Friday, April 25, 2008

మేడే చరిత్ర

- దేవరకొండ విన్సెంట్

అమెరికా లో కార్మిక సంఘాలు ( United States Federation of organized trade and labor unions) ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం మే 1, 1886 లో సమ్మె మొదలు పెట్టేరు. మే 3 తారీఖున మెఖార్మిక్ రీపర్ వర్క్స్ (Mccormik Reaper Works ) ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు నిరాయుధులుగా ఉన్న కార్మికులపై నిర్ధాక్షిణ్యం జరిగిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు అమరులయ్యారు.




దీనికి స్పందిస్తూ 1886 మే నాలుగవ తారీఖున చికాగో కార్మికులు పోలీసు కాల్పుల్లో మరణించిన కామ్రెడ్ల కు జోహార్లర్పించడానికి హేమార్కెట్ చౌకులో ప్రదర్శన చేసేరు. ఒక కోవర్టు విసిరిన బాంబు ఫలితంగా ఏడుగురు పోలీసులు చనిపోయారు. తదుపరి జరిగిన పోలీసు కాల్పుల్లో చాలా మంది కార్మికులు అమరులయ్యారు.(లెక్క ఈనాటికీ తెలియదు). రెండవ ఇంటర్నేషనల్, 1889 కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు,1890 మే 1 న, చికాగో కార్మికుల త్యాగాల స్మృతిలో, ఎనిమిది గంటల పనిదినం కోసం, వైద్య సదుపాయాల కోసం, ఇతర హక్కుల కోసం, అమెరికా, ఐరోపా ల లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. ప్రతి ఏడూ మేడే జరపాలని అనేక కార్మిక సంఘాలు నిశ్చయించాయి. కార్మిక వర్గం చిందించిన నెత్తుటికి చిహ్నంగా ఎర్ర జెండాను స్వీకరించింది 1889 కాంగ్రెస్ లోనే.(రెండవ ఇంటర్నేషనల్).తరువాత కాలంలో కార్మికోద్యమాలు అన్ని దేశాల్లో బలపడటం, విప్లవ విజయం ద్వారా 1917 లో రష్యాలో, 1949 లో చైనాలో రాజ్యాధికారాన్ని హస్త గతం చేసుకోవటం జరిగింది. ఇది కార్మికోద్యపు పురోగమన దశ. కోట్లాది కార్మికులు మేడే అంటే ఉత్సాహంతో కర్తవ్యాల్ని గుర్తు చేసుకుంటూ ఊరేగింపు చేసే రోజు.
1953 మొదలుకొని రష్యాలో, 1975 మొదలుకొని చైనాలో కార్మిక వర్గం అధికారాన్ని కోల్పోయి, రాజకీయంగా చాలా దేశాల్లో తిరోగమన దశలో ఉండటం ఈ రోజున భౌతిక వాస్తవం. గతంలో ఎన్నో త్యాగాల ద్వారా, కష్టాలకోర్చి సంపాదించిన హక్కులు హరించివేయబడటం ఈ రోజున చూస్తున్నాం.

వర్తమానం

సమసమాజ స్థాపన దిశలో పురోగమనాలతో పాటు తిరోగమనాలూ సంభవం అన్న సత్యాన్నికార్మిక వర్గం, వారి నాయకత్వం అవగాహన చేసుకోవటం ముఖ్యం. భవిష్యత్తులో స్థాపింపబడే సమసమాజ వ్యవస్థను ఈ తిరోగమనానికి గురికాకుండా ఎలా కాపాడుకోవాలి అన్న ప్రశ్నకు మసం సమాధానం ఇవ్వగలగాలి. పెటీ బూర్జువా వర్గం, మేధావులు, విద్యార్ధులూ, పెద్ద సంఖ్యలో ఉద్యమం లోకి రావటానికి ఇది కీలకం.
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం తీవ్రతరం ఔతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉపరితల రాజకీయంలో ఉన్న తిరోగమనాన్ని అధిగమించి భారత దేశంలో విప్లవోద్యమం పురోగమిస్తోంది. విప్లవోద్యమం అశేష ప్రజానీకం అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొంది. అందుకే అమెరికా సామ్రాజ్య వాదుల దృష్టిలో హైదరాబాదు పడింది. వారి ప్రయోగాల్లో భాగంగా మిలియన్ల డాలర్లు విరజిమ్ముతుందీ అందుకే. నేపాల్లో కార్మిక వర్గం కొన్ని విజయాలు సాధించినప్పటికీ నాయకత్వ లొంగుబాటు వల్ల విఫలమైంది.
మేధావులు, విద్యార్ధులు, గరితార్కిక భౌతిక వాదాన్ని ఆధ్యయనం చేసి కార్మిక వర్గ నాయకత్వం క్రింద పనిచేస్తూ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం కీలకం. మేడే 2007 న ఇదే మన కర్తవ్యం.

No comments:

Post a Comment