సంపద తదితర ప్రకృతి వనరులతో అలరారుతున్నది. హైదరాబాద్‌ రాష్ట్ట్రాన్ని కలుపుకుంటే తప్ప ఆంధ్రరాష్ట్రం మనుగడ సాగించలేదని విశాలాంధ్ర నినాదాన్ని లేవనెత్తారు ఆంధ్రులు. భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.

ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుతోనే దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు వెల్లువెత్తినాయి. దేశ సమగ్రతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘాన్ని’ జస్టిస్‌ సయ్యద్‌ ఫజల్‌ అలీ చైర్మన్‌గా, హెచ్‌.ఎన్‌ కుంజ్రూ, కె.ఎం. ఫణిక్కర్‌ సభ్యులుగా నియమించింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటుతో ఆంధ్రులు విశాలాంధ్ర ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణలో విశాలాంధ్ర భావనకు మద్దతును కూడగట్టడంలో కమ్యూనిస్టులు ప్రముఖపాత్ర పోషించినారు. హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, హయగ్రీవాచారి లాంటివారు విలీనానికి వ్యతిరేకులు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మొదట్లో విలీనానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికే అటు తర్వాత విశాలాంధ్రకు అనుకూలంగా మారిపోయినారు. రాజకీయనాయకులు ఎట్లున్నప్పటికీ తెలంగాణ ప్రజలు విలీనాన్ని వ్యతిరేకించారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ వేలాది వినతిపత్రాలు రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘానికి అందినాయి. ఆంధ్రులతో కలిస్తే తాము దోపిడీకి, వివక్షకు, నిర్లక్ష్యానికి గురి అవుతామని వారు భయందోళనలు వ్యక్తం చేశారు.

ఎస్‌.ఆర్‌.సి తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్నది. తెలంగాణ ప్రజల భయాలను, అభద్రతను అర్థం చేసుకున్నది. విలీనం వల్ల లాభనష్టాలను కూలంకషంగా బేరీజు వేసుకొని ఈ సిఫారసు చేసింది.

“ఉభయ ప్రాంతాల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పర్చడమే మంచింది. దానికి హైదరాబాద్‌ రాష్ట్రమని నామకరణం చెయ్యవచ్చు. 1961 ప్రాంతంలో జరుగబోయే సాధారణ ఎన్నికల తర్వాత ఒకవేళ హైదరాబాద్‌ (తెలంగాణ) రాష్ట్ర శాసనసభ్యులలో మూడింట రెండువంతుల మంది అంగీకరిస్తే ఆంధ్ర రాష్ట్రంలో విలీనీకరణ గురించి ఆలోచించవచ్చు. అది జరగని పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగవలసి ఉంటుంది.” (ఎస్‌ఆర్‌సి రిపోర్టు, పేరా 386, 388)

ఎస్‌ఆర్‌సి సిఫారసులతో బేంబేలెత్తిన ఆంధ్రనాయకత్వం ఢిల్లీకి పరుగులు తీసింది. ఢిల్లీ నాయకత్వాన్ని లోబర్చుకున్నది. విలీనానికి వ్యతిరేకంగా ఉన్న నెహ్రూ కూడా అయిష్టంగానే విలీనానికి అంగీకరించాడు. దానికంటే ముందే ముఖ్యమంత్రి బూర్గులను లోబర్చుకొని అసెంబ్లీలో విలీనానికి అనుకూలంగా తీర్మానం చేయించినారు. 1956 మార్చి 5న నిజమాబాద్‌లో భారతసేవక సమాజ్‌ ఏర్పటుచేసిన బహిరంగ సభలో నెహ్రూ విలీనాన్ని ప్రకటించాడు. వివాహంతో పాటు విడాకుల పత్రాన్ని కూడా రాసిపెట్టినాడు ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రూ. ఆయన మాటల్లోనే –

”ఒక అమాయకురాలి (తెలంగాణ) పెండ్లి ఒక తుంటరి పిల్లవానితో (ఆంధ్ర) జరుగనున్నది.”

”తెలంగాణ ఆంధ్రప్రాంతాలు కలిసి ఉండే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు ఇచ్చుకున్నట్లే కొంత కాలం తర్వాత రెండు ప్రాంతాలు విడిపోవచ్చు.”
(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ : 6.3.1956)

ఆ రకంగా ప్రధానమంత్రి నెహ్రూ వ్యతిరేకించినా, ఎస్సార్సీ సిఫార్సులు విలీనానికి విరుద్ధంగా ఉన్నా, తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విలీనం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటయ్యింది.

పెద్దమనుషుల ఒప్పందం

ముందే చెప్పుకున్నట్లు విలీనం షరతులతో కూడుకున్నది. విలీనానికి ముందు ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది. దాన్నే పెద్ద మనుషుల ఒప్పందం (Gentlemen’s Agreement) అంటాము. ఆంధ్రుల పక్షాన బెజవాడ గోపాలరెడ్డి (ముఖ్యమంత్రి), నీలం సంజీవరెడ్డి (ఉపముఖ్యమంత్రి), గౌతుల లచ్చన్న (మంత్రి), అల్లూరి సత్యనారాయణ రాజు (పిసిసి అధ్యక్షుడు) తెలంగాణ పక్షాన బూర్గుల రామకృష్ణారావు (ముఖ్యమంత్రి), కొండా వెంకట రంగారెడ్డి (మంత్రి), మర్రి చెన్నారెడ్డి (మంత్రి) జెవి. నరసింగరావు (పిసిసి అధ్యక్షుడు) ఈ ఒప్పందంపై జూన్‌ 19, 1956న) సంతకాలు చేశారు.

పెద్దమనుషుల ఒప్పందంలో ముఖ్యమైన అంశాలు :

ఖర్చు ఆంధ్ర, తెలంగాణలు 2:1 నిష్పత్తిలో భరించాలి.
తెలంగాణ మిగులు ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధికే వినియోగించాలి.
సమైక్య రాష్ట్రంలో ముల్కీరూల్సు కొనసాగుతాయి.
తెలంగాణ ప్రాంత సమగ్రాభివృద్ధి కొరకు ప్రాంతీయ మండలి ఉండాలి. నీటిపారుదల, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ వ్యవహారాలు, మండలి పరిధిలో ఉంటాయి. తెలంగాణ భూములను ఇతర ప్రాంతాలు వారు మండలి అనుమతి లేకుండా కొనుటకు వీలుండదు
ముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి తెలంగాణవాడై ఉండాలి. ముఖ్యమంత్రి తెలంగాణ వాడైతే ఉపముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం నుండి ఉండాలి.
పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన మరుక్షణం నుండే ఉల్లంఘించడం ప్రారంభించారు. ఆంధ్రప్రాంతం నుండి ముఖ్యమంత్రి అయిన సంజీవరెడ్డి తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రిని నియమించవల్సి ఉండే. అంతవరకు తాను నిర్వహించిన అదే పదవిని ఆరోవేలుగా ప్రకటించి ఉపముఖ్యమంత్రిని నియమించడానికి నిరాకరించాడు.

ముల్కీరూల్సు ఉల్లంఘనలు

పెద్దమనుషుల ఒప్పందంలో ముల్కీరూల్సు కొనసాగిస్తామన్న హామీ అత్యంత ప్రధానమైనది. 1956 నుండి 1975 వరకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలులో ఉన్నాయి. 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడానికి ముల్కీ రూల్సును ఉల్లంఘించి వేలాది మంది ఆంధ్రులు తెలంగాణ ఉద్యోగాలలో చొరబడడమే కారణం. 1956 నుండి 1969 నాటికే సుమారు 22వేల మంది ఆంధ్రా ఉద్యోగులు ముల్కీరూల్సుకి విరుద్ధంగా తెలంగాణలో చొరబడ్డారని ఆనాడు ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఉద్యమానికి జడిసి ఈ 22వేల మందిని వెనక్కి పంపడానికి జీవో 36 ను బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జారీ చేసింది. జీవో జారీ చేస్తూనే మరోవైపు ఆంధ్రా ఉద్యోగులను కోర్టుకి వెళ్ళమని ప్రోత్సహించింది. ఆంధ్రా ఉద్యోగులు జీవో 36 చెల్లదని, దాన్ని కొట్టివేయమని అభ్యర్థిస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. వారి వాదనలను మన్నిస్తూ 36 జీవో చెల్లదని దీన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పు వచ్చేనాటికి జీవో 36ను జారీ చేసిన బ్రహ్మనందరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయించి తెలంగాణవాడయిన పి.వి. నరసింహారావును 1971లో ముఖ్యమంత్రిని చేశారు. అప్పటికే 1971 మార్చి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణాలోని 14 లోక్‌సభా స్థానాలలో 11 స్థానాలను తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులకు కట్టబెట్టి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు ప్రభలంగా వెల్లడించి ఉన్నారు. అయితే 1971 నాటికి ఉద్యమ ఉదృతి కొంత తగ్గింది.

హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు చివరకు అక్టోబరు 16, 1972 రోజు ముల్కీరూల్సు రాజ్యంగబద్దమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 36 జీవో అమలుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును గౌరవించవలసింది పోయి జై ఆంధ్రాఉద్యమాన్ని లేవదీసినారు. ఎటువంటి షరతులు, హామీలు, ఒప్పందాలు లేని ఆంధ్రప్రదేశ్‌ ఉండాలి. లేనట్లయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని వారి డిమాండు. జై తెలంగాణ ఉద్యమానికి లొంగని, 370 మంది విద్యార్థుల రక్తతర్పణాన్ని నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం, జై ఆంధ్రా ఉద్యమానికి లొంగిపోయి 1973 జనవరిలో పి.వి. నరసింహారావును ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి రాష్ట్రపతి పాలన విధించింది.

రాజీమార్గంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సెప్టెంబరు 1973లో ఆరుసూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. ఆరుసూత్రాల పథకానికి చట్టబద్దత కల్పించడం కోసం 32వ రాజ్యాంగం సవరణ చేసి ఆర్టికల్‌ 371డి ని పొందుపర్చారు. ఈ ఆర్టికల్‌ ద్వారా భారత రాష్ట్రపతికి దఖలు అయిన అధికారాలతో రాష్ట్రపతి ఉత్తర్వులు 18.10.1975 న జారీ అయినాయి.

ఆరుసూత్రాల పథకం చట్టబద్దం కాగానే పథకం అమలు ప్రక్రియ తెలంగాణకు గొడ్డలిపెట్టయింది. ఈ ప్రక్రియలో

సుప్రీంకోర్టు ధృవీకరించిన ముల్కీరూల్సు రద్దయినాయి.
రాష్ట్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రాంత ఆదాయవ్యయాలను విడిగా చూసే ఆనవాయితీకి తెరదించారు.
ఒకే ఒక జోన్‌గా ఉన్న తెలంగాణ రెండు జోన్లుగా విడిపోయింది.
15 సంవత్సరాల స్థిరనివాస పరిమితిని నాలుగేండ్లకు తగ్గించారు.
ఆరుసూత్రాల పథకం ఆధారంగా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఒకవైపు స్థానికులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తూనే మరొకవైపు సెక్రటేరియట్‌, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, కార్పోరేషన్లు, బోర్డులు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్‌ సంస్థలు యూనివర్శిటీలకు స్థానిక రిజర్వేషన్లు వర్తించకుండా మినహాయించారు. ఈ కారణంగా పైన చెప్పిన సంస్థల్లో తెలంగాణకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రభుత్వ యంత్రాంగంలో కోస్తా ఆంధ్రా ఆధిపత్యం వ్యవస్థీకృతం అయ్యింది.కేంద్రీకృతమైన కోస్తా ఆధిపత్యం వల్ల అన్ని రంగాలలో తెలంగాణ వివక్షకు నిర్లక్ష్యానికి గురి అయ్యింది. ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియమాకాలలో తెలంగాణ అన్యాయానికి బలి అయ్యింది.

రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు :

ఆరుసూత్రాల పథకంలో భాగంగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయినాయి గాని ఉల్లంఘనల పరంపర మాత్రం ఆగిపోలేదు.

రాష్ట్రపత్తి ఉత్తర్వులను ఉల్లంఘించి 1975 నుండి 1985 నాటికి అంటే పదేళ్ళలోనే తెలంగాణలో అక్రమంగా చొరబడిన స్థానికేతరుల సంఖ్య 58 వేలు ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఈ ఉల్లంఘనల్ని సవరించి, అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపి, ఆ ఖాళీలలో తెలంగాణ వారిని భర్తీ చెయ్యాలని జీవో 610 చెబుతున్నది. మూడునెలల్లో అమలుకావాల్సిన జీవో 22 సంవత్సరాలైన అమలుకాలేదు. అమలుచెయ్యడానికి వలసప్రభుత్వాలు పెనుగులాడుతున్నాయి. వక్రీకరించి కొత్త జీవోలు సర్క్యులర్లు జారీ చేస్తున్నాయి. 610 జీవో అమలుపేరిట మళ్ళీ తెలంగాణ వారినే బలిచేయడానికి రంగం సిద్ధమవుతున్నది. విభజించి పాలించు అన్న వలసవాదుల సిద్ధాంతాన్ని ఆంధ్రావలసవాదులు తూ.చ తప్పకుండా అమలుచేసి తెలంగాణ జిల్లాల మధ్య బేధాభిప్రాయాలను సృష్టిస్తున్నారు. ఈచారిత్రక నేపథ్యంలో ముల్కీరూల్సు, ఆరుసూత్రాల పథకాన్ని మరోసారి విశ్లేషించుకోవాల్సి ఉంది.

ఆరుసూత్రాల పథకంలో ఆరుసూత్రాలు ఏమిటి?

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని నగరం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధిని వేగవంతం చెయ్యాలి. రాష్ట్రస్థాయిలో ఒక ప్లానింగు బోర్డును, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సబ్‌కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధి ప్రక్రియను పర్యవేక్షించాలి.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేరకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రవేశాలు కల్పించాలి. హైదరాబాద్‌ నగరంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఈ ప్రాంత విద్యాసౌకర్యాలను మెరుగుపరచాలి.
రాష్ట్ర పరిపాలనావసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా పేర్కొన్న ఉద్యోగాలలో, ప్రత్యేకంగా పేర్కొన్న మేరకు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి.అవి ఏమనగా (1) నాన్‌-గజెటెడ్‌ ఉద్యోగాలు (సెక్రటేరియట్‌, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాలు, హైదరాబాద్‌ సిటీ పోలీసుశాఖలను మినహాయించి) (2) స్థానిక సంస్థల్లో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు (3) తహసీలుదారు, జూనియర్‌ ఇంజనీరు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ మొ|| పోస్టులు.
ప్రమోషన్స్‌ కొరకు స్పెసిఫైడ్‌ గజిటెడ్‌, మొదటి మరియు రెండవ గజిటెడ్‌ స్థాయి ఉద్యోగాలను లోకల్‌ క్యాడర్లుగా వర్గీకరించాలి.
సర్వీసు విషయాలలో నియమాకాలు, సీనియారిటీ, ప్రమోషన్లు తదితర వివాదాలను పరిష్కరించేందుకు హైకోర్టు అధికారాలున్న అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పర్చాలి. ట్రిబ్యునల్‌ తీర్పులకు రాష్ట్ర ప్రభుత్వం విధిగా కట్టుబడి ఉండాలి.
పై అంశాలకు చట్టబద్ధత కల్పించేందుకు రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించాలి. పై అంశాలపై తగిన విధంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్రపతికి అధికారం లభిస్తుంది.
పైన వివరించిన సూత్రాల అమలు వలన ముల్కీ రూల్సు మరియు ప్రాంతీయ కమిటి కొనసాగింపు అనవసరమైవుతాయి.
పైన వివరించిన ఆరు సూత్రాలలో మొదటి ఐదు సూత్రాలు మాత్రమే కార్యాచరణకు సంబంధించినవి. ఆరవసూత్రం మొదటి ఐదు సూత్రాల అమలుతో ముడిపడిన అంశం. ఇపుడు మొదటి ఐదు సూత్రాలు ఎట్లా అమలయినాయి. అవి ఏ మేరకు తమ లక్ష్యాలని నెరవేర్చినాయో విశ్లేషించి ఆరవ సూత్రం యొక్క ప్రాముఖ్యతని, ఇవ్వాల్టి సందర్భాలలో దీని ప్రాసంగికతను విశ్లేషించుకుందాం.

1. ఒకటవ సూత్రంలో చెప్పిట్లు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధిని వేగవంతం చెయ్యాలి. తెలంగాణ మిగతా ప్రాంతాలలో పోల్చి చూసినపుడు అన్ని రంగాలలో వెనుకబడిన ప్రాంతమే. ముఖ్యంగా సాగునీటి రంగం, విద్యారంగాలలో తెలంగాణ వెనుకబాటుతనం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. 1975 నుండి ఇప్పటిదాకా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు అటుంచితే అభివృద్ధి క్రమం మరింత మందగించింది. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో నెట్టివేయబడింది. విలీనానికి ముందు తెలంగాణలో చెరువుల కింద సాగే వ్యవసాయం చెరువలను నిర్లక్ష్యం చేసినందువల్ల గ్రామీణ వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. వ్యవసాయం మీద ఆధారపడిన లక్షలాది జనం దేశాలు పట్టి వలసలు పోయినారు. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచే 16 లక్షల మంది ప్రజలు గ్రామాలు వదిలి వలసలు పోయినట్లు అంచనాలున్నాయి. వ్యవసాయం చుట్టూ అల్లుకొని ఉన్న కులవృత్తులూ ధ్వంసం అయిపోయినాయి. ఆ వృత్తుల మీద బతుకులు వెళ్ళదీసిన జనం బతుకులు ధ్వంసం అయినాయి. గత పదేళ్ళలో రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యలో 80% తెలంగాణలో జరిగినవే. సాగునీటి సౌకర్యాల నిష్పత్తి విలీనం నాటికి ఆంధ్ర తెలంగాణల మధ్య 1.7:1 ఉంటే 2004 నాటికి అది 3.8 :1 కి పెరిగిపోయింది. సహకార బ్యాంకుల ద్వారా తెలంగాణకు అందిన రుణాలు 28% ఉంటే ఆంధ్రలో అది 72% ఉన్నది.

విద్యారంగంలో తెలంగాణపట్ల ప్రభుత్వానిది వివక్షా పూరిత విధానమే. వివిధ ప్రాంతాలలో యూనివర్శిటీలకు ప్రభుత్వం ఇస్తున్న గ్రాంటులను చూస్తే ఈ వివక్ష తెల్సిపోతుంది.

యూనివర్శిటీ గ్రాంటు ఒక్కవిద్యార్థికి :

రాయలసీమ
శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ రూ. 37,500
కృష్ణదేవరాయ యూనివర్శిటీ రూ. 25,000

కోస్తాంధ్ర ప్రాంతం
ఆంధ్ర యూనివర్శిటీ రూ. 35,500
నాగార్జున యూనివర్శిటీ రూ. 22,700

తెలంగాణ ప్రాంతం
ఉస్మానియా యూనివర్శిటీ రూ. 17,400
కాకతీయ యూనివర్శిటీ రూ. 14,000

ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు రాయలసీమ, ఆంధ్రాకు 75.93% అయితే తెలంగాణకు 24.07% మాత్రమే. అయితే రాజధాని నగరంలో వలసవాదులు అడ్డా బిఠాయించిన ప్రాంతాలైన బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌ ప్రాంతాలను మాత్రం అభివృద్ధి పర్చి మిగతా నగరాన్ని మురికి కూపంగా మార్చి, ఇవాళ తామే హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి పరచామని గప్పాలు కొడుతున్నారు. ఆరుసూత్రాలలో మొదటిది అత్యంత ముఖ్యమైంది పూర్తిగా నిర్వీర్యమైంది.

2. రెండవ సూత్రంలో చెప్పినట్లు హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం అయితే ఏర్పాటయింది గాని అది ఈ ప్రాంతంలో విద్యా సౌకర్యాలను మెరుగుపర్చడంలో ఏ పాత్ర పోషించలేదు. విద్యాభివృద్ధికి ఏ విధంగానూ దోహాదం చేయలేదు. యూనివర్శిటీలోని అధ్యాపకపోస్టులు ఇతర ఉద్యోగాలు అన్నీ స్థానికేతరుల వశమైనాయి. విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి తెలంగాణ విద్యార్థులకు ఏ ప్రాధాన్యత లేదు. అందువల్ల విశ్వవిద్యాలయం తన లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది. దీనికి తోడు హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం సహా అన్ని కాలేజీలలో స్థానికేతరులు చొరబడి పోతున్నారు. ఎందుకంటే ఆరుసూత్రాల పథకం ప్రకారం హైదరాబాద్‌లో 4 ఏళ్ళ స్థిరనివాసం ఉన్న ఆంధ్రులను స్థానికులుగా మార్చివేస్తుంది. అంతకుముందు హైదరాబాద్‌ నగరంలోని విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకుఅందుబాటులో ఉండేవి. ఆరుసూత్రాల పథకం కారణంగా అవి ఎండమావులుగా మారిపోయినాయి. ఈ విధంగా రెండో సూత్రంఎందుకు పనికిరాని సూత్రంగా మారిపోయింది.

3. ఇక మూడోసూత్రం ఉద్యోగాలకు సంబంధించినది. స్పెసిఫైడ్‌ గజిటెడ్‌, ఒకటం, రెండ గజిటెడ్‌ స్థాయి ఉద్యోగాలలో, కొన్ని పేర్కొన్న ఉద్యోగాలలో, నాన్‌గజిటెడ్‌ ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఈ విషయాలన్నీ పొందుపర్చారు.

32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 371డి ని ప్రత్యేకంగా రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్‌ 371డి ఏం చెబుతుందంటే

” Article 371D Special Provisions with respect to the state of Andhra Pradesh (1) The president may order made with respect to the state of A.P. provide having regard to the requirements of the state as whole for equitable oppertunities and fecilities for the people belonging to different parts of the state in the matter of public employment and in the matter of education and different provision may be made for various parts of the state.”

ఆర్టికల్‌ 371డి దఖలు పర్చిన అధికారాలతో రాష్ట్రపతి ఉత్తర్వులు 18-10-1975న జారీ అయినాయి. దీన్నే ” The Andhra Pradesh public employment (organisation of local cadres and regulation of Direct recruitment) order 1975 ” గా పిలుస్తారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా జొ.వో ఎం.ఎస్‌.నెం 674 తేది : 20-10-1975న ప్రభుత్వంజారీ చేసింది. స్థూలంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని అశాలు ఇవి

రాష్ట్రాన్ని మొత్తం 6 జోన్లుగా విభజించారు. జోన్లు 1,2,3లు కోస్తా, జోను 4 రాయలసీమ , జోన్లు 5,6 తెలంగాణ జిల్లాలకు చెందినవి.
జిల్లా పోస్టుల్లో 80%, నాన్‌గెజిటెడ్‌ జోనల్‌ పోస్టుల్లో 70%, స్పెసిఫైడ్‌ గజిటెడ్‌ పోస్టులో 60% స్థానికులకు రిజర్వేషన్‌ కల్పించారు. మిగతా ఓపెన్‌మెరిట్‌ ద్వారా భర్తీ చెయ్యాలి. ఇవి అన్‌రిజర్వ్‌డ్‌గా పరిగణించాలి.
పదవతరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ వ్యక్తిని అక్కడి స్థానికుడిగా పరిగణిస్తారు.
రాష్ట్రపత్తి ఉత్తర్వుల పరిధి నుండి సెక్రటేరియట్‌, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాలు, కార్పోరేషన్లు, బోర్డులు ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందే సంస్థలు, విశ్వవిద్యాలయాల మినహాయించినారు. అంటే ఇక్కడ స్థానిక రిజర్వేషన్లు వర్తించవు. అయినప్పటికీ ఆర్టికల్‌ 371డి స్ఫూర్తితో ఈ అన్ని కార్యాలయాలలో అన్ని ప్రాంతాల లోకల్‌ క్యాడర్లకు ఫెయిర్‌ సూత్రాన్ని అమలుచెయ్యాలి.
1975లో జారీ అయిన ఉత్తర్వులు యధేచ్ఛగా ఉల్లంఘనకు గురి అయినాయి. 1985 లో 610 జివో జారీ చేసేనాటికే రాష్ట్రపత్తి ఉత్తర్వులకు విరుద్ధంగా 58వేల మంది తెలంగాణలో నియమించబడినారని శ్రీ జయభారత్‌రెడ్డి కమిటి నిర్ధారించింది. వీరిని వెనక్కి పంపి ఆ ఖాళీలలో స్థానికులను భర్తీ చెయ్యామని 610 జీవోలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో అంటే మర్చి 1986 నాటికే అమలుకావాల్సిన జీవో 22 సంవత్సరాల తర్వాత ఇంకా వివాదాలకి కారణమవుతున్నది. 1985లో 610 జీవో అమలు కాకపోగా ఉల్లంఘనల పరంపర కొనసాగింది. ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఈ అక్రమ చొరబాటుదారుల సంఖ్య 2 లక్షలకు పైనే ఉంటుందని అంచనా.

రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేనటువంటి కార్యాలయాలలో ఫెయిర్‌షేర్‌ సూత్రాన్ని పాటించకపోవడం వల్ల సచివాలయంలో 9%, శాఖాధిపతుల కార్యాలయాల్లో 16% ప్రభుత్వరంగ సంస్థల్లో 20% మాత్రమే తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. ఈ కార్యాలయాలన్నీ కోస్తామయం అయి పాలనా యంత్రాంగంలో కోస్తా ఆంధ్రా ఆధిపత్యం కేంద్రీకృతమైంది. రాష్ట్రపాలనా వ్యవస్థలో తెలంగాణకు నామమాత్రపు ప్రాతినిధ్యం వల్లనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో, నిధుల కేటాయింపులో వివక్షకు నిర్లక్ష్యానికి గురి అయ్యింది. రాష్ట్రపత్తి ఉత్తర్వులు ఎట్లా ఉల్లంఘనకు గురి అయినాయో, రాష్ట్రపతి ఉత్తర్వులను ఎట్లా వక్రీకరించుకొని నియమాకాలు, బదిలీలు, డిఫ్యూటేషన్లు జరుపుకున్నారో గిర్‌గ్లానీ కమీషన్‌ సవివరంగా తమ తుది నివేదికలో పొందుపర్చింది. రాష్ట్రపత్తి ఉత్తర్వుల ఉల్లంఘన అంటే రాజ్యాంగ ఉల్లంఘనతో సమానం. అందువల్ల ఆరుసూత్రాలలో అత్యంత ముఖ్యమైన మూడోసూత్రం ఒక బూటకంగా మారింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సాక్ష్యంగా మన ముందు నిలబడి ఉంది.

4. నాల్గవ సూత్రం ప్రకారం రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పడింది. నాల్గవ సూత్రంలో పేర్కొన్నట్లు ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పులకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉండాలి. అయితే తెలంగాణ ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన వేలాది తీర్పులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసి ట్రిబ్యునల్‌ని అపహాస్యం చేసింది. చాలా కేసులలో తెలంగాణ ఉద్యోగులకు ట్రిబ్యునల్‌లో చుక్కెదురయ్యింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పరిరక్షించడం ట్రిబ్యునల్‌ వైపల్యం చెందింది. ఇటీవలి 610జీవో బదిలీల మీద ఇచ్చిన స్టేలే అందుకు సాక్ష్యం. ఈ విధంగా నాల్గో సూత్రం అమలయినట్లు బయటకు కనిపిస్తున్నా ఆచరణలో అంతిమంగా వైఫల్యం చెందింది.

5. ఐదవ సూత్రం ప్రకారం మొదట నాల్గు సూత్రాలను చట్టబద్దం చేయడానికి రాజ్యాంగ సవరణ జరిగింది. మొదటి నాల్గు అంశాలకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడినాయి. అయితే నాల్గు సూత్రాలు అని ఉద్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఘోరంగా విఫలం అయినాయి. అందువల్ల ఈ ఐదవ సూత్రం ప్రకారం జరిగిన రాజ్యాంగ సవరణలకు ఏ విలువా లేకుండా పోయింది.

6. ఇక ఆరవ సూత్రం చెబుతున్న ప్రకారం మొదటి 5 సూత్రాలు అమలవుతే ముల్కీ రూల్సు మరియు ప్రాంతీయ కమిటీ అవసరం లేనివి అవుతాయి. దీన్ని మరో రకంగా విశ్లేషించుకుంటే మొదటి 5 సూత్రాలు అమలుకాని పక్షంలో ముల్కీరూల్సు, ప్రాంతీయ కమిటి అవసరం అవుతాయి. మొదటి 5 సూత్రాలు అమలు కావడంలో ఎంతగా వైఫల్యం చెందినాయో చూసాం. ఆ కారణంచేత ఆరవ సూత్రంలో చెప్పినట్లు ఇవ్శాళ ముల్కీరూల్సు, పూర్వపు అధికారాలతో ప్రాంతీయ కమిటీ అవసరం ఉన్నది. ఆరు సూత్రాలు ఆచరణలో వైపల్యం చెందిన కారణంగా ఆరవ సూత్రంలో చెప్పినట్లు ముల్కీరూల్సును, ప్రాంతీయ కమిటీని పూర్వపు అధికారాలతో పునరుద్ధరించవలసి ఉన్నది. 1972లో సుప్రీంకోర్టు ధర్మాసనం ముల్కీరూల్సు రాజ్యాంగబద్దమేనని తీర్పు ఇచ్చినందువల్ల, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల ఒక ప్రాసంగికతను సంతరించుకున్నది. ఆరు సూత్రాల పథకం అమలుకాకపోవడం వల్ల ముల్కీరూల్సుని, ప్రాంతీయ కమిటీని 1975కు ముందున్నట్లుగా తిరిగి పునరుద్ధరించవలసిన అగత్యం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇవ్వాళ తెలంగాణ ప్రజానీకం ముల్కీరూల్సుని, పూర్వపు అధికారాలతో ప్రాంతీయ కమిటీని పునరుద్ధరించమని డిమాండ్‌ చెయ్యవల్సి వస్తున్నది.

కాలం చెల్లిన ముల్కీరూల్సుని పునరుద్ధరించమని డిమాండ్‌ చెయ్యడం పట్ల ఆంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాలు, మేధావులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముల్కీ రూల్సు రద్దయినప్పటికీ వాటికి కాలం చెల్లలేదని మేం భావిస్తున్నాం. నిజానికి ఎన్నడూ లేనంతగా ఈనాడే ముల్కీ రూల్సు అవసరం ఉందని మేం స్పష్టం చేస్తున్నాం.

