Tuesday, April 22, 2008

అక్షరం ‘ఆ’

అ అంటె ఓ రాడు ఓ అంటె నా రాదు = ఏమి తెలియదని అర్థం (ఒనమాలు రావనీ, అక్షరజ్ఞానం లేదనీ)
ఆ సందుల = ఆ మధ్య, అప్పట్లో
ఆం, ఆము = అన్నము (చిన్నపిల్లల్ని ఉద్దేశించి ‘ఆం’ తిన్నావా అంటాము) అవము
ఆందాక = అక్కడిదాకా, అప్పటివరకు
ఆందెం = ఆముదం
ఆంబుక్క పెట్టుడు = అన్నపు ముద్ద ఒకేసారి పెట్టుకోవడం, మరచిపోవడం
ఆంబోతు = బలిష్టమైన ఎద్దు
ఆంరస్త = జనసంచారం, రద్దీ గల రోడ్డు
ఆకరిచూపులు = అంతిమదర్శనం
ఆకలైతుంది అంటె రోకలి మింగుడు = ఒక జాతీయం
ఆకు ఏసుకునుడు = కిళ్ళీ వేసుకోవడం

No comments:

Post a Comment