Saturday, January 19, 2008
చిరంజీవి న్యూస్ ఛానెల్!
మెగాస్టార్ చిరంజీవి రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 26న తన రాజకీయ పార్టీపై ఒక ప్రకటన చేయబోతున్నారనీ, ఫిబ్రవరి ప్రథమార్థంలో పార్టీ పేరును ప్రకటించి, ఏప్రిల్ 7న కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు చేశారనీ బలమైన ప్రచారం జరుగుతోంది. ‘నూతన పరిపాలన ఆవిష్కరణ’ అనే నినాదంతో పార్టీని జనంలోకి తీసుకువెళ్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో తమ పార్టీ ఆశయాలను ప్రతిబింబించే విధంగా సామాజిక స్పృహ కలిగిన కథాంశంతో ‘అధినాయకుడు’ అనే కొత్త చిత్రాన్ని ఏ్‌ప్రిల్ మూడోవారంలో సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు. దీనికి పరుచూరి సోదరులు రచన, పవన్‌్ కల్యాణ్ స్ర్రీన్‌ప్లే ్‌అందించబోతున్నారంటూ వార్తా కథనాలు కూడా బయటకు వచ్చాయి. చిరంజీవి రాజకీయ ప్రవేశానికి జరుగుతున్న కసరత్తులలో భాగంగా తాజాగా ఆయన ఒక న్యూస్ ఛానెల్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.
No comments:
Post a Comment