ముల్కీ రూల్సు పునరుద్ధరించమని అడగడమన్నా, 610 జీవో అమలుచెయ్యమన్నా, ఆర్టికల్‌ 371డి ప్రకారం ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడమన్నా పాలనా యంత్రాంగంలో తెలంగాణకు న్యాయబద్దమైన వాటాను కోరడమే. పాలనాయంత్రాంగంలో న్యాయబద్దమైన వాటా ప్రజల సహజ సిద్ధహక్కు. ఆ హక్కును ఆంధ్రాపాలకవర్గాలు తెలంగాణకు నిరాకరిస్తున్నాయి. కనుకనే ఇవ్వాళ ముల్కీరూల్సు పునరుద్ధరణ డిమాండు ముందుకు వచ్చింది. ఇవ్వాళ కాలం చెల్లింది ఆరుసూత్రాల పథకానికే గాని ముల్కీ రూల్సుకి కాదు. రాష్ట్రపాలనా యంత్రాంగంలో తెలంగాణకు న్యాయబద్దమైన వాటా దొరకనంత కాలం ముల్కీరూల్సుకు కాలం చెల్లదు.

610 G.O

GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT

SIX POINT FORMULA - Andhra Pradesh Public Employment (Organisation of Local Cadres & Regulation of Direct Recruitment) Order, 1975 - Alleged violation in the implementation of Six Point Formula in Zones V to VI - Rectification - Order - Issued.

GENERAL ADMINISTRATION (SPF-A) DEPARTMENT

G.O.Ms.No.610 Dated the 30-12-1985
Read the following


1. G.O.Ms.No.674, G. A. (SPF-A) Dept., dated 20-10-1975.
2. G.O.P.No.728 , G. A. (SPF-A) Dept., dated 01-11-1975 .
3. G.O.P.No.729 , G. A. (SPF-A) Dept., dated 01-11-1975 .
4. From the President, Telangana Non-Gazetted Officers Union,
letter dated 05-12-1985* * *
O R D E R:

The G.O. 1st read above, which is generally known as Presidential Order contains principles regarding Organisation of Local Cadres allotment of personnel of the various Departments to the various local cadres, method of direct recruitment to the various categories, inter-local cadre in transfers etc. of the employees holding those posts. In the G.Os 2nd and 3rd read above clarificatory instructions were issued regarding procedure for implementation of the various provisions of the Presidential Order.

2. In accordance with the provisions of the Presidential Order, local cadres have been organized to the various categories of posts in all Government Departments and allotment of personnel was made as per the guidelines contained in paragraph 4 of the said order.

3. In the representation 4 th cited, the President, Telangana Non-Gazetted Officers Union has represented that certain allotments have been made in violation of the provisions of the Presidential Order.

4. The Government after carefully examining the issues raised in the representation and after having wide ranging discussion with the representatives of the Union have entered into an agreement with the Telangana Non-Gazetted Officers Union on 07-12-1985 .

5. As per the terms of agreement the following orders are issued:

(1) The employees allotted after 18-10-1975 to Zones V & VI in violation of zonalisation of local cadres under the Six Point Formula will be repatriated to their respective zones by 31-03-1986 by creating supernumerary posts wherever necessary.

(2) In respect of Jurala, Srisailam Left Canal and Sriramsagar Project Stage-II, all the staff in the Non-Gazetted categories both technical and non-technical including Asst. Executive Engineers (formerly JEs) coming under zonalisation of local cadres under the Presidential Order of 1975 who were posted to the projects from outside zones V and VI after 01-03-1983, will be retransferred to their respective zones and posted either in existing vacancies in various Government Establishments in those zones or in supernumerary posts where vacancies are not available. Towards this the Government will also move the Government of India for seeking amendment to Government of India’s notification G.S.R. 525(E) dated 28-06-1985 to give retrospective effect to this order with effect from 01-03-1983 .

(3) (a) In respect of appeals filed against orders of allotment made under paragraph 4 of the Presidential Order of 1975 to the competent authority in time and where such appeals are still pending disposal, all such cases where details are furnished by the T.N.G.Os Union or individuals, shall be disposed of by 31-03-1986.

(b) As a result of the above exercise, consequential vacancies if any, arising shall be filled up as per the procedure laid down under the Presidential Order.

(4) In respect of first level Gazetted posts in certain Departments which are outside the purview of the Presidential Order, action should be taken to review the question of inclusion of such posts also in the scheme of localization and the matter should be taken up with the Government of India for suitable amendment to the said order.

(5) The posts in Institutions/Establishment notified in G.S.R. No.526 (E) dated:18-10-1975 shall be filled up by drawing persons on tenure basis from different local cadres on an equitable basis as per the orders issued in the G.O. 3rd read above.

(6) The provision in Para 5(2) (c) of the Presidential Order relating to inter-local cadre transfers shall be strictly implemented and such transfers shall be effected only under exceptional circumstances in public interest.

(7) Action will be initiated in the concerned departments in cases brought to their notice regarding bogus registrations in Employment Exchanges.

(8) On receipt of complaints, if any, made by the TNGOs Union relating to irregular allotments of candidates particularly to Zones V and VI in the category of Village Assistants the concerned department shall take up the matter with the A.P. Public Service Commission and take such measures as may be necessary to rectify the irregular allotments made if any.

(9) The possibility of allotting persons from within the same zone/multi-zone against non-local vacancy in a particular local cadre will be examined in consultation with the APPSC.

(10) The T.N.G.Os Union will furnish to Government the service/ categories where for want of trained personnel, non-local candidates are being appointed in zones V and VI so that Government can provide training facilities in respect of such services/categories with a view to providing adequate opportunities for recruitment and appointment of local candidates in zones V and VI.

(11) The Departments of Secretariat shall complete the review of appointments/promotions made under the Presidential Order as required under Para 13 of the said order, by 30-06-1986.

(12) (a) Immediate action will be taken to finalise the Common Gradation List in respect of Assistant Engineers (Presently Dy. E.Es) as on 01-11-1956 , following the prescribed procedure under the S.R. Act. 1956.

(b) In respect of former Junior Engineers (Presently Asst.E.Es) the common gradation list published by the Government was quashed by the A.P. Administrative Tribunal and the Government had gone in appeal to the Supreme Court. Effective measures will be taken for the disposal of the matter before the Supreme Court, expeditiously.

(13) The matter relating to allotment of 7 non-local personnel in the cadre of Inspector of Local Fund Audit belonging to Zones I to IV, allotted to Zones-V and VI against their options, will be examined by the Department concerned keeping in view of the provisions of the Presidential Order.

(14) The question of repatriation of 13 Deputy Executive Engineers of the Public Health Department working in the city of Hyderabad to Zones I to IV will be considered by the Department concerned keeping in view the provisions of the Presidential Order.

6. The Departments of Secretariat who are concerned with the terms shall take immediate necessary steps to implement the orders in consultation with Law/General Administration Department, if necessary, about the legal implications/interpretation of the provisions of the Presidential Order.

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)

SHRAVAN KUMAR
CHIEF SECRETARY TO GOVERNMENT
To
All Secretaries to Govt.
All Departments of Secretariat

//TRUE COPY//

Sd/-
SECTION OFFICER

పోలవరాన్ని పునఃసమీక్షించాలి


రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వ్యవసాయం, విద్యుదుత్పత్తి, త్రాగునీరు, పారిశ్రామికాభివృద్ధే పోలవరం ప్రాజె క్టు ముఖ్యోద్దేశమని గత అరవై ఏళ్ళుగా ప్రభుత్వం చబుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు ను బ్యారేజిగా నిర్మించి దాదాపు 100 శతకోటి ఘనపుటడుగుల గోదావరి నీటిని కృష్ణానదిలోకి విజయవాడ వద్ద కలిసేటట్లు చేయవచ్చని ప్రఖ్యాత ఇంజనీర్లు ఎఎన్‌ ఖోస్లా 1953లోను, గుల్హటి 1963లోను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అలాగే పోలవరం బ్యారేజికి తగినంత నీరు సంవత్సరం పోడవునా సరఫరా చేసేందుకు గోదావరి ఎగువ ప్రాంతంలో దాని ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహి తలపై భారీ జలాశయాలు, జలవిద్యుత్‌ కేంద్రాలు నిర్మించాలని చెప్పారు.

నిపు ణుల సిఫారసులను పెడచెవిన పెట్టి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నివేదికను 1970లో తయారుచేసి, మళ్ళీ దాని స్వరూపాన్ని 1978లో మార్చింది. ఒరిస్సాలోని మోటు,ఛత్తీస్‌ఘడ్‌లోని కొంటా తాలూకాలలోని గిరిజన గ్రామాలు విపరీతమైన ముంపుకు గురయ్యే ప్రమాదమున్నందున వరదనీటి మట్టం 150 అడుగులకు మించరాదని బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఆ రాష్ట్రాలు షరతులు పెట్టాయి. ఆ మేరకు కేంద్ర జలవనరుల సంఘం 1979లో ఆయా రాష్ట్రాలకు తగు సూచనలతో లేఖ రాయడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం పోలవరం వరద తూముల సామర్ధ్యం 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహానికి మాత్రమే పరిమితమై నిర్మించాలని, ప్రాజెక్టు ఎత్తు సముద్ర మట్టానికి 150 అడుగుల స్థాయి వరకు ఉండాలన్న షరతులతో కూడుకున్నది.

దురదృష్టవశాత్తు 1986 ఆగస్టునెలలో దాదాపు 36 లక్షల క్యూసెక్కుల స్థాయి లో వరద వచ్చింది. ఈ వరదను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 500 సంవత్సరాలకొక్క సారి వచ్చే వరదగా పరిగణించి 2005లో ఈ అంచనాలననుసరించి ముంపు కు గురయ్యే స్థలాలను, గ్రామాలను, అడవులను గుర్తించడమే కాకుండా దానికి తగ్గ ట్టు నిర్వాసితుల పునరావాస పథకాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమ తిని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిని పొందింది. అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ముంపుకు గురవుతున్న ప్రాంతాల విషయమై ఆయా రాష్ట్రాల తో సంప్రదించి, అనుమతులు పొందకుండానే ప్రాజెక్టు కాలువ నిర్మాణాన్ని బచా వత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టి వేగవంతం చేస్తోంది.

బచావత్‌ వడంబడికలో ఉన్న గరిష్ట వరదస్థాయిని 36 లక్షల నుంచి 2006లో ఎగువ రాష్ట్రా ల అనుమతి లేకుండానే దాదాపు 50 లక్షల స్థాయికి పెంచుతూ పోలవరం ప్రాజె క్టునిర్మాణానికి తదనుగుణమైన మార్పుల్ని చేయమని కేంద్ర జలసంఘాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. దీంతో ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు ముంపు విషయంలోనూ, గరిష్ట వరద స్థాయిని పెంచడంలోనూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతోందని సుప్రీంకోర్టులో దావావేశాయి. దీనికి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వరద పెరగడం వల్ల ముంపు ప్రాంతాలు పెరిగినప్పటికీ నష్టపరిహారా న్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నామనీ, వరద నష్టాన్ని నివారించడానికి గోదావరి దాని ఉపనదుల గట్టులకు ఇరువైపులా పటిష్టమైన కరకట్ట గోడలను ఎంత ఖర్చ యినా నిర్మిస్తామనీ వాదిస్తోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు తరువాత 1985 నుండి ప్రాజెక్టుల రూపకల్పనలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక మార్పులు వచ్చాయి.

అంతర్జాతీయ భారీ జలాశయాల సంఘ అధ్యక్షులుగా ఉన్న ఫ్రాన్సు, స్పెయిన్‌ దేశాల నిపుణు లైన లెంపరరీ మరియు బెర్గ్‌ల పరిశోధనల ప్రకారం గరిష్ట వరదను బేరీజు వేసేట ప్పుడు చారిత్రికంగా సంభవించే వరదలకంటే రెండు లేక మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో అంచనాలుండాలన్నారు. దాని ప్రకారం పోలవరం ప్రాజెక్టు రూపకల్ప నలో గరిష్ట వరద ప్రవాహం 2005 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన 36 లక్షల క్యూసెక్కుల కంటే కనీసం రెట్టింపయినా ఉండాలి. కానీ ఆగస్టు 2006లో సంభ వించిన భారీ వరద 28 లక్షల కూసెక్కులకే 100 గ్రామాలు అదనంగా భద్రా చలం ప్రాంతంలో మునిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు రూపకల్పనకై దాదాపు 50 లక్షల క్యూసెక్కులకు గరిష్ట వరద పరిమాణా న్ని ఎగువ రాష్ట్రాల అనుమతులు లేకుండానే పెంచారు. అంతర్జాతీయ నిపుణుల సూచనకు ఇవన్నీ విరుద్ధంగానే ఉన్నాయన్నది తేటతెల్లం.

ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంభవించే ప్రమాదాలు జరిగినపుడు ఇలాంటి భారీ ప్రాజెక్టులకు సంభవించే నష్టాలు భయంకరంగా ఉంటాయన్న వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరిం చడానికి వీలులేదు. కోట్లలో ఆస్తి నష్టం, అక్షల్లో ప్రాణ నష్టం ఉంటుందన్నది గమ నార్హం. ఇటువంటి ఘోర విపత్తుల్ని నిరోధించి గొదావరి డెల్టా సుస్థిరాభివృద్ధి సాధించాలంటే పోలవరం ప్రాజెక్టు బదులు బ్యారేజి నిర్మించడం చౌకయిన, భద్ర మైన చర్య అవుతుంది. ప్రఖ్యాత ఇంజనీరు డాక్టర్‌ కెఎల్‌ రావు పోలవరం ప్రాజెక్టు ప్రమాదభరితమైందని 1983లోనే హెచ్చరించారన్న విషయాన్ని మరువకూడదు. దానిస్థానే కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో రెండు పెద్ద జలాశయాలు ఆపైన పెద బళ్ళాల, ఎల్లంపల్లి, ఎదిర, దుమ్ముగూడెం, పోలవరం దగ్గర అదనంగా బ్యారేజి లు నిర్మించినట్టయితే గోదావరి జలాలను సద్విని యోగం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో రష్యన్‌ నిపుణులు వ్లాదిమిర్‌ స్మఖ్తిన్‌ పోలవరం దగ్గర ఆశించినంత నీరు లభ్యంకాదని, అందువల్ల పోలవరం నుండి కృష్ణానదిలోకి నీరు మళ్ళించడం సాధ్యం కాదని నిరూపించారు.

ఇదే అంశాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయో జనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. 75 శాతం నీటిలభ్యతవద్ద నదిలో ప్రవహిం చే నీటిని అనేక సంవత్సరాల గణాంకాలను పరిశీలించి రోజువారీ, నెలవారీ, సాంవత్సరిక ప్రవాహాలను లెక్కగట్టినట్ల యితే రోజువారీ, నెలవారీ ప్రవాహాల మధ్య అంతగా తేడా ఉండదు. అదే సాంవ త్సరిక ప్రవాహంతో సరిపోల్చినట్ల యితే నెలవారీ ప్రవాహం దాదాపు 10వ వంతు మాత్రమే ఉంటోంది. గోదావరి లో పోలవరంవద్ద లభ్యమయ్యే 530 టిఎంసి నీరు అదనంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ జాతీయ జలవనరుల సంస్థ (ఎన్‌డబ్యుడిఎ) వాదిస్తుంటే రష్యన్‌ నిపు ణులు తయారు చేసి అంతర్జాతీయ నీటి వనరుల నిర్వహణ సంస్థ (ఐడబ్యు ఎమ్‌ఐ)కు నివేదించిన రిపోర్టులో పోలవరం వద్ద భారీ స్థాయి నీటి కొరత 1300 టియంసిలుగా ఉందని తెలియజేసింది.

దీని ప్రకారం గోదావరి నుండి కృష్ణలో ప్రజలు, ప్రభుత్వం ఆశించిన ట్లుగా నీరు కలవడం అసాధ్యమని రష్యన్‌ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. అదే విషయాన్ని ప్రఖ్యాత ఇంజనీరు డాక్టర్‌ కెఎల్‌ రావు కూడా 1983లోనే చప్పారు. అంతేకాక, భూమండలంపై కాలుష్యం, ఉష్ణోగ్రత, వాతావరణ స్థితిగతులలో వస్తున్న దుష్ప రిణామాలవల్ల గోదావరినది పరీవాహ క ప్రాంతాల్లో రాబోయే కాలంలో వచ్చే తుపానుల ఉధృతి పెరగడం, తత్ఫలితం గా సంభవించే కుంభవృష్టి తీవ్రత, వ్యవధి పెరగనుందని, ఫలితంగా వరదల ప్రమాణం కూడా విపరీతంగా 20 నుండి 30 శాతం పెరుగుతుందని నిపుణుల అంచనా. ఇన్ని కష్టాలకోర్చి పోలవరం ప్రాజెక్టును అనుకున్నట్టే పూర్తిచేస్తే సాగు రీత్యా గణనీయమైన అభివృద్ధి సాధ్యమా అంటే అదికూడా అవాస్తవమని లెక్కలు చెప్తు న్నాయి.

క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లయితే ఈ ప్రాజెక్టువల్ల కుడి కాలవ కింద 3.2 లక్షల ఎకరాలకు, ఎడమకాలవ కింద 4 లక్షల ఎకరాలకు నీరు సరఫరా అవు తుందని ప్రతిపాదనలు చెప్తున్నప్పటికీ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తాడి పూడి పుష్కరం ఎత్తిపోతల పథకాలు, చాగల్నాడు పథకం తదితర నీటివనరుల పథకాలు పెంచడంతో సాగులోకి వచ్చే దాదాపు 4.5 లక్షల ఎకరాలు పోలవరం ఆయకట్టులో భాగమైపోతుంది. దాంతో పోలవరం ప్రాజెక్టువల్ల అదనంగా సాగు లోకి వచ్చే భూమి 2 నుండి 3 లక్షల ఎకరాల వరకు మాత్రమే ఉంటుందని అంచ నా. ఇక ఈ ప్రాజెక్టునుంచి 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేద్దామనుకొన్న ప్రభు త్వ ఆశయం నెరవేరడానికి వర్షాకాలం తప్ప మిగతా కాలంలో సాధ్యం కాదు.

ఏ వైపునుండి చూసినా పోలవరం ప్రాజెక్టును ఇంత భారీ స్థాయిలో నిర్మించడం లాభంకంటే నష్టాలే అధికం అన్నది నిపుణుల అంచనా. ఇప్పటికైనా రాయలసీమ, తెలంగాణ, కృష్ణాడెల్టా ప్రాంతాలలో వ్యవసాయాభివృద్ధికి పోలవరం ప్రాజెక్టును ఎలా రూపకల్పన చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి స్వాతంత్య్రసమరయో ధులను, విద్యావేత్తలను, పర్యావరణవేత్తలను ఆహ్వానించి వారి సలహాలు, సూచ నలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం మంచిది. భవిష్యత్‌ తరాల బాగోగులను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఆలోచ నాత్మకంగా వ్యవహరించి, భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి రాజ్యాంగం లోని 51ఎ (జి) నియమావళి ప్రకారం పర్యావరణం, ప్రకృతి వనరు లను సంర క్షించాల్సిన సమయం ఆసన్నమయింది.