చట్టసభల్లో మహిళలను రిజర్వేషన్ కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. గురువారం ప్రధాని మాట్లాడుతూ రాష్ట్రాల శాసన సభలు, పార్లమెంట్‌ల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వలన పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావొచ్చని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 లక్షల కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నికవడం ప్రజా విధానాల్లో మార్పు తీసుకురావాల్సిన అవశ్యకతను చూపుతోందని ప్రధాని చెప్పారు. మహిళల విషయంలో సమాజ ధోరణిలో మార్పు రావాలని అన్నారు.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